Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: బైక్‌పై కాలేజీకి వెళ్తున్న శ్రీలక్ష్మీ ఆటోలో వెళ్తున్న సింధూ,గోపినీ చూస్తుంది. మీ అక్క ఆటోలోవెళ్తుందని మ్యాడీకి చెబుతుంది. మా అక్క హైదరాబాద్‌ వస్తే నాకు ఫోన్ చేయకుండా ఎలా ఉంటుందని మ్యాడీ అంటాడు. ఒకవేళ వచ్చినా  కారుకోసమైనా నాకు కబురుచేస్తుంది కదా అని అంటాడు. ఇలా ఆటోల్లో ఎందుకు తిరుగుతుందని ప్రశ్నిస్తాడు. మ్యాడీ చెప్పింది కూడా నిజమేనని అనుకున్న శ్రీలక్ష్మీ....తాను ఎవరిని చూసి ఎవరో అనుకుని ఉంటానని అనుకుంటుంది. ఇంతలో కాలేజీలో త్రిషను కలిసిన విక్రమ్‌...మీరు చెప్పినట్లు  శ్రీలక్ష్మీ ఇంటికి వెళ్లి సారీ చెప్పానని చెబుతాడు. నాకు చూడబోతే ఆ లవ్‌లెటర్ తను రాసినట్లు అనిపించడంలేదని అంటాడు. మీకు అమ్మాయిల మనసు గురించి ఏం తెలియదు సీనియర్‌ అని త్రిష అతన్ని మాటల్లో పెడుతుంది. మీరు తన ఇంటికి వెళ్లి ఏం చేశారని అడుగుతుంది.  ఏం లేదని నేను వెళ్లి ఫోన్ చేసి బయటకు రమ్మంటే వచ్చిందని...సారీ చెప్పేసి వచ్చానని అంటాడు. నిజంగా  మీపై ఆమెకు ఎలాంటి ప్రేమ లేకపోతే మిమ్మల్నే ఇంట్లోకి పిలుస్తుంది కదా....మ్యాడీ కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు కదా మిమ్మల్ని ఇంట్లో అందరికీ  పరిచయం చేస్తుంది కదా అని అంటుంది. ఇవన్నీ చేయలేదంటే మీ గురించి ఇంట్లో వాళ్లకు తెలియకూడదనే కదా అని విక్రమ్‌కు లేనిపోనివి నూరిపోస్తుంది.                       లాయర్‌ను కలవడానికి హైదరాబాద్ వచ్చిన సింధూ,గోపీ హోటల్‌కు వెళ్లకుండా  తన ప్రెండ్‌ వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు. తన ఫ్రెండ్ వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లారని..కాబట్టి వాళ్లు వచ్చే వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతాడు. హోటల్‌లో ఉందామని చెప్పగా....ఇక్కడ పని ఎన్నిరోజులు ఉంటుందో తెలియదు కాబట్టి అన్నిరోజులు హోటల్‌లో ఉంటే డబ్బులు దండగా అని అంటాడు. దీనికి సింధూ కూడా సరేనంటుంది. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే బొద్దింకలు చూసి సింధూజాక్షి భయపడి వెళ్లి గోపి గుండెలపై పడుతుంది.అతన్నిగట్టిగా పట్టుకుని బొద్దింకలు చూసిస్తూ భయపడుతుంది. తొలిసారి సింధూజాక్షి తనను గట్టిగా హత్తుకోవడంతో గోపీ చాలా ఆనందపడిపోతాడు.వెంటనే తేరుకున్న సింధూ వెళ్లి లాయర్‌కు ఫోన్‌ చేసి ఎప్పుడు రమ్మంటాడో కనుక్కోమని చెబుతుంది. నువ్వు కూడా నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లిచేసుకోమని సింధూ సలహా ఇస్తుంది.నేను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమించానని ఈ జన్మకు నీతోఉన్న ఈ కొన్ని  జ్ఞాపకాలు చాలని చెబుతాడు.అతని మాట్లాడిన మాటలు విని సింధూ కూడాకరిగిపోతుంది.  

                           కాలేజీకి డైరెక్ట్‌గా శ్రీలక్ష్మీని బైక్‌పై ఎక్కించుకుని తీసుకొచ్చిన మ్యాడీని చూసి త్రిష మండిపడుతుంది.ఎందుకు ఇలా చేశావని నిలదీస్తుంది.ఇదిగో ఇది ఈసార్ చేసిన నిర్వాకమేనని విక్రమ్‌ను చూపిస్తాడు. సార్‌ రాత్రి మా ఇంటికి వచ్చి లక్ష్మీతో మాట్లాడటం మా అత్తయ్య చూసి గొడవ చేసిందని...దీంతో కాలేజీలో జరిగిన అల్లరి గురించి చెప్పాల్సి వచ్చిందని అంటాడు. మా తాతయ్య వస్తానంటే నేనే వద్దని ప్రతిరోజూ లక్ష్మీని నేనే కాలేజీకి తీసుకెళ్లి తీసుకొస్తాని మాటిచ్చి ఒప్పించానని చెబుతాడు. తాను సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్న వ్యక్తికి డబ్బులు అవసరం ఉండటంతో కాలేజీలో పెట్టిన డ్యాన్స్‌ కాంపిటేషన్‌లో లక్షరూపాయలు గెలిచి ఆ డబ్బులు  డాక్టర్‌కు ఇవ్వాలని శ్రీలక్ష్మీ అనుకుంటుంది. అందుకు మ్యాడీని జోడీగా  చేయమని అడుగుతుంది.దీనికి తాను ససేమీరా అనడంతో అయితే సీనియర్‌ సార్ విక్రమ్‌ను అడుగుతానని చెప్పడంతో మ్యాడీ తప్పక ఒప్పుకుంటాడు. ఆ విషయం గమనించిన త్రిష ఏంటని నిలదీస్తుంది. తాను డ్యాన్స్‌లో గెలిచి తాను కాపాడిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేయిస్తానని చెబుతోందని...అందుకే తనకు సాయం చేయమనికోరితే  సరేనన్నానని చెబుతాడు.