Krishna Mukunda Murari  Serial November 15th Episode : మురారి కృష్ణ చేతికి రింగ్ పెట్టి రేపు తమ ఇంట్లో పూజ ఉందని తాను ఇచ్చిన చీర కట్టుకొని రమ్మని కృష్ణని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ముకుంద ఈ సీన్ అంతా చాటుగా చూస్తుంది.


ముకుంద: మనసులో.. లాభం లేదు విషయం ఇంత వరకు వచ్చిందంటే నేనే ప్రేక్షకపాత్ర వహించడం కరెక్ట్‌ కాదు. పూజకు రమ్మంటావా మురారి రమ్మను. అప్పుడు నేను ప్రేక్షక పాత్ర వహించను. అందరికీ పెద్ద సినిమా చూపిస్తాను. 


కృష్ణ: చిన్నమ్మ.. ఏసీపీ సార్ ఆయన చేతితో ఆయనే నాకు రింగ్ తొడిగారు. 


భవాని: కూర్చొ ముకుంద కృష్ణ ఏమైనా న్యూసెన్స్ చేసిందా


ముకుంద: అంతా ఇంత కాదు అత్తయ్య. దక్కడు అత్తయ్య మురారి ఇక నాకు దక్కడు. ఇంత కాలం మనం ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో. అదే అవుతుంది. మురారికీ అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది. అంటూ షాపింగ్ మాల్‌లో జరిగినవన్నీ చెప్తుంది.


భవాని: సరే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను.


భవాని ఇంట్లో పూజ ఏర్పాట్లు జరుగుతుంటాయి. మురారి రెడీ అవుతుంటే అక్కడికి ముకుంద వచ్చి దీపావళి శుభాకాంక్షలు చెప్తుంది. ఇక మురారి ముకుంద చీర చూసి చాలాబాగుంది అని చెప్పి మనసులో ఇలాంటి చీరే కృష్ణ కట్టుకుంటుంది అని అనుకుంటాడు. అయితే ముకుంద మనసులో ఆ చీర నేనే నొక్కేశానని అనుకుంటుంది. 


భవాని: రేవతి ఇప్పుడు కృష్ణ వస్తే మురారితో మాట్లాడే అవకాశం ఇవ్వద్దు.. మురారీకి కనిపించొద్దు. నందూ ఈ విషయం నీకు చెప్తున్నాను. మనసులో మురారి, ముకుంద రావడం చూసి వీళ్లని చూస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌ అనిపిస్తోంది. నందూ వాళ్లిద్దరికీ ఫొటో తీయ్యు. 


రేవతి: వీళ్లద్దరినీ కలిపి కృష్ణని దూరం చేయాలని అక్కయ్య గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఉంది. 


కృష్ణని తీసుకొని వస్తానని మురారి చెప్తాడు. ఇక మరోవైపు కృష్ణకు మురారి ఇచ్చిన చీర కనిపించదు. అన్ని చీరలు వెతుకుతుంది. ఎక్కడా దొరకదు. దీంతో మురారి ఇచ్చిన మరో చీర కట్టుకుంటుంది. ఇక మురారి బయట నిల్చొని కృష్ణ రాక కోసం ఎదురు చూస్తుంటాడు. భవాని, ముకుంద గుసగుసలాడుకుంటారు. భవాని మురారిని లోపలికి పిలుస్తుంది. ఇంతలో పూజారి పూజ ప్రారంభిస్తారు. మరోవైపు కృష్ణ వస్తుంది. 


మురారి: మనసులో.. నేను ఇచ్చిన చీర కట్టుకోలేదు. ఓ అదే అయింటుంది కొత్త చీర కట్టుకొని వస్తే ముకుంద లాంటి చీరే కట్టుకొని ఉంటుందని పెద్దమ్మ తిడుతుందని కట్టుకొని రాకపోయింటుంది. ఆమెలో మొఖంలో ఆ బాధ పోగొట్టాలి. అమ్మా.. తనని లోపలికి తీసుకురా పూజలో కూర్చొంటుంది. చూశావా పెద్దమ్మ నేను ముకుంద కట్టుకున్న లాంటి చీరే వేణి గారికి కూడా తీసుకున్నా కానీ వేణి గారు ఆ చీర కట్టుకొని రాలేదు ఎందుకో తెలుసా మీకు భయపడి. మీకు మాత్రమే భయపడి కట్టుకొని రాలేదు. అందుకే పెద్దమ్మ మీరు తనని ఏం అనొద్దు తనని పూజలో కూర్చొనివ్వండి. 


ముకుంద: మనసులో.. అనవసరంగా నేను ఆ చీర నొక్కేశాను. లేదంటే ప్రాబ్లమ్‌ ఏ ఉండేది కాదు. పూజలో కూర్చొమని చెప్పేవాడు కాదు. ఇప్పుడు ఆ రింగ్‌ విషయంలో రచ్చ చేయనున్నాను కదా ఇప్పుడు నేను ఏం అన్నా మురారి సైలెంట్‌గా ఉంటాడు. 


ఇక పూజలో మురారికి రెండు వైపులా కృష్ణ, ముకుందా కూర్చొంటారు. 
 
ముకుంద: అత్తయ్య నిన్న నేను రింగ్ కొనుకున్నాను. పెట్టుకున్నాను కూడా ఎక్కడో జారిపోయింది. ఇప్పుడు వేణి గారి వేలుకున్న రింగు చూస్తే నా రింగ్ గుర్తొచ్చింది. 


కృష్ణ: మనసులో.. ఇప్పుడు ఈ రింగ్‌ మీద పంచాయితీ పెడుతుంది ఏమో.. ఏసీపీ సార్ పెట్టారని చెప్తే సార్‌ని తిడతారేమో


ముకుంద: అత్తయ్య ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలీదు కానీ వేణి గారు పెట్టుకున్న రింగ్ నాదే


మురారి: ఏంటి ముకుందా ఏం మాట్లాడుతున్నావ్.. మనసులో.. అంటే నేను కొనిచ్చానని నాతో చెప్పించి వేణి గారిని తిట్టించడానికి ఇదంతా చేస్తుందేమో


భవాని: కృష్ణని.. ఏంటమ్మా ఇది ఆ రింగ్ నీది కాదా ముకుంద చెప్పింది నిజమేనా 


కృష్ణ: (మురారి నిజం చెప్తుంటే ఆపి) అది నిజమే. నేను దొంగతనం చేయలేదు మేడమ్. బయట దొరికితే బాగుంది అని పెట్టుకున్నా ఇది ముకుందది అని తెలిస్తే తెచ్చి ఇచ్చేదాన్ని


ముకుంద: వేణి గారు మనకు ఏదైనా దొరికితే ఎవరిది అని అడగాలి కదా ప్లీజ్ తీసి ఇవ్వండి


కృష్ణ మురారిని చూస్తూ ఏడుస్తూ ఆ రింగ్ తీస్తుంటే అది రాదు. ఇంతలో మురారి నేను తీస్తా అంటే భవాని అడ్డుకొని వద్దులే నాన్న దానం ఇచ్చేశాం అనుకుందాం అంటుంది. దీంతో కృష్ణ చాలా బాధ పడుతుంది. ఏడుస్తుంది. ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.