Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు.


కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి వచ్చింది అందుకే మీరు కారులో డ్రాప్ చేశాను అని చెప్పుంటే అప్పుడు కూడా ఏం అనేదాన్ని కాదు. మన బిడ్డును మోస్తున్న తనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఏసీపీ సార్.
మురారి: ఇది కలా నిజమా మీరా మీద నీకు ఇంత పాజిటివిటీనా. 
కృష్ణ: ఒక మనిషి మీద ఒక అభిప్రాయం వస్తే అంత తొందరగా పోదు ఏసీపీ సార్. మీరా విషయంలోనూ అంతే. ఇప్పుడు అవన్నింటికి ఫుల్‌ స్టాప్ పెడుతున్నా. ఇప్పుడు మనకు మన బిడ్డ ముఖ్యం ఏసీపీ సార్. తల్లితో నాకు సంబంధం లేదు. మీరాని నేను అపురూపంగా చూసుకుంటాను. 
మురారి: నువ్వెంత ప్రశాంతంగా ఉంటే నాకు అంత ధైర్యం. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను. 


ఇంతలో కృష్ణకి భవాని ఫోన్ చేసి కిందకి రమ్మని పిలుస్తుంది. కృష్ణ భవాని దగ్గరకు వెళ్తే భవాని కృష్ణతో నేను నీకు ఓ మాట చెప్తాను షాక్ అవ్వకు అని అంటుంది. చిన్న వాళ్లు కదా మీకు తెలీకపోవచ్చు పెద్దదాన్ని కదా నాకు తెలుసు అంటుంది. ఏంటని కృష్ణ అడుగుతుంది.


భవాని: మన మీరా ఉంది కదా. తను నెల తప్పింది. 
కృష్ణ: మనసులో.. పెద్దత్తయ్యకు ఈ విషయం ఎలా తెలిసింది. కొంపతీసి సరోగసీ గురించి తెలిసిపోయిందా.
భవాని: ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా అందరికీ చెప్పి హడావుడి చేస్తారు.  అందుకే నీతో చెప్పాను. ఇది నాకు అనుమానం కాదు. కన్ఫ్మమ్‌గా చెప్తున్నాను. మనం అందరం భోజనం చేసినప్పుడు వాంతులు చేసుకుంది కదా. కానీ ఆదర్శ్‌ ఓవరాక్షన్‌ చూశావా. ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని మనకు అర్థం కాకుండా మాట్లాడాడు.
కృష్ణ: మనసులో.. అయ్యో మీకు ఇలా అర్థమైందా. నిజంగానే మీరా మీద ప్రేమతో అలా అడిగారు. మీరా గర్భవతి అవ్వడానికి ఆదర్శ్‌ కారణం కాదు. అసలు ఆ సంగతే ఆదర్శ్‌కి తెలీదు. అది కాదు పెద్దత్తయ్య ఇంకా పెళ్లి కాలేదు కదా వాళ్లకి.
భవాని: పెళ్లి కానట్లు ఉంటున్నారా వాళ్లు. ఆదర్శ్‌ ఒక్క నిమిషం మీరాని వదలడం లేదు. మీరా కూడా వాడి వెంటే తిరుగుతుంది. మీరాకి ఆదర్శ్‌ అంటే ఇష్టం అని లేటుగా తెలిసింది. లేదంటే ఎప్పుడో ముహూర్తాలు పెట్టించేదాన్ని.
కృష్ణ: మనసులో.. ఇలా అనుకుంటారు అనే మీరాకు ఆదర్శ్‌తో క్లోజ్‌గా ఉండొద్దని చెప్పాను. కానీ వినలేదు. కదా నటిస్తాను అని ఓవర్ యాక్షన్ చేసింది. ఏ అనుమానం పెద్దత్తయ్యకి రాకూడదు అని అనుకున్నానో అదే వచ్చింది.
భవాని: ఉదయం ఆదర్శ్‌ ముహూర్తాలు తొందరగా పెట్టమని పంతులికి చెప్తుంటే పెళ్లికి ఆరాట పడుడుతున్నాడు అని అనుకున్నాను కానీ కారణం ఇది అని తెలీదు. నీకు అంత నమ్మకం కుదరకపోతే మీరాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయు రిజల్ట్ నీకే తెలుస్తుంది. 
కృష్ణ: మనసులో.. టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు పెద్దత్తయ్య పెళ్లే ముఖ్యం బిడ్డను తీసేయ్‌ మంటే నా చేతులతో నేనే నా బిడ్డని తీసేయాలి. ఏం చేయాలి. 
భవాని: అది ప్రెగ్నెంట్ అని తేలితే నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో తనని కూడా అలాగే చూసుకోవచ్చు అని నీకు టెస్ట్ చేయమని చెప్తున్నా. నాకు ఎందుకో పాజిటివ్‌ వస్తుందని అనిపిస్తుంది. నీకు మురారికి బిడ్డ పుట్టబోతుంది. ఆదర్శ్‌కి మీరాకి మరో శుభం జరిగితే ఇంట్లో అన్నీ శుభాలే. అందుకే రేపు టెస్ట్ చేయు. టెస్ట్ అని తనకు చెప్పకు ఏదో ఒక టెస్ట్ అని చేయు.
ముకుంద: భవాని, కృష్ణ మాటలు విని.. కృష్ణ ఇప్పుడు ఇస్తాను చూడు నీకు షాక్. 


కృష్ణ భవాని తనతో చెప్పిన విషయం మురారికి చెప్తుంది. మురారి కృష్ణతో అబద్ధం చెప్పమని అంటాడు. దీంతో కృష్ణ అబద్ధాలు చెప్పి చెప్పి తనమీద తనకే అసహ్యం వేస్తుందని భవాని దగ్గరకు వెళ్లి నిజం చెప్పేయాలి అని ఉందని అంటుంది. ఆదర్శ్ మీరా మీద ఆశలు పెట్టుకున్నాడని ఇప్పుడు ఏం చెప్పొద్దని ఆలోచించి నిర్ణయం తీసుకుందామని మురారి నచ్చి చెప్తాడు. 


మరోవైపు ఆదర్శ్‌ ముకుందని వెతుక్కుంటూ వస్తాడు. ముకుంద ఇంట్లో లేదు అని అంటాడు. దాంతో భవాని, రేవతిలు పెళ్లి కాకుండానే ముకుంద కోసం వెతుకుతున్నాడని అంటారు. ఆదర్శ్‌ ముకుంద గదిలోకి వెళ్లి చూశానని బెడ్ అలాగే ఉంది, జాగింగ్ డ్రస్ అల్మారాలోనే ఉందని అని చెప్తాడు. దీంతో భవాని గదిలోకి వెళ్లి అంత చనువుగా అన్నీ చూస్తున్నాడు అంటే తన అనుమానమే నిజం అని అనుకుంటుంది. ఫోన్ కూడా స్విఛ్ ఆఫ్ వస్తుందని అంటాడు. మురారికి అడగటానికి వెళ్తాడు. 


ఆదర్శ్‌ కృష్ణ వాళ్ల దగ్గరకు వెళ్లి రాత్రి నుంచి ముకుంద ఇంట్లో లేదు అని చెప్తాడు. కృష్ణ, మురారిలు షాక్ అవుతారు. ఇంతలో నందూ వస్తుంది. నందూని చూసిన కృష్ణ అందర్ని మ్యానేజ్ చేయొచ్చు కానీ నందూని చేయలేమని అంటుంది. నందిని కృష్ణని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంది. మరోవైపు ఆదర్శ్‌ ముకుంద గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో కృష్ణకు మీరా కాల్ చేస్తుంది. ముకుంద కృష్ణ, మురారిలను రెస్టారెంట్‌కు తీసుకొని రమ్మని పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ ప్రాణాలు తీయడానికి ఇంటికి వచ్చిన రమణమ్మ, కాఫీలో విషం.. ఆ జ్యూస్ తాగేసిన పెద్దబొట్టమ్మ!