Krishna Mukunda Murari Today Episode: ముకుంద ఫొటోను గోడకు తగిలించి దండ వేయడం చూసిన మీరా ఆ ఫొటో తీసేయ్‌మని చెప్తుంది. ఆదర్శ్ కూడా ఆ ఫొటో ఇంట్లో ఉండటం తనకు ఇష్టం లేదు అంటాడు. ఇక భవాని ఇంట్లో ఉన్నన్ని రోజులు మనల్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఫొటో కూడా అని చెప్పి ఫొటోని తీసేయ్ మని చెప్తుంది. నీ చేతులతో నువ్వే తీసేయ్ అని ఆదర్శ్‌కు చెప్తుంది.
మీరా: అందరూ కలిసి నన్ను బాధ పెట్టి తిరిగి నేనే బాధ పెట్టాను అంటారు. పోనీలే ఫొటో తీయించేశా అది చాలు.
కృష్ణ: మనసులో.. ఆదర్శ్ ముకుంద ఫొటో తీయమన్నాడు అంటే అర్థం ఉంది మరి మీరా ఎందుకు తీయమని అంటుంది. ఇక మధు అందరికి ఫొటో తీస్తాడు.
కృష్ణ ముకుంద ఫొటోని తీసేయడం తనకు ఏం నచ్చలేదు అని మురారితో చెప్తుంది. ఇక ఆదర్శ్ తీయమనడంలో అర్ధం ఉంది. కానీ మీరా ఎందుకు తీయమని చెప్పింది అని మురారిని అడుగుతుంది. మీరా చెప్పిన సమాధానం తనకు నచ్చలేదు అని కృష్ణ చెప్తుంది. మీరా అంతరంగం ఏంటని అడుతుంది. దీంతో మురారి మీరాని సపోర్ట్ చేస్తాడు. మంచిదని పొగుడుతాడు. ఇక కృష్ణ బట్టలు మడతపెడుతూ మురారి షర్ట్ కనిపించడం లేదని వెతుకుంది. ఎక్కడో ఎగిరి పోయి ఉంటుంది అని నేను చూస్తా అని మురారి బయటకు వెళ్తాడు. మరోవైపు మీరా మురారి షర్ట్ చూసుకొని మురిసిపోతుంది. షర్ట్ పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. షర్ట్ పక్కన పడుకొని మురారి ఉన్నట్లు ఊహించుకుంటుంది.
మీరా: వెళ్లొస్తా మురారి ఎక్కువ సేపు కాదు. ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తా.. ఏంటి ఎక్కడికి అని అడుగుతున్నావా. మా నాన్న దగ్గరకి ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాట్లాడుతారో తెలీదు కదా అందుకే జాగ్రత్తలు చెప్పి వస్తా. ఇది సీక్రెట్ ఎవరికీ చెప్పకు. ఎక్కడికి వెళ్తున్నావని అత్తయ్య అడిగితే అక్కడ చేస్తున్న జాబ్ మానేయమని అన్నారు కదా అది నిజం చేయడానికి అని చెప్పా. ఏంటి నువ్వేం జాబ్ అనుకుంటున్నావ్. ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అంటే చిన్న జాబ్ అని అబద్ధం చెప్పేశా అందుకే అది నిజం చేయడానికి వెళ్తున్నా.. నిన్ను దక్కించుకోవడానికి ఎన్ని అబద్ధాలు అయినా చెప్తా.. బయటకు వెళ్తూ మురారిని చూసి దగ్గరకు వెళ్తుంది మీరా..
మీరా: హాయ్ సార్ ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమల్ని పలకరిద్దాం అనుకుంటా కానీ కుదరలేదు.
మురారి: అయ్యో పర్లేదు ఇప్పుడు మీరు మా ఇంట్లో ఒకరు ఎప్పుడైనా పలకరించొచ్చు ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఇక మురారి షర్ట్ గురించి మీరాకు చెప్తాడు. అది కృష్ణకు బాగా ఇష్టం అని చెప్తాడు. దీంతో మీరా ముందు ముందు కృష్ణ ఇంకా ఇబ్బంది పడుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక మీరా జాబ్ రిజైన్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది.
శ్రీనివాస్: అమ్మా నువ్వు కొత్తగా కనిపిస్తున్నావ్ ముఖంలో చిరునవ్వు అంటే చేరాల్సిన చోటుకే చేరావ్ అన్న మాట.
మీరా: లేకపోతే ఆ స్లమ్ ఏరియాలో అలాగే ఉండిపోతా అనుకున్నావా.. అయినా నీ కూతురి విషయంలో నీకు ఎప్పుడూ చిన్న చూసే నాన్న అంత నమ్మకం లేకపోతే ఇది చూడు అని మధు తీసిన ఫొటో చూపిస్తుంది. కొన్నిరోజుల తర్వాత ఇంకో ఫొటో పంపిస్తాను అని అది తాను మురారి పెళ్లి చేసుకునే ఫొటో అని అంటుంది. ఇక మీరా తనకు డబ్బు కావాలి అని తండ్రికి అడుగుతుంది. తర్వాత గోడకు తన ఫొటో తగిలించి దండ వేయమని చెప్తుంది. లేదంటే అందరికీ అనుమానం వస్తుందని అంటుంది. ఇళ్లు అమ్మేసి వేరే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తన ఫొటోకి దండ వేయమని చెప్తుంది.
శ్రీనివాస్: భగవంతుడా బతికున్నా కూతురు చనిపోయింది అనే క్షోభ ఏ తండ్రీకి రాకూడదు. అసలు మురారి అనేవాడే లేకపోతే ఏ బాధ ఉండదు. కానీ కృష్ణ అన్యాయం అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి.
మరోవైపు కృష్ణ జరిగిన దాని గురించి బాధ పడుతుంది. శ్రీనివాస్ బాబాయ్ మళ్లీ ఏమైనా చేస్తాడేమో అని కృష్ణ కంగారు పడుతుంది. మురారి అలా ఏం జరగదు అని కృష్ణకు సర్దిచెప్తాడు. అయినా కృష్ణ కంగారు పడుతుంది. అనవసరంగా భయపడుతున్నావని అంటాడు మురారి. శ్రీనివాస్‌ను గమనిస్తూ జాగ్రత్తగా ఉంటాను అని మురారి అంటాడు. మరోవైపు ఆదర్శ్ మందు బాటిల్ తీసుకొని హాల్‌లోకి వస్తాడు. మధు వద్దని వారిస్తే ఆదర్శ్ అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ మార్చి 30th: విశాలాక్షి కాళ్లు కడిగిన నీళ్లను కక్కుర్తితో తాగేసిన తల్లీకొడుకులు!