Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని సూర్యనారాయణ శ్రీలక్ష్మీని అడుగుతాడు. తనవల్లే ఇదంతా జరిగిందని లక్ష్మీ చెబుతుందేమోనని మ్యాడీ భయపడతాడు.అయితే తాను లెక్చరర్‌ను కలవడానికి వెళ్లడంతో చాలా లేట్ అయ్యిందని అందుకే మధుబాబు నేను ఇంటికి వెళ్లిపోయానని వచ్చేశాడని చెబుతుంది. ఆటోకోసం రోడ్డు దాటుతుంటే ఇంకో వాహనం వచ్చి ఢీకొట్టిందని చెబుతుంది. దీంతో మ్యాడీ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. రోడ్డు దాటేప్పుడు అటుఇటు చూసుకోవడం తెలియదా అని ప్రియంవద మండిపడుతుంది.నేను చూసుకునే రోడ్డు దాటానని....కాకపోతే ఆ వెహికిల్ వాడు చూసుకోలేదని చెబుతుంది. ఏదైతేనేమీ శ్రీలక్ష్మీ క్షేమంగా ఇంటికి వచ్చింది అది చాలని సూర్యనారాయణ అంటాడు. డాక్టర్లు కూడా ఆశలు వదిలేసుకున్న సమయంలో మన మ్యాడీ నిప్పులుగుండంలో నడిచి తన భార్యను బ్రతికించుకున్నాడని ఇందిర చెబుతుంది. ఆ మాటలు విన్న అందరూ షాక్ తింటారు. శ్రీలక్ష్మీ కూడా ఇది నిజమా, కలా అని అనుకుంటుంది. సూర్యనారాయణ మ్యాడీ వద్దకు వెళ్లి నిన్ను చాలాసార్లు బాధపెట్టానని,అల్లర చిల్లరగా తిరుగుతున్నావని కోప్పడ్డానని,ఆస్పత్రిలో కూడా నీపై చేయిచేసుకున్నానని అంటాడు. కానీ నువ్వు చేసిన పని చూస్తుంటే ఇప్పుడు చాలా గర్వంగా ఉందని అంటాడు.నీకు ఇబ్బంది కలిగినప్పుడు తను ఆదుకుంటే...తాను జైలులో ఉన్నప్పుడు నువ్వు తనను రక్షించడమేగాక...నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టి నీభార్యను నిర్దోషిగా ఇంటికి తెచ్చుకున్నావని అంటాడు. ఇప్పుడు ఏకంగా నిప్పులుగుండం తొక్కి నీ భార్యను కాపాడుకున్నావని పొగడ్తలతో ముంచెత్తుతాడు. మీ ఇద్దరినీ చూస్తుంటే...ఒకరికోసం ఒకరు పుట్టినట్లు ఉన్నారని....ఇలాగే కలకాలం ఉండాలని దీవిస్తాడు. ఇదంతా చూసిన ప్రియంవదకు కోపం వస్తుంది. మ్యాడీ కాళ్లు మండుతున్నాయని...ఇంట్లోకి తీసుకెళ్తారా లేదా అనగా...మధుబాబును రూమ్‌లోకి తీసుకెళ్లమని సూర్యనారాయణ శ్రీలక్ష్మీకి చెప్పగా...ఆమె మ్యాడీని తన గదిలోకి తీసుకెళ్తుంది. తన తల్లిచేసిన పనికి ప్రియంవద ఆమెపై మండిపడుతుంది. నీ మూఢనమ్మకంతో మ్యాడీప్రాణాలు తీసేలా ఉన్నావని అంటుంది. వాడు తన భార్య కోసం నిప్పులుగుండంలో నడిచి కాపాడుకున్నాడని అంటుంది. నువ్వు కూడా ఆ నిప్పులగుండంలో నడిస్తే కాస్త మనసుకు ప్రశాంతత లభిస్తుందని సలహా ఇస్తుంది. కాళ్లు బొబ్బలు వచ్చి బాధపడుతున్న మ్యాడీకి శ్రీలక్ష్మీ వెన్నపూస రాయడానికి వస్తుంది.దీంతో మ్యాడీ ఆమెను తిట్టి బయటకు వెళ్లిపొమ్మని అంటాడు. నాకోసం అంత కష్టపడి నిప్పులుగుండం తొక్కితే కనీసం పాదాలకు వెన్నపూస కూడా రాయనివ్వరా అని అంటుంది. ఇలాటి ఛీప్‌ట్రిక్స్‌తో నన్ను పడేయాలని చూడకని అంటాడు. నాకు ఆ అవసరం లేదని...నావల్లే మీరు ఇబ్బందిపడుతున్నారని వెన్నపూస రాయడానికి వచ్చానని అంటుంది. అది రాసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తానని అంటుంది. చేసేదిలేక ఆమెతో వెన్నపూస రాయించుకుంటాడు. కాలేజీలో ఆ ఫొటోలు అంటించి పిచ్చిరాతలు తాను రాయలేదని లక్ష్మీ చెప్పినా మ్యాడీ వినడు. నిజంగా మీరు నావాడు అని అందరికీ తెలియాలి అంటే...ఈ తాళి బయటకు తీసి చూపించేదాన్నని, అలాంటి పిచ్చిపనులు చేసేదాన్ని కాదని అంటుంది. వెన్నపూస రాసి శ్రీలక్ష్మీ వెళ్లిపోగానే...మ్యాడీ నిద్రపోతాడు. ఉదయం కాలేజీకి వచ్చిన త్రిష...మ్యాడీ రాలేదని తెలిసి అతనికి ఫోన్ చేస్తుంది. మ్యాడీ రాలేదంటే...ఖచ్చితంగా శ్రీలక్ష్మీ చచ్చిపోయి ఉంటుందని ఆనందపడుతుంది. మ్యాడీ ఫోన్ చేసి లక్ష్మీకి ఏం కాలేదని బాగానే ఉందని అంటాడు. మా నాయనమ్మ తనకోసం నన్ను నిప్పులగుండంలో నడిపించిందని చెప్పడంతో త్రిష కోపంతో రగిలిపోతుంది.
Lakshimi Raave Maa Intiki Serial Today March 26th:యాక్సిడెంట్ జరగడానికి మధుబాబు కారణమని శ్రీలక్ష్మీ సూర్యనారాయణకు చెప్పిందా లేదా..?
ABP Desam | 26 Mar 2026 11:23 PM (IST)
Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 26th: యాక్సిడెంట్ జరగడానికి మధుబాబు కారణమని శ్రీలక్ష్మీ సూర్యనారాయణకు చెప్పిందా లేదా..?

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్