Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఆస్ట్రేలియా వెళ్లి పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలని తాను ఎన్నో కలలు కన్నానని ఇప్పుడే పెళ్లి వద్దని సింధూ సూర్యనారాయణకు చెబుతుంది. నువ్వు కోరావనే ఏడాది పాటు నిన్ను ముంబయి పంపించానని వాళ్ల తాతయ్య అంటాడు.అక్కడ నీకు నలుగురు నౌకర్లు ఉన్నారని...నీ ఇంట్లో పని కూడా నువ్వు చేసుకోలేవని నాకు తెలుసంటాడు. ఇండియాలోనే ఇన్ని ఇబ్బందులు పడేదానివి...ఆస్ట్రేలియా వెళ్లి ఎలా బతకగలుతావని నిలదీస్తాడు. నీ పనులు కూడా నీకు చేసుకోవడం చేతకాదు కాబట్టే...ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నానని సమాధానమిస్తాడు.

Continues below advertisement

           అటు గోపీ పెళ్లికుమార్తె గురించి లక్ష్మీకి చెబుతుంటాడు. నువ్వు రోజూ దేవుడిలా పూజించే సూర్యనారాయణ గజపతి గారి మానవరాలు సింధూజాక్షినే తాను పెళ్లిచేసుకోబోతున్నానని చెప్పడంతో..లక్ష్మీ ఏంతో సంతోషిస్తుంది. అంత గొప్పింటి అమ్మాయి మన ఊరి అబ్బాయిని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకున్నారంటే వాళ్లది చాలా పెద్దమనసని అంటుంది.రేపు వెళ్లి మనం బంగ్లా శుభ్రం చేయించాలని చెప్పడంతో లక్ష్మీ సరేనంటుంది.

          సింధూకు పల్లెటూరు సంబంధం తీసుకురావడంపై ప్రియంవద అభ్యంతరం చెబుతుంది. నేను చూసిన సంబంధం చేసుకోకుండా నీకు నచ్చినవాడిని చేసుకుని నువ్వు బాగుపడింది ఏముందని వాళ్ల తండ్రి నిలదీస్తాడు.అదే నామాట విని ఉంటే ఇలా ఒంటరిదానిలా మిగిలి ఉండేదానివి కాదని అంటాడు.నీ జీవితంలా సింధూ జీవితం కాకుడదనే అన్నీ ఆలోచించి మంచి సంబంధం తెచ్చానని చెబుతాడు.తాను చెప్పినదే జరుగుతుందని....ఇందులో ఎలాంటి మార్పు లేదని చెబుతాడు. ఊరికి వెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్లిపోతాడు.

Continues below advertisement

                  ఏడుస్తూ మేడపైకి వెళ్లిన సింధూ కిటికిలో నుంచి బయటకు దూకడానికి ప్రయత్నిస్తుండగా...మ్యాడీ చూసి ఆపుతాడు. ఇలాంటి పిచ్చిపనులు చేయవద్దని వారిస్తాడు. పెళ్లి ఇష్టం లేకపోతే చచ్చిపోవాలా అని అంటాడు. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తానని మ్యాడీ మాటిస్తాడు. ఈ పెళ్లి జరగకుండా ఆపే బాధ్యత నాది అని అంటాడు. ఇంతలో గోపీ తల్లి, చెల్లి ఇద్దరూ నూకాలు వద్దకు వెళ్లి గోపీ పెళ్లి విషయం చెప్పడంతో పాటు....శ్రీలక్ష్మీని చదివించడం వల్ల డబ్బులు దండగ తప్ప మరేమీ ఉండదని ఆమెకు లేనిపోనివన్నీ ఎక్కించి చెబుతారు. ఆడపిల్ల ఎప్పటికైనా ఇంకొకరి ఇంటికి వెళ్లాల్సిందే కదా అని ‌అంటుంది. నేను కూడా ఇదే మాట చెప్పినా..శ్రీలక్ష్మీ మాత్రం చదవాల్సిందేనని పట్టుబడుతోందని నూకాలు చెబుతుంది. ఉన్నదంతా దాని చదువులకే తగలేస్తే...మిగిలిన ఇద్దరి పిల్లల సంగతేంటని నూరిపోస్తుంది. గట్టిగా పట్టుబట్టమని చెబుతుంది...మంచి పెళ్లి సంంబంధం ఉందని....నువ్వు ఓకే అంటే వాళ్లను పెళ్లిచూపులకు రమ్మని చెబుతానని చెప్పి వెళ్లిపోతారు.

                     పిల్లల పేరిట పోస్టాఫీసులో దాచిన సొమ్ము తీయడానికి బాండ్ పేపర్లపై సంతకాలు చేయాలని శ్రీలక్ష్మీ వాళ్ల నాన్న అడుగుతాడు. ముగ్గురు కోసం దాచిన సొమ్ము..ఒక్కదాని చదువు కోసమే ఖర్చుపెడతానంటే నేను ఊరుకోనని నూకాలు గొడవ చేస్తుంది. సరోజని అక్క మంచి సంబధం చూసిందని...పెళ్లి చేసి పంపించేద్దామని చెబుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చదివించడానికి ఒప్పుకోనని అంటుంది. ఏదీ ఏమైనా లక్ష్మీని చదివిస్తానని భర్త అనడంతో...కోపంలో లక్ష్మీ ఏమైనా మన కన్న కూతురా అని నూకాలు అనడం శ్రీలక్ష్మీ వింటుంది. లక్ష్మీ మన కన్నుకూతురు కాకపోయినా మనస్థాయికి మించి చదివించామని...ఇక నా బిడ్డల భవిష్యత్‌ నాకు ముఖ్యమని నూకాలు అంటుంది. ఈ మాటలు ఆమె భర్త నూకాలుపై చేయిచేసుకుంటాడు. అయితే ఇన్నాళ్లు దాన్ని పరాయి బిడ్డగానే చూస్తున్నావా అని నిలదీస్తాడు. ఈ మాటలు వింటున్న శ్రీలక్ష్మీ ఏడుస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన నూకాలు వెంటనే మాటమారుస్తుంది. మనకు చదవించే తాహత్తు లేదని తెలిస్తే లక్ష్మీ ఆర్థం చేసుకుంటుందని అంటుంది. దీనికి ఆమె భర్త ససేమిరా అంటాడు. నేను తల తాకట్టుపెట్టయిన లక్ష్మీని చదివిస్తానని అంటే...నేను నాబిడ్డలు నూతిలోదూకి చస్తామని నూకాలు అంటుంది.

                     సూర్యనారాయ ఇంట్లో సింధూ పెళ్లి ఏర్పాట్లు హడావుడిగా జరుగుతుంటాయి. సింధూ మంచి కోసమే మామయ్య ఇదంతా చేస్తున్నా తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేయం భావ్యం కాదని తల్లి హైమావతి తన భర్తతో అంటుంది. మామయ్యకు అర్థమయ్యేలా ఎవరు చెప్పగలరని బాధపడుతుంది. నాన్న ఏం చేసినా...అన్నీ ఆలోచించే చేస్తారు కదా అని సర్ధిచెబుతాడు. మన సింధూ గురించి మన కన్నా ఆయనే ఎక్కువ ఆలోచిస్తాడని అంటాడు. ఇంతలో సూర్యనారాయణ వచ్చి సింధూ ఎక్కడా అని అడుగుతాడు.దీంతో ఆమెను తీసుకురావడానికి సూర్యనారాయణ వెళ్తాడు. ఇంతలో మ్యాడీ త్రిషకు ఫోన్ చేసి మాఇంటికి వచ్చి మా అక్కను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లాలని అడగడంతో ఆమె ఓకే అంటుంది. ఇంతలో సింధూ రూంలోకి సూర్యనారాయణ వస్తాడు.