krishna mukunda murari today episode ఆదర్శ్ లెటర్ చదివిన తర్వాత రేవతి ఏడుస్తుంది. ముకుందకు ఏమైందని పోతూ పోతూ తన కొడుకు జీవితాన్నా నాశనం చేయాలి అని అనుకుందా అని అంటుంది. దీంతో ఆదర్శ్‌ ఆపు పిన్ని అని అరుస్తాడు. 


ఆదర్శ్‌: ఎంత చెడ్డ వాళ్లు అయినా చనిపోయిన ముందు అబద్ధం చెప్పరు. ముకుందను చంపింది నీ కొడుకే అని అనడానికి ఇంత కంటే రుజువు అవసరం లేదు. అని ఆదర్శ్‌ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మురారి: నేను ఏ తప్పు చేయలేదు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చూసుకుంటా.. మీరు వెళ్లండి..


శ్రీనివాస్: ముకుంద నిన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమంటే అటూ ఇటూ తిరుగుతున్నావేంటి.
ముకుంద: ముందు వెళ్లిన పని ఏమైందో చెప్పు నాన్న. కృష్ణని అరెస్ట్ చేయించావా లేదా..
శ్రీనివాస్: చేయించాను అమ్మ. మనసులో.. నువ్వు అనుకున్నట్లు కృష్ణని అరెస్ట్ చేయించలేదు. మురారిని చేయించాను అమ్మ.
ముకుంద: నా విజయానికి మొదటి అడుగు పడినట్లే కానీ మురారి కూడా పోలీస్ ఆఫీసరే. కృష్ణని విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా కృష్ణ బయటకు రాకూడదు.
శ్రీనివాస్: హోంమినిస్టర్‌తో చెప్పించి అరెస్ట్ చేయించాను అమ్మ డీసీపీ చెప్పినా బయటకు రావడం కష్టం.
ముకుంద: సూపర్ నాన్న మరి  మురారి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నాడు. 
శ్రీనివాస్: ఎలా ఉంటాడు. నీకు అన్యాయం చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాడు. అదేనమ్మ కృష్ణని అరెస్ట్ చేశారు కాబట్టి మురారికి శిక్షే కదా. 
ముకుంద: ప్రస్తుతానికి కష్టమే నాన్న కానీ కృష్ణ వద్దు ముకుందే ముద్దు అని పరిస్థితికి తీసుకొస్తా. రేపు పొద్దున్నే మురారి దగ్గరకు వెళ్లి కృష్ణని విడిపించడానికి ప్రయత్నించి మురారికి దగ్గరవుతాను. 
శ్రీనివాస్: మనసులో.. రేపు నువ్వు స్టేషన్‌కి వెళ్లే సరికి మురారి లాకప్ డెట్ అయి ఉంటాడు. కొన్ని సార్లు గెలవడం కంటే ఓడిపోవడమే మంచిది. అందుకే నీ కోసం నీకు తెలీకుండా ఇలా చేశాను. 


మరోవైపు రేవతి, మధులు అందరూ ఎవరెవరికో ఫోన్లు చేసి మురారిని విడిపించడానికి సాయం చేయమని అడుగుతారు. అయితే ఈ కేసులో హోం మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అని మురారి బయటకు రావడం కష్టం అని అంటున్నారు అని మధు చెప్తాడు. దీంతో కృష్ణ తన అత్తకు ఏదో ఒకటి చేయమని బయటకు తీసుకురమ్మని అడుగుతుంది.


ఆదర్శ్‌:   వాడు రాడు కృష్ణ మర్చిపో. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత మందికి ఫోన్ చేసినా ఎవరూ బయటకు తీసుకురాలేరు. జీవితాంతం జైలులో మగ్గి అక్కడే చావాల్సిందే.
కృష్ణ: ఆదర్శ్ అని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. 
ఆదర్శ్‌: మురారి తప్పు కాదు పాపం చేశాడు. వాడి చేసిన పాపాలకు తగిన శాస్త్రి జరిగింది. ఇక వాడి జీవితం జైలులో అంతం కావాల్సిందే మర్చిపో.
కృష్ణ: షట్ అప్ ఆదర్శ్‌ ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణాలు తీసేస్తా. ఏసీపీ సార్‌ని ఎవరైన అర్థం చేసుకోకపోవచ్చు. నేను కూడా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నువ్వు ఇలా అనకూడదు. 
రేవతి: ఇప్పటి వరకు కృష్ణని అన్నావు ఇప్పుడు మురారిని అపార్థం చేసుకుంటావా..
కృష్ణ: చేతనైతే సాయం చేయు లేదంటే వదిలేయ్ ఇలా గుచ్చి గుచ్చి మమల్ని హింసించకు.
ఆదర్శ్‌: సారీ కృష్ణ ఈ సారీ మురారి జైలులో చావాలి అన్నందుకు కాదు. ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నీ స్వార్థం కోసం ముకుంద అడ్డు తప్పించుకోవడానికి ఇదంతా చేసింది నువ్వే అనుకున్నాను కానీ అసలు తప్పు అంతా మురారే చేశాడు అని నాకు ఇప్పుడే అర్థం అయింది. ముకుంద వాగ్మూలం చదివాక కూడా మీరు ఇంకా మురారిని సపోర్ట్ చేస్తున్నారు. ముకుందని ప్రేమించి మోసం చేసి మోజు తరిపోయాక నాతో పెళ్లి చేశాడు. మురారి చేసిన పనులకు ఉరిశిక్ష కూడా తక్కువే. 
కృష్ణ: ఆపు ఆదర్శ్‌ ప్లీజ్.. నువ్వు చెప్పేవి నిజం కాదు.
ఆదర్శ్‌: అంటే ముకుంద చెప్పింది అబద్ధమా..
మధు: అబద్ధమే. ముకుంద ఎప్పుడూ కరెక్ట్ కాదు.
ఆదర్శ్‌: నువ్వు నోర్ముయ్‌రా.. చూడు ముకుంద ప్రాణాలతో ఉన్నప్పుడు ఈ మాట చెప్పుంటే మురారి గురించి తప్పుగా అంటావా అని నేనే ప్రాణాలు తీసేవాడిని. కానీ తను ప్రాణాలు తీసుకుంటూ రాసిన మరణ వాగ్మూలం అది.
కృష్ణ: లేదు ఆదర్శ్‌ ఏసీపీ సార్ అలాంటి వారు కదా  ఇది హోం మినిస్టర్ వరకు వెళ్లింది అంటే దీని వెనకు కుట్ర ఉంది అది అర్థం చేసుకో. 


కృష్ణ మురారి కోసం భోజనం తీసుకొని వెళ్తుంది. అయితే మురారి ఆ సెల్‌లో ఉండడు. కృష్ణ కంగారు పడుతుంది. పోలీసుల్ని నిలదీస్తుంది. పోలీసులు తెలీదు అని సమాధానం చెప్తారు. వేరే స్టేషన్‌కు తీసుకెళ్లారు అని చెప్తారు. కృష్ణ ఏడుస్తుంది. ఇక లేడీ కానిస్టేబుల్ బలవంతంగా కృష్ణని బయటకు నెట్టేస్తారు. ఆ లేడీని కృష్ణ బతిమిలాడితే ఆవిడ చుట్టు పక్కల స్టేషన్స్‌లో ఎక్కడో ఉన్నారు వెతుకు అని చెప్తుంది. 


మరోవైపు మురారిని పోలీసులు గట్టిగా కొడుతుంటారు. కృష్ణ స్యూటీ మీద అన్ని స్టేషన్లకు వెళ్తూ వెతుకుతుంది. ఎక్కడ కనిపించకపోవడంతో ఏడుస్తుంది. చివరకు ఓ స్టేషన్‌లో మురారి కొడుతుంటే అక్కడికే కృష్ణ వెళ్తుంది. పోలీసులకు బతిమిలాడుతుంది. కానీ మురారిని చూడదు. 


మధు: అసలు ఆ సూసైడ్ నోట్ ముకుంద రాసింది కాదు అని నా డౌట్. 
నందూ: నాకు అదే డౌట్ ఉంది పిన్ని. ముకుందకు కృష్ణ అంటే కోపమే కానీ మురారి అంటే ప్రాణం. మురారికి ఇలాంటి పరిస్థితి కలగాలి అని కోరుకోదు. 
సుమలత: ముకుంద కాకపోతే మరి అది ఎవరు రాసినట్లు.
నందు: ముకుంద తండ్రి రాయొచ్చేమో కదా..
మధు: కరెక్ట్ ఆయనకు మురారి అంటే నచ్చదు. అతనే ఇది చేసుంటాడు. 


ఇంతలో కృష్ణ ఉసూరుమని ఇంటికి వస్తుంది. ఏసీపీ సార్ ఎక్కడున్నారో తెలీదు అని ఏడుస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆదర్శ్‌ వచ్చి చెప్పాను కదా కృష్ణ మురారి జీవితంలోనే ముగిసిపోతుంది అని. అంత వరకు ఆగేలా లేదు పొద్దున్న నువ్వు చూసిందే ఆఖరి చూపు అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. కోపంతో చిరాకు పడతారు. ఇక మురారి నీకు కనిపించడు అని ఆదర్శ్‌ అంటే కృష్ణ చేతులెత్తి దండం పెట్టి ఏం మాట్లాడొద్దు అంటుంది. ఇక రేవతి ఈ విషయం భవానికి చెప్తాను అని ఆవిడే మొత్తం చూసుకుంటారని చెప్తారు. ఇక కృష్ణ రేవతిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అనును అవమానించిన మీరా ఫ్రెండ్స్‌ - నీరజ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌