Lakshimi Raave Maa Intiki Serial Today Episode: సూర్యనారాయణ రావడం చూసి మాట మార్చిన సింధూజాక్షి మరిన్ని అబద్ధాలు ఆడుతుంది.గోపిని చేసుకోవడం తనకు ఎంతో ఇష్టమన్నట్లు మాట్లాడుతుంది. తాతయ్య మాట విని నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.ఇంతలో లోపలికి వచ్చిన సూర్యనారాయణ ఆమెను అభినందిస్తాడు. నా మాటకు విలువ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వాళ్ల తాతయ్య అంటాడు. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అంటాడు. అక్కడే ఉన్న మ్యాడీని సైతం గట్టిగా తిడతాడు. ఈ పల్లెటూరిలో మా అక్క ఉండలేదని.. వ్యవసాయం చేసుకునే వాడిని చేసుకోదని ఏదేదో మాట్లాడావు కదా ఇప్పుడు ఏమంటావు అని నిలదీస్తాడు. ఈ పెళ్లివద్దంటూ అక్కకు లేనిపోనివి చెప్పడం ఇప్పటికైనా ఆపని గట్టిగా హెచ్చరించి వెళ్తాడు. పెళ్లికూతురుకు గోరింటాకు పెట్టమని లక్ష్మీకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.లక్ష్మీ కూడా గోరింటాకు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోగానే...మ్యాడీ, ప్రియంవద సింధూపై కోప్పడతారు. నువ్వు వద్దంటేనే కదా ఈ పెళ్లి చెడగొట్టడానికి మేమంతా ఎంతో కష్టపడుతున్నదని అంటారు. ఇప్పుడు ఉన్నట్లుండి నీకు పెళ్లి ఇష్టమని చెబితే ఏంటని నిలదీస్తారు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు తాతయ్య రావడం నేను అద్దంలో చూసి మాటలు మార్చానని చెబుతుంది. ఏమాత్రం తేడా జరిగినా తాతయ్యకు అనుమానం వస్తుందని అలా చేశానని అంటుంది. పెళ్లిపీటలపై కూర్చున్న తర్వాత తలంబ్రాల చీర కట్టుకుని రమ్మని పంతులుగారు పంపించినప్పుడు నువ్వు ఈ బురఖా వేసుకుని పారిపోవాలంటూ మ్యాడీ వాళ్ల అక్కకు చెబుతాడు. తెల్లారే పెళ్లిపనులు చకచకా జరిగిపోతుంటాయి.మండపంలో శ్రీలక్ష్మీ సందడిగా అన్ని పనులు చేస్తుంటుంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సూర్యనారాయణ దగ్గర ఉండి చూసుకుంటుంటే ఆయన్ను చూసి మ్యాడీకి భయం వేస్తుంది.కాసేపట్లో పెళ్లి ఆగిపోతుందని..అప్పుడు ఆయన పరిస్థితి ఏంటోనని భయపడుతుంటాడు. ఇంతలో వెళ్లి సింధూజాక్షిని తీసుకుని రమ్మని సూర్యనారాయణ కేక వేయడంతో మ్యాడీ వెళ్తాడు. సింధూ పెళ్లికూతురులా తయారవుతుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు కల్యాణమండపంలోకి వస్తారు. పెళ్లిపీటలపై కూర్చుని పెళ్లితంతు సాగుతుంటుంది. ఇంతలో త్రిష కారురెడీగాఉంచి సింధూ లగేజీ మొత్తం అందులోకి చేర్చుతుంది. ఇక పారిపోవడమే తరువాయి అని మ్యాడీకి చెబుతుంది. అటు గోపీ చెల్లి మ్యాడీకి లైన్ వేయడం గమనించిన త్రిష కోపంతో మండిపోతుంది. ఇంతలో అమ్మాయి లక్ష్మీ తల్లిదండ్రులే తలంబ్రాల వస్త్రాలు అందజేస్తారు. అబ్బాయి కూడా సింధూ తల్లిదండ్రులు బట్టలు పెడతారు.ఇద్దరూ వెళ్లి బట్టలు మార్చుకుని రావాలని పంతులుగారు పంపిస్తారు. దీంతోఇద్దరూ ఎవరి గదుల్లోకివారు బట్టలు మార్చుకునేందుకు వెళ్తారు. సింధూ తనగదిలోకి వెళ్లగానే పెళ్లిబట్టలు విప్పేసి వాళ్ల తమ్ముడు ఇచ్చిన నల‌్ల బురఖా వేసుకుని పారిపోవడానికి సిద్ధమవుతుంది. నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దని...నేనే టైం చూసుకుని నీకు టచ్‌లోకి వస్తానని మ్యాడీ అంటాడు. ఎవరికి కనిపించకుండా సింధూను గడప దాటించే ప్రయత్నం చేస్తారు.
Lakshimi Raave Maa Intiki Serial Today January 9th:పెళ్లి మండపం నుంచి సింధూజాక్షి పారిపోయిందా లేదా..? పీటలపై పెళ్లి ఆగిపోయిందా లేదా..?
ABP Desam | 10 Jan 2026 07:29 AM (IST)
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 9th: పెళ్లి చీర మార్చుకుని రమ్మని పంతులుగారు పంపించగానే...గదిలోకి వెళ్లిన సింధూ బురకా వేసుకుని పారిపోవడానికి సిద్ధమవుతుంది.
లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్