Krishna Mukunda Murari Today Episode: ముకుంద మురారిని విడిపించి ఇంటికి వస్తుంది. శ్రీనివాస్ కూతురుని తప్పు చేశావ్ అంటే నువ్వే చాలా పెద్ద తప్పు చేశావ్ నాన్న అని ముకుంద తండ్రి మీద సీరియస్ అవుతుంది. మురారిని అలా కొట్టించడానికి నీకు మనసు ఎలా వచ్చింది నాన్న అని ముకుంద అడిగే నిన్న ఒక్క రాత్రి గడిచి ఉంటే ప్రాణాలతో లేకుండా చేసేవాడిని అని శ్రీనివాస్ అంటాడు.
శ్రీనివాస్: నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేను ఎలా విడిచిపెడతాడు.
ముకుంద: నేను చెప్పానా నా జీవితం నాశనం చేశాడు అని చెప్పానా..
శ్రీనివాస్: ఒకరు చెప్పడం ఏంటి అమ్మ నీ కథ తెలిసిన ప్రతీ ఒక్కరు చెప్తారు మురారినే నీ జీవితం నాశనం చేశాడు అని.
ముకుంద: లేదు నాన్న నా విషయంలో మురారి క్లియర్‌గా ఉన్నాడు. నేనే మురారి నా జీవితం అని వదలకుండా ఉన్నాను. అది అర్థం చేసుకోకుండా మురారి ప్రాణాలు తీయాలని చూస్తావా. వెళ్లిపో నాన్న నువ్వు వెళ్లిపో ఇక్కడి నుంచి నేను కూడా నా మురారి దగ్గరకు వెళ్లిపోతా.. ఇక నుంచి నా ప్రపంచం మురారినే. తర్వాత నేనే వచ్చి నిన్ను కలుస్తాను. వెళ్లిపో.. అని తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్లిపోమని చెప్తుంది.
శ్రీనివాస్: మురారిని కొట్టించాను అని పగతో నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తున్నావా..
ముకుంద: పగతో కాదు నాన్న నువ్వు ఇక్కడే ఉంటే కూతురి జీవితం ఏమైపోతుందా అని మురారిని ఇబ్బంది పెడతావనే భయంతో వెళ్లిపోమని చెప్తున్నా.
శ్రీనివాస్: ఒకప్పుడు మురారి ప్రేమించిన రూపాన్నే పట్టించుకోలేదు. ఇప్పుడు మారిన ఈ రూపాన్ని ఎలా పట్టించుకుంటాడు అనుకుంటున్నావు.
ముకుంద: పట్టించుకుంటాడు నాన్న. ఎలా అయినా సరే నేను నా మురారిని సంతం చేసుకుంటాను. ఇంకో విషయం నాన్న నువ్వు చేసిన పనికి వాళ్లంతా నిన్ను చంపేయాలి అనే కోపంతో ఉన్నారు. కానీ ఆడపిల్లని పోగొట్టుకున్నావని ఆలోచిస్తున్నారు. అందుకే నువ్వు దూరంగా వెళ్లిపో నాన్న.
ఉదయం మురారి నిద్ర లేస్తాడు. కృష్ణ తన కోసం రాత్రంతా నిద్ర పోకుండా ఉండటంతో మురారి కృష్ణ పరిస్థితికి కనీళ్లు పెట్టుకుంటాడు. తనకు భార్య అయినందుకు నీకు ఇన్ని కష్టాలు అని కృష్ణతో చెప్పుకొని బాధ పడతాడు. ఇక కృష్ణ మురారికి సర్దిచెప్తుంది. రేవతి కాఫీ తీసుకొని వచ్చి మీరు ఇద్దరూ ఇలా నవ్వుతూ ఉండాలని అంటుంది. ముగ్గురు కాసేపు నవ్వుకుంటారు.
మరోవైపు ఆదర్శ్ బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బయల్దేరుతాడు. నందిని అడ్డుకుంటుంది. తిరిగి వచ్చి తప్పు చేశాను అని ఆదర్శ్ అంటాడు. మధు వచ్చి పొద్దుపొద్దున్నే బాగా మాట్లాడుతున్నావ్ కానీ లోపలికి వెళ్లు అంటాడు. తనని ఎవరూ ఆపొద్దని ఆదర్శ్ అంటే పెద్ద పెద్దమ్మ వచ్చిన వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని చేయి అడ్డంగా పెడతాడు.
ఆదర్శ్: రేయ్ చేయి తీయురా. ఎక్కడ మందు వాసన వస్తే అక్కడికి బెగ్గర్‌లా చేయి చాపే ఆఫ్ట్రాల్ వాడివి నువ్వు ఎవడ్రా నా మీద చేయి వేయడానికి.
సుమలత: ఆదర్శ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నా కొడుకుకి నీలా సంపాదన లేకపోవచ్చు కానీ నీలా సంస్కారం లేని వాడు కాదు. నువ్వు అనుకున్నట్లు నా కొడుకు ఆఫ్ట్రాల్ గాడు కాదు వాడికి ఒక లక్ష్యం ఉంది. దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా ఎవరి గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఏంటి వెళ్లిపోతే వాడికి ఏంటి అన్నయ్య అన్న ప్రేమతో వెళ్తే మళ్లీ ఎక్కడ దూరం అయిపోతావో అని ఆపుతున్నాడు. అంతేకానీ నువ్వు ఇక్కడే ఉంటే రోజుకు ఓ గ్లాస్ మందు పోస్తావ్ అని కాదు. అయినా నా కొడుకుకు ఈ ఇంటి మీద ఉన్న ప్రేమ అభిమానంలో కొంచెం అయినా నీకు ఉందా. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు. చీటికీ మాటికి ఇళ్లు వదిలిపోతానని మాట్లాడవు.
ఆదర్శ్: లేవు నాకు ఈ ఇంటిమీద ఎవరి మీద ప్రేమలు లేవు. అయినా నిన్ను వీడిని చూసే నేర్చుకోవాలి నేను.
భవాని: భవాని వచ్చి ఆదర్శ్‌ని లాగి పెట్టి కొడుతుంది. ఏంట్రా వాగుతున్నావ్. చంపేస్తా ఏమనుకున్నావో. చిన్నా పెద్దా లేకుండా ఎంత మాట వస్తే అంత అనేస్తావా ఇదేనా నా పెంపకంలో నువ్వు నేర్చుకున్న సంస్కారం. అయినా ఏంట్రా ఈ అవతారం రాత్రంతా నిద్ర పోలేదా.. తాగుతూ కూర్చొన్నావా.. ఎక్కడికిరా బయల్దేరావ్ బ్యాగ్‌తో. ఎక్కడికి వెళ్లేది కాళ్లు విరక్కొట్టి కూర్చొపెడతా. చూస్తావేంటి వెళ్లు. వెళ్లి తలస్నానం చేసిరా ఈ అవతారం చూడలేకపోతున్నా.
ఆదర్శ్ తల్లి హగ్ చేసుకొని గట్టిగా ఏడుస్తాడు. అది చూసి మిగతా వారు ఎమోషనల్ అవుతారు. సుమలత ఇంటి పరిస్థితి ఇలా అయిపోయింది అక్క. నువ్వు ఉంటే ఇలా అయ్యేది కాదు అని అంటుంది. ఇక రేవతి కూడా అక్కడికి వస్తుంది. ఇక భవాని మురారి గురించి అడుగుతుంది. జరిగింది రేవతి భవానికి చెప్తుంది. మురారిని పోలీసులు కొట్టారని తెలిసి భవాని షాక్ అవుతుంది. ఇక మధు మురారి, కృష్ణలను పిలుస్తాడు. ఇంట్లో ముకుంద ఫొటో చూసి భవాని ఎమోషనల్ అవుతుంది. ఇక కొడుకుతో ఎవరు ఏంటో తనకు బాగా తెలుసు అని ఒక్కోసారి కళ్లతో చూసేవి అన్నీ నిజం కాదు అని ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్తుంది.
భవానిని చూసి మురారి, కృష్ణలు ఎమోషనల్ అవుతారు. మురారి గాయాలు చూసి భవాని ఏడుస్తుంది. ఇక ఆదర్శ్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఈ సమస్యను దీని వెనుక ఎవరు ఉన్నారో నేను చూసుకుంటాను అని భవాని ఉంటుంది. ఇక కృష్ణ మీరా తన భర్తను కాపాడింది అని భవానితో చెప్తుంది. మీరా గురించి భవాని ఆరా తీసి తనని కలవాలి అని చెప్తుంది. కృష్ణ భవానికి మీరా అలియాస్ ముకుంద అడ్రస్ పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.