Jagadhatri Serial Today Episode: కేడీ,జేడీ అడిగిన అన్ని ప్రశ్నలకు బామ్మ దగ్గర సమాధానాలు ఉండటంతో ధాత్రికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడికి వచ్చిన మహిళ కూడా పార్వతమ్మకు తోడుగా నాటకం ఆడటంతో ఏం చేయలేక కేడీ, జేడీ ఇద్దరూ బయటకు వచ్చేస్తారు. తమకు కావాల్సిన ఆధారాలేవీ అక్కడ దొరక్కపోవడంతో నిరాశ చెందుతారు. జేడీమాత్రం ఈ పార్వతమ్మే బాబును ఎత్తుకొచ్చిందని అనుమానపడుతుంది. వాళ్ల బయటకు రాగానే...తమ బండారం బయటపడుతుందని బామ్మతో కలిసి వచ్చిన మహిళ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతలో జేడీ,కేడీ ఆ ఇంటి బయటే ఉన్న ఇస్త్రీ బండి వాడ్ని విచారిస్తారు. పార్వతమ్మకు అసలు కూతుర్లే లేరని..చెబుతాడు. ఈ మధ్య చాలామంది కార్లలోవచ్చి పార్వతమ్మను కలిసి వెళ్తున్నారని చెబుతాడు. ఇంతకు ముందు వచ్చిన మహిళ కూడా ఆమె కూతురు కాదని చెప్పడంతో జేడీ అనుమానం నిజమవుతుంది. రాత్రి కూడా ఓ గుండు అతను వచ్చి వెళ్లాడని చెబుతాడు. అయితే వచ్చింది దేవా అని జేడీకి అర్థమవుతుంది. మీనన్ మనుషులే ఈ కిడ్నాప్ చేయించారని కేడీకి తెలిసిపోతుంది. జేడీ, కేడీ రాకచూసి వెనక గేటు నుంచి పార్వతమ్మతోపాటు ఆ మహిళ పారిపోతారు. ఆటో ఎక్కి వెళ్లిపోతుంటే....జేడీ, కేడీ వాళ్లను ఫాలోఅవుతారు. పార్వతమ్మ పారిపోయి దేవా వద్దకు వెళ్లిపోతుంది. అక్కడ మధు కొడుకు ఉంటాడు.ఎందుకు ఇక్కడికి వచ్చావని బామ్మను దేవా నిలదీస్తాడు.పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చారని బామ్మ చెబుతుంది. దేవా వెంటనే తన మనుషులకు బాబును ఇచ్చి వెనక నుంచి పారిపొమ్మని చెబుతాడు. వాళ్లు బయటకు వెళ్లగానే జేడీ, కేడీ కనిపిస్తారు.వాళ్లను చూసి రౌడీలు భయంతో మళ్లీ వెనక్కి పరుగెత్తుకుని వచ్చి దేవాకు చెబుతారు. ఇంతలోఅక్కడికి వచ్చిన జేడీ,కేడీ....దేవాకు వార్నింగ్ ఇస్తారు. ఇప్పటివరకు కౌషికిపై కోపంతో మీనన్ ఈ పని చేయించాడని అనుకున్నాం. కానీ సిటీలో చిన్నపిల్లలను ఎత్తుకుని వెళ్లి అమ్ముకునే ముఠా మీదేనని తెలిసిందని అంటారు. మర్యాదగా బాబును అప్పగించండని జేడీ హెచ్చరిస్తుంది. బాబును ఇచ్చేది లేదని చెప్పి బాబును తీసుకుని దేవా పారిపోవడంోత జేడీ వాడి వెంటపడుతుంది. ఇక్కడ ఉన్న రౌడీలను కేడీ ఇరగదీస్తాడు. ఇంతలో బాబును జేడీకి ఇచ్చి దేవా పారిపోతాడు. బాబును తీసుకుని వెనక్కివచ్చిన జేడీ....అసలు పిల్లను ఎందుకు ఎత్తుకెళ్తున్నారని పార్వతమ్మను ప్రశ్నిస్తుంది. సిటీలో పిల్లలు లేని వాళ్లు మీనన్ దగ్గరకు వచ్చి డబ్బులిస్తే...నేను ఆస్పత్రుల్లో పిల్లలను మాయం చేసి వాళ్లకు ఇస్తుంటానని చెబుతుంది. రెండేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పార్వతమ్మ చెబుతుంది. వేరే బాబు బదులు ఈ బాబును తీసుకొచ్చానని చెబుతుంది. బాబు బరువు చూస్తున్నప్పుడే నేను ఎవరికీ తెలియకుండా బిడ్డను అక్కడి నుంచి ఎత్తుకునివచ్చానని చెబుతుంది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి పార్వతమ్మతోపాటు మహిళను ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆస్పత్రిలో వీరి కోసం పనిచేసే వారు ఉన్నారని ధాత్రి అంటుంది. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను నిలదీస్తారు.మీకు ఆ పార్వతమ్మకు ఉన్న సంబంధం ఏంటని అడుగుతారు. తమకు ఆవిడ ఎవరో కూడా తెలియదని....పెద్దింటి బిడ్డ మిస్ అయ్యేసరికి కంగారుపడిపోయి వేరే బాబును తీసుకొచ్చి ఇచ్చామని చెబుతారు. దీంతో జేడీ డాక్టర్‌ను అరెస్ట్ చేయిస్తుంది.
Jagadhatri Serial Today January 9th:మాధురి బిడ్డను ఎత్తుకెళ్లిన బామ్మను జేడీ కనిపెట్టిందా..? అసలు పిల్లల కిడ్నాప్‌కు మీనన్‌కు సంబంధం ఏంటి..?
ABP Desam | 10 Jan 2026 07:28 AM (IST)
Jagadhatri Serial Episode January 9th: మాధురి కొడుకు జాడ కనిపెట్టిన జేడీ,కేడీకి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా మీనన్దే అని తెలుసుకుంటారు. వీరికి సాయం చేస్తున్న డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేయిస్తారు.
జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్