Krishna mukunda murari serial today Episode : భవాని: ఇప్పటికే చాలా సార్లు చాలా ఓపికగా చెప్పాను. ఆ క్రిమినల్స్ ఫ్యామిలీ లోకి మన మురారి వెళ్లడం నాకు ఇష్టం లేదు అర్థం చేసుకోండి
ముకుంద: ఈ పెళ్లి వద్దు అత్తయ్య ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి
భవాని: ఏమైంది ముకుంద
ముకుంద: ఏం కాకూడదు అనే వదిలేయమంటున్నా అత్తయ్య. వీళ్లందరూ.. మీ చెల్లి రేవతి గారితో సహా ఎవరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు. వీళ్లందరికీ ఇష్టం లేకుండా ఎలా చేసుకోవడం
రేవతి: ముకుందా పిచ్చి మాటలు మాట్లాడకు. 
ముకుంద: నావి పిచ్చి మాటలు కావు చిన్నత్తయ్య. వాస్తవం. మీరందరికీ అంత దారుణానికి ఒడికట్టినవారే ఇష్టం
మధు: మేము ఇప్పుడు పెద్ద పెద్దమ్మ నిర్ణయాన్ని కాదు అనలేదే. ఎందుకు పెద్దమ్మ మనసు గాయపరుస్తున్నావ్.
ముకుంద: గాయపరిచింది మీరు ముమ్మాటికీ మీరే. ఏం చిన్నత్తయ్య నేను అన్నదాంట్లో అబద్ధం ఉందా. మీరంతా ముసుగు వేసుకొని మాట్లాడుతారు. అలా బతకడం నావల్ల కాదు. ఉన్నది ఉన్నట్లు ఫ్రాంక్‌గా చెప్తాను. వీళ్ల ముందు మీరు చెడు అవుతున్నారు అది నాకు ఇష్టం లేదు. అదీ నా కోసం అస్సలు ఇష్టం లేదు. వదిలేయండి అత్తయ్య ఈ పెళ్లి వద్దు ఏం వద్దు. అసలు మీ గురించి చెడుగా చెప్పక ముందే మీరు ఈ పెళ్లి ఆపేయండి.
రేవతి: ముకుందా నువ్వు
ముకుంద: వద్దు అత్తయ్య, మీరు ఏం చెప్పినా అది అతికించినట్లే ఉంటుంది. సహజంగా ఉండదు. అక్కడ ఆ కృష్ణ మురారికి మీ మనసులోకి ఏమైనా వస్తే రాసిపెట్టుకోండి.. నాకు చూపించండి అర్థం పరమార్థం ఏంటో చెప్తాను అని చెప్తుంది.
భవాని: నిజమా
ముకుందా: మీరు నాకు దైవంతో సమానం అందుకే మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా.
భవాని: ముకుంద ఇంత జరుగుతున్నా నేను ఇంకా చూస్తూ ఉంటే తప్పు చేసినదాన్ని అవుతా. మన మురారిని చూస్తూ చూస్తూ ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ల ఇంట్లోకి పంపిస్తే మన కుటుంబ గౌరవాన్ని తగ్గించిన దాన్ని అవుతా. మధు వద్దులే.. ముకుంద ఇంత చెప్పిన తర్వాత నేను నీకు చెప్తే కరెక్ట్ కాదు. ముకుంద పంతులు గారికి కబురు పెట్టు
ముకుంద: అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి ఇంత మంది కాదంటుంటే మన ఇద్దరమే.
భవాని: అవన్నీ మీ పెళ్లి అయిన తర్వాత ఆలోచిద్దాం ముందు పంతుల్ని పిలిపించు.. రేవతి నేను చేసేది మంచి పనే అని తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నీకే కాదు అందరికీ చెప్తాన్నా. 


మరోవైపు మురారి కృష్ణ వాళ్ల ఇంట్లో టిఫెన్ చేసి చాలా బాగుంది అని ఇకపై రోజూ మీ ఇంట్లోనే టిఫెన్ చేస్తా అంటాడు. కృష్ణతన చీర కొంగు ఇచ్చి చేయి తుడుచుకోమని చెప్తుంది. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. మురారికి, తనకి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులుగారిని పిలిపించారు అని చెప్తుంది. నిన్ను తీసుకురమ్మని చెప్పి తీసుకెళ్తుంది. కృష్ణ చాలా బాధపడుతుంది. 
శకుంతల: ఏంటి బిడ్డా నీ పెనిమిటికి పెళ్లి ఏంటి బిడ్డా నాకాళ్లు చేతులు వణుకుతున్నాయి. 
కృష్ణ: చిన్నమ్మా ఏం కాదులే పరేషాన్ అవ్వకు కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వు. ఒంటరిగా వదిలేయ్ నన్ను.


రేవతి: అక్క ప్లీజ్ మనం మురారి జీవితాన్ని అన్యాయం చేస్తున్నాం అని నా మనసు చెప్తుంది
మధు: అవును పెద్దమ్మ పంతులు గారు వస్తే ఏదో యజ్ఞమో, యాగమో అని చెప్పండి కానీ ముహూర్తం గురించి చెప్పకండి
నందూ: పిన్ని అంత బాధ పడుతుంది కదా ఒకసారి ఆలోచించు అమ్మా
రేవతి: మనసులో.. మా అందరి బాధ విని అక్క ముహూర్తం పెట్టించకుంటే చాలు
భవాని: (పంతులు వస్తే) పెళ్లికి ముహూర్తం పెట్టాలి పంతులుగారు.. ఇక మురారిని వచ్చి కూర్చొమని చెప్తుంది. ఇక జాతకాలు చూడమని పేపర్స్ ఇస్తుంది. మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు


కృష్ణ: మనసులో.. ఇప్పుడు నేను వెళ్లి బతిమాలినా.. బయపెట్టినా లాభంలేదు. పైగా నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తారు. ఏం చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. పెద్దత్తయ్య తెలివిగలది. గతం గుర్తొస్తున్నప్పుడు పెళ్లి చేసేయాలి అని చూస్తుంది. ఇంతలో శకుంతల భవాని వాళ్ల ఇంటి వైపు వెళ్లడం చూసి చిన్నమ్మా వద్దూ అంటూ ఆపుతుంది.
శకుంతల: ఏంటి వద్దు. ఏం జరుగుతుందో అర్థమవుతుందా.. నీ పెనిమిటికి అక్కడ లగ్గం పెడుగున్నారు అర్ధమవుతుందా నీకు.. అప్పటి నుంచి చూస్తున్నా చప్పుడు చేయకుండా కూర్చొన్నావ్
కృష్ణ: వద్దు చిన్నమ్మ.. ముహూర్తమే పెడుతున్నారు కదా పెళ్లి కాదు కదా.. నేను గొడవ చేయను అనే నమ్మకంతోనే పెద్దత్తయ్య ఇలా ముహూర్తం పెడుతోంది. పెళ్లి మాత్రం చేయలేరు చేయనివ్వను. నేను అంత పిరికి దాన్ని కాదు. నాకు ఆపే సత్తా ఉంది నన్ను నమ్ము.
శకుంతల: అయితే ఇప్పుడే వెళ్లి ఆపు
కృష్ణ: ఇప్పుడే వెళ్లి నేను రచ్చ చేసి ఆపితే సాయంత్రం ఎవరికీ తెలీకుండా గుడికి తీసుకెళ్లి మూడు ముళ్లు వేయించేస్తారు అప్పుడు ఏం చేస్తాం. అప్పుడు నీ ఎదురుగా నేను నా ఎదురుగా నువ్వు కూర్చొని ఏడుస్తాం. కృష్ణ ఏం చేయలేదు అనే నమ్మకం వాళ్లకి ఇద్దాం. తర్వాత టైం చూసి పెళ్లి ఆపేద్దాం.
శకుంతల: అలాగే బిడ్డా అప్పుడు మనమేంటో చూపిద్దాం


మరోవైపు పెళ్లి ముహూర్తం తొందరగా పెట్టండి అని భవాని అంటే ఇద్దరి జాతకాలు పడాలి కదా అని పంతులు అంటాడు. దీంతో మధు పడట్లేదా అయితే వదిలేయండి అంటాడు. భవాని మధుపై సీరియస్ అవుతుంది. ఇక మురారి మనసులో అంటే మధుకి ఈ పెళ్లి ఇష్టం లేదు అనుకుంటా అని అనుకుంటాడు. ఇంట్లో అందరూ డల్‌గా ఉన్నారు ఒక్క పెద్దమ్మ, ముకుంద తప్ప అనుకుంటాడు. తర్వాత మురారి లేచి వెళ్లిపోతుంటే మంచి ముహూర్తం దొరికిందని పంతులు అంటారు. కూర్చొమని చెప్తాడు. వచ్చే శుక్రవారం ఉదయం దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు చెప్తారు. దీంతో రేవతి, నందూ, మురారి అందరూ షాక్ అవుతారు. ఈ ముహూర్తంలో పెళ్లి అయితే విడిపోవడం, విడదీయడం ఎవరి వల్లా కాదు అని పంతులు అంటారు. ఇక లగ్నపత్రికను రేవతికి తీసుకోమని భవాని చెప్తుంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply