Krishna Mukunda Murari Today Episode శ్రీనివాస్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ముకుంద కనిపిస్తుంది. శ్రీనివాస్ చూసి షాక్ అయిపోతాడు. ముకుంద అని పిలుస్తాడు. అప్పుడు ముకుంద నిల్చొంటుంది. శ్రీనివాస్ దగ్గరకు వెళ్తాడు. ముకుంద తన తండ్రి కన్నీళ్లు తుడుస్తుంది.
ముకుంద: నాన్న చనిపోయింది ఎలా వచ్చింది అని భయపడుతున్నావా. లేక దరిద్రం పోయింది అనుకుంటే మళ్లీ బతికి వచ్చిందేంటి అని బాధపడుతున్నావా.
శ్రీనివాస్: బాధ అంటావ్ ఏంటి అమ్మ. నువ్వు లేవు అనగానే ఈ బతుకు ఎందుకు అనిపించింది. ఇప్పుడు నిన్ను చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. నువ్వు బతికే ఉన్నావు కదా నాకు అది చాలమ్మా. ఇంకేం వద్దు. అయినా ఎందుకు ఇలా చేశావ్ అమ్మ. నువ్వు పోయావ్ అని మేం అంతా అనుకుంటున్నామ్ అని నీకు తెలుసు కదా. మరి బతికే ఉన్నావని ఎందుకు చెప్పలేదు.
ముకుంద: ఎందుకు అంటే నేను పోయాను అని అందరూ నమ్మాలి కాబట్టి. ఇదంతా నేనే కావాలని చేశాను. ఈ రూపంతో ఇంకా నేను వాళ్ల ముందుకు వచ్చి సాధించేది ఏముంది నాన్న ఏదైనా సాధించాలి అంటే నేను లేను అని నమ్మించి సాధించాలి. అందుకే ఇలా చేశాను నాన్న.
శ్రీనివాస్: అర్థమైంది అమ్మ. ఇన్నాళ్లు ఆ ఇంట్లో ఉంటూ న్యాయంగా పోరాటం చేశావు. నీకు న్యాకయం దక్కకపోగా అన్యాయంగా నిన్ను బయటకు నెట్టేశారు. ఇక ఈ మనుషులు మనకు వద్దు తల్లి అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోదాం. వాళ్ల దృష్టిలో నువ్వు చనిపోయావ్ కాబట్టి వెళ్లిపోదాం పదమ్మా.
ముకుంద: పిచ్చి నాన్న అర్థం చేసుకున్నా అని చెప్పి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా. ఇంత చేసింది మురారిని వదిలేసి దూరంగా వెళ్లడానికా.. ఆ ఆలోచనే ఉంటే ఈ నాటకం అంతా ఎందుకు. మురారి నిన్ను వదిలేస్తున్నా అని ఒక్కమాట చెప్పి వెళ్లిపోయేదాన్ని. ఇదంతా చేసింది మురారిని వదిలేసి దూరంగా వెళ్లిపోవడానికి కాదు నాన్న.మురారికి ఇంకా దగ్గర కావడానికి.
శ్రీనివాస్: నాకు నిజంగా ఏం అర్థం కావడం లేదు అమ్మ. వాళ్ల దృష్టిలో నువ్వు చనిపోయావ్ కదా. అలాంటప్పుడు వాళ్లకు దగ్గర ఎలా ఉండగలవు.
ముకుంద: నా కన్న తండ్రివి నా బుద్ధులు బాగా తెలిసిన వాడివి నీకే నా ప్లాన్‌లు ఏమీ అర్థం కాలేదు. ఇంక వాళ్లకు ఏం అర్థం అవుతుంది. నేను సక్సెస్ అవుతాను అని ఇప్పుడే కన్ఫ్మమ్ అవుతుంది. కూర్చొండి నాన్న చెప్తాను. మురారి ముఖం మారిపోయిన తర్వాత నేను మురారి అని చెప్పేవరకు ఎవరైనా గుర్తుపట్టారా..
శ్రీనివాస్: రూపం మారితే ఎలా గుర్తు పడతారు. ఎవరో వేరే మనిషి అనుకుంటారు.
ముకుంద: కదా.. రెండు మూడు రోజుల తర్వాత నన్ను కూడా ఎవరూ గుర్తుపట్టరు నాన్న. నేనే ముకుందని అని చెప్తే తప్ప నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు నాన్న నీతో సహా.
శ్రీనివాస్: అంటే నువ్వు రూపం మార్చుకుంటావా..
ముకుంద: కోరుకున్నది దక్కించుకునేందుకు రూపం మార్చుకోకతప్పదు. నువ్వు నాకు ఇచ్చిన రూపం తనివి తీరా చూసుకో నాన్న. బాధ పడకు నాన్న. అనుకున్నది సాధించడం కోసం నీ కూతురు ఎంతకైనా తెగిస్తుంది అనుకో. ఇది నాకు పునర్జన్మ అనుకో. నీ కూతురు మళ్లీ పుడుతుంది అనుకో.
శ్రీనివాస్: అనుకుంటాను అమ్మ కొన్ని క్షణాల వరకు నా కూతురు లేదే అనుకున్నా వేరే రూపంలో అయినా తను అనుకున్నది సాధిస్తుంది అంటే ఏం అనుకుంటాను పైగా నిన్ను అవమానించిన వాళ్లకి నువ్వుచేస్తున్నదే కరెక్ట్. నేను అడ్డుచెప్పను. నువ్వు ఏం చేయాలో అది చేయ్. ఈ తండ్రి సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఈ అగాయిత్యాలు చేసుకోను అని ఈ తండ్రి మీద ఒట్టు పెట్టి చెప్పమ్మా.
ముకుంద: ఇంకా మీ కూతురు తెగింపు ధైర్యం కోసం మీకు అర్థం కాలేదా.. సరే నాన్న నేను వెళ్లొస్తా..
శ్రీనివాస్: అమ్మా ఎప్పటికప్పుడు నీ వివరాలు చెప్తుండు మర్చిపోవద్దు.
మరోవైపు ఆదర్శ్ తన ఫ్రెండ్‌తో కలిసి తాగుతాడు. తన బాధను ముకుంద మీద తన ప్రేమను చెప్పుకుంటూ ఏడుస్తాడు. అసలు తను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని బాధపడతాడు. ఇక మురారిని అనవసరంగా తిట్టాను అని ఆదర్శ్ ఫీలవుతాడు. కానీ ఆదర్శ్ ఫ్రెండ్ తప్పు అంటా కృష్ణదే అని అంటాడు. ఆదర్శ్ లేదు అంటే అవును రా కృష్ణదే తప్పు. తన భర్తని మరో అమ్మాయి ప్రేమిస్తుంది అని తెలిసి కూడా సహించింది. అంత పెద్ద మనసు ఉండటం కూడా తప్పే అని అంటాడు.
దరావత్: మమూలుగా అయితే ముకుంద మనసు మార్చడానికి ప్రయత్నించాలి. తనకు బుద్ధి చెప్పాలి. అప్పటికీ మారకపోతే ఆమెకు దూరంగా ఉండాలి. కానీ కృష్ణ అలా చేయలేదు. నిన్ను తీసుకొస్తే మీ ఇద్దరూ కలిసి ఉండేలా చేస్తే ముకుంద తన భర్తను మర్చిపోతుంది అని ముకుందకు నువ్వు అంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని కలిపి మిమల్ని దూరంగా పంపించేస్తే తన భర్తతో కలిసి సంతోషంగా ఉండొచ్చని ప్లాన్ చేసింది. కానీ తన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ముకుంద నీతో కలిసి బతకలేక, తన ప్రేమను మర్చిపోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది.
ఆదర్శ్: అర్థమైందిరా.. కృష్ణ ఇదంతా చేసింది మేం సంతోషంగా ఉండటం కోసం కాదు తన స్వార్థం కోసం. ముకుందను బలి తీసుకుంది.
దరావత్: నో ఆదర్శ్ కృష్ణ స్వార్థం కోసం ఇదంతా చేసింది అని నేను అనుకోవడం లేదు. ఇదొక పరిష్కారం అనుకుంది. కానీ దురదృష్టం వల్ల వర్క్‌అవుట్ కాలేదు.
ఆదర్శ్: లేదు దరావత్ స్వార్థంతో చేయకపోయినా చేసిన పనిలో స్వార్థం ఉంది కదా. అది కూడా తప్పే. ప్రశాంతంగా ఉన్న నా జీవితంతో ఆడుకుంది. కృష్ణని నేను ఈ జన్మలో క్షమించలేను.
కృష్ణ: అత్తయ్య అసలు జరిగింది అంతా నిజమేనా ముకుంద ఇంత పనిచేసిందా.. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది అత్తయ్య.
రేవతి: కల కాదే పీడకల అనుకో. రెండు జంటలు కలిసి సంతోషంగా ఉంటారు. కన్నుల పండుగగా ఉంటుంది అని ఎంతో ఆశపడ్డాం. కానీ అల్లకల్లోలం చేసి పోయింది.
నందు: అప్పటికీ మధు చెప్తూనే ఉన్నాడు పిన్ని మనమే నమ్మలేదు. ముకుంద మారిపోయింది అనుకున్నాం.
సుమలత: ఎక్కడ మారింది మారినట్లు మనల్ని నమ్మించింది. ఆదర్శ్‌ని ఎలా దూరంగా ఉంచాలో మురారిని ఎలా సొంతం చేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉండేది అది మనం తెలుసుకోలేకపోయాం.
కృష్ణ: ఏదైనా ఆలోచించని తను అంటూ ఉండుంటే తన ఆలోచనలు మార్చేవాళ్లం. తన మనసు మార్చేవాళ్లం. కానీ ఇంత పిచ్చి పని అయితే చేస్తుంది అనుకోలేదు.
ఆదర్శ్: అదంతా తమరి పుణ్యమే కదా మేడమ్. ముకుంద శవంలా మారింది అన్న నేను జీవచ్ఛవంలా మారాను అన్నా దానికి కారణం నువ్వే.
నందు: అన్నయ్య ఏంటి ఆ మాటలు ముకుంద చేసిన తప్పునకు కృష్ణని నిందిస్తావా.
ఆదర్శ్: మొత్తం తనే చేసింది మీకు ఎవరికీ కనిపించడం లేదా..తను ఎప్పుడు మా సంతోషం కోసం ఆలోచించలేదు. తన సంతోషం కోసం మాత్రమే ఆలోచించింది. తన సంతోషానికి ఉన్న అడ్డును మాత్రం తొలగించుకోవాలి అని చూసింది.
సుమలత: తప్పు ఆదర్శ్ కృష్ణ మీ ఇద్దరి కోసం ఎంత ఆలోచించిందో మాకు తెలుసు.
ఆదర్శ్: మీకు తెలీదు పిన్ని. మీరు తను చేసిన ప్రయత్నం మాత్రమే చూశారు అందుకే మీకు తను మంచిది కానీ ఆ ప్రయత్నం వెనకున్న అర్థం వేరు.
నందూ: చాలు ఆపు అన్నయ్య. ముకుంద చేసిన తప్పునకు కృష్ణని ఎందుకు నిందిస్తావ్..
రేవతి: చనిపోయిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకూడదు అంటారు. కానీ ముకుంద చేసింది ముమ్మాటికీ తప్పే. ఎంత ఆలోచించినా మురారి దక్కడు అని తెలిసి ఈ పిచ్చి పని చేసింది. ముకుంద కోరుకుంది కదా అని మురారిని వదులు కోవాలా..
ఆదర్శ్: అవసరం లేదు పిన్ని. కానీ ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందనే భయంతోనే కృష్ణ ఇదంతా చేసింది. నాకు మాత్రమే అర్థమైన నిజం మీకు ఎందుకు అర్థం కావడం లేదు. మురారి కూడా ముకుందని ప్రేమించాడు కాబట్టి ఎక్కడ మళ్లీ తనని ప్రేమిస్తాడో అన్న భయంతో ఇదంతా చేసింది. అందుకే మా ఇద్దరిని బయటకు పంపించి నువ్వు మురారితో సంతోషంగా ఉండాలి అనుకున్నావ్. ఆదర్శ్ మాటలకు కృష్ణ వెక్కివెక్కి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.