Krishna Mukunda Murari Telugu Serial Today Episode: తనకి మేలు చేశాను అనుకుంటూనే బలవంతం చేశారని.. ఇష్టం లేని జీవితంలో ఇరికించారని ముకుంద కృష్ణ మీద ఫైర్ అవుతుంది. ఇంక ఓర్చుకోవడం తన వల్ల కాదు అని ముకుంద అంటే దానికి కృష్ణ అంటే ఏంటి నీ ఉద్దేశం నా భర్తని నీ చేతుల్లో పెట్టి నీతో పంపించాలా అని ప్రశ్నిస్తుంది. 


కృష్ణ: చూశారా అత్తయ్య ఎలా సిగ్గు లేకుండా మాట్లాడుతుందో..
ముకుంద: ఏయ్ నాకు ఎందుకు సిగ్గు.. హా.. నీకు భర్త కాకముందే నాకు ప్రియుడు. నా ప్రియుడ్ని నేను కావాలి అని కోరుకుంటున్నాను తప్పు ఏంటి. మురారి మనసులో ఉంచుకొని ఆదర్శ్‌తో కాపురం చేస్తే అది తప్పు. అందుకే ఇన్నాళ్లు భరించి భరించి ఈరోజు బయట పడిపోయా.. ఏ నాటకాలు ఆడకుండా అబద్ధాలు చెప్పకుండా భ్రమల్లో ఉంచకుండా ఆదర్శ్‌కి నిజం చెప్పేశా. నేను చేసింది వంద శాతం తప్పు కాదు. 
కృష్ణ: ముకుంద నిన్ను చూస్తుంటే అసహ్యం కాదు. విరక్తి పుడుతుంది. లేకపోతే ఏంటి అత్తయ్య ఇలాంటి ఆడదాన్ని ఎక్కడైనా చూశారా.. ముఖం మీద ఉమ్మేయాలి అనిపించడం లేదా.. 
ముకుంద: కృష్ణా.. అంటూ చేయి ఎత్తుతుంది. 
కృష్ణ: ఏంటి కృష్ణ.. సిగ్గు పరువు మానం మర్యాద ఏమైనా ఉన్నాయా నీకు. నిన్ను చూస్తుంటేనే తేళ్లు జర్రులు పాకుతున్నట్లు ఉన్నాయి. నీది ఒక బతుకేనా.. 
ముకుంద: కృష్ణ ఎక్కువ మాట్లాడుతున్నావ్..
కృష్ణ: సిగ్గు లేని బతుకుకి పౌరుషం కూడానా.. ఇలాంటి బతుకు బతికినా ఒకటే పోయినా ఒకటే..
ముకుంద: కృష్ణ తప్పు చేస్తున్నావ్.. ఇంతకు ఇంత అనుభవిస్తావ్.. 
కృష్ణ: తప్పు చేసింది నువ్వు అయితే నేను ఎందుకు అనుభవిస్తా..
ముకుంద: అనుభవిస్తావ్.. నన్ను ఇంత మందిలో కొట్టావ్.. నానా మాటలు అన్నావ్.. ఆరోజు ముకుందని ఎందుకు అంత బాధ పెట్టానా అని అనుకునే రోజు తప్పకుండా వస్తుంది గుర్తు పెట్టుకో కృష్ణ. అని ముకుంద ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. 
ఆదర్శ్‌: వెళ్లిపోయింది.. వెళ్లిపోయిందిరా.. ఇదే కదా మీరు నా జీవితంలో జరగాలి అనుకున్నది..ఇప్పుడు సంతోషమేనా మీకు. రేయ్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు. మీరు అసలు మనుషులేనా.. మీకు మనసు అంటూ ఉందా.. మిమల్ని.. ఛా..


కృష్ణ: ఏసీపీ సార్ ఎలా మాట్లాడుతుందో చూశారా ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. 
మురారి: నాకు తెలుసు కృష్ణ. ఏదో ఒక రోజు ముకుంద ఇలా చేస్తుంది అని అనుకున్నాను. కానీ ఈరోజు అనుకోలేదు. ఇంతకు ముందు లాగే ఏదో ఒకటి చెప్పి శోభనం ఆపేస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఆదర్శ్‌ని ఎలా ఓదార్చాలి.. పెద్దమ్మకు ఏం సమాధానం చెప్పాలో తెలీడం లేదు. 


ఇంతలో ఆదర్శ్‌ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తాడు. కృష్ణ, మురారి, మధు ఎంత పిలిచినా ఆగడు. మురారి ఆదర్శ్ చేతిలో బ్యాగ్‌ లాక్కొని ఎక్కడకు వెళ్తున్నావ్ అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆదర్శ్‌ నన్ను మీరు మోసం చేశారని ముకుంద లేకుండా ఇక్కడ నేనేం చేయాలి అని వెళ్లిపోతా అంటాడు.


కృష్ణ: ముకుంద ఎక్కడికి వెళ్లిపోతుంది ఆదర్శ్‌ కోపం తగ్గాక మళ్లీ వస్తుంది. 
ఆదర్శ్: తిరిగొస్తే ఏం చేయాలి. ఇంత జరిగాక కూడా ముకుంద నీ మనసులో చోటు ఇవ్వు అని అడుక్కోవాలా. 
కృష్ణ: అలా మాట్లాడొద్దు ఆదర్శ్‌ తను నీ భార్య. తన మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ముకుంద తన తప్పు తెలుసుకుంటుంది.
ఆదర్శ్‌: నువ్వు ఆ మాట అనొద్దు కృష్ణ. ముకుంద ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది నువ్వు. నువ్వు తప్పు చేసి ముకుందను బయటకు తరిమేశావ్. ముకుంద వెళ్లిపోవడానికి నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండటానికి కృష్ణనే కారణం. 
మురారి: హే ఆపు.. కృష్ణని ఎందుకురా అంటున్నావ్. నీకు ఏ హక్కు ఉందని అంటున్నావ్..
రేవతి: రేయ్ మళ్లీ ఏంట్రా గొడవ. జరిగింది చాలదా..
మురారి: తప్పు చేసింది కృష్ణ అని అంటుంటే నేను ఎలా ఊరుకుంటాను. చెప్పు కృష్ణ చేసిన తప్పు ఏంటి.. విడిపోయిన మీ ఇద్దర్ని ఒకటి చేయాలి అనుకుంది అదే తను చేసిన తప్పా. పెద్దమ్మ మనవురాలిని ఇవ్వమని అడిగినా కూడా మీరిద్దరూ ఒకటి అయితే తప్ప మేం ఒకటి కాకూడదు అని తన శోభనాన్ని కూడా వాయిదా వేసుకుంది అదా తను చేసిన తప్పు. మీ సంతోషంలో తన సంతోషం వెతుకున్న పిచ్చిదిరా అదా తను చేసిన తప్పు. తప్పు ఏదైనా జరిగి ఉంటే అది నా వల్ల జరిగింది. నువ్వు ముకుందని ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు నీకోసం ఆలోచించకుండా ముకుందని నేను ప్రేమిస్తున్నా అని చెప్పుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. చెప్పకుండా తప్పు చేసింది నేను. నన్ను వదిలేసి ఏం జరిగినా కృష్ణ.. కృష్ణ అంటావ్ ఏంటి. కృష్ణ ఏం తప్పు చేయలేదు. ముకుంద చేసిన తప్పులకు అడ్డుగా నిలబడింది అంతే.. అసలు గట్టిగా మాట్లాడితే వీటన్నింటికి కారణం నువ్వు. నువ్వు ఒక చేతగాని వాడివి చవట దద్దమ్మవి కాబట్టే ఇదంతా జరిగింది. 
రేవతి: రేయ్.. ఆపండ్రా.. ముకుంద ఎక్కడికి వెళ్లిందని కంగారు పడుతుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా..
మురారి: నా భార్య కారణం అంటున్నాడు అమ్మా నేను ఎలా ఊరుకుంటాను. ఆ రోజు పెళ్లిలో ఫోన్‌లో మాట్లాడింది విని ఏం జరిగిందో తెలుసుకోకుండానే వెళ్లిపోయావ్. ఆరోజు ఇంట్లో ఈ విషయం చెప్పి ఉంటే..
ఆదర్శ్‌:  ఏం జరిగేది చెప్పురా.. ఇంత కంటే గొప్పగా ఉండేదా..
మురారి: అది తెలీదు కానీ ఇలా మాత్రం జరిగేది కాదు. ఈ రెండేళ్లు మా జీవితాలు వేరుగా ఉండేవి.. ఆ రోజు ఏం మాట్లాడకుండా వెళ్లి పోయి నెంబర్లు మార్చేసి అడ్రస్‌లు మార్చేసి ఇప్పుడు నా భార్యను అంటావ్ ఏంటి. మాట్లాడరే తప్పు చేసింది కృష్ణ అంటే మీరు నమ్ముతారా.. కృష్ణ వీళ్ల కోసం ఏమేం చేసిందో మీకు తెలీదా.. 
ఆదర్శ్‌: అవున్నా తప్పు నాదే మీరు నా కోసం చాలా చేశారు కానీ అవన్నీ చేయకపోయి ఉంటే బాగుండేది. నేను అక్కడెక్కడో చేత కాని దద్దమ్మలా ఉండేవాడిని.. అయినా ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదురా. నేను తిరిగి రావడం ఇదంతా జరగడం ఓ పీడకలలా మర్చిపోతాను. నేను వెళ్లిపోతాను నన్ను వెళ్లనివ్వండి..
మురారి: ఏయ్ ఆగు ఇప్పుడు నువ్వు వెళ్లిపోయి మమల్ని దోషుల్లా పెద్దమ్మ ముందు తలదించుకునేలా చేస్తావా.. ముకుంద వెళ్లి పోవడానికి కృష్ణ కారణం అన్నావు కదా. మేం ఇద్దరం ముకుంద ఎక్కడున్నా తీసుకొస్తాం. పెద్దమ్మ వచ్చేవరకు మీరిద్దరూ ఇక్కడ ఉండాల్సిందే. 
కృష్ణ: అవును ఆదర్శ్‌ అప్పుడు ఆవేశంలో చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు. పెద్దత్తయ్య వచ్చేవరకు ఇక్కడే ఉండు ఆదర్శ్‌. పెద్దత్తయ్య అన్నింటికి పరిష్కారం చెప్తారు. 
రేవతి: ఇంకేం చెప్పకు పద ఆదర్శ్‌.. పద.
ఆదర్శ్: నేను ఇక్కడ ఉండను పిన్ని నాకు నరకంలా ఉంటుంది. 


కృష్ణ, మురారిలు తమ గదిలో బాధపడతారు. మురారి కృష్ణని ఓదార్చుతాడు. ముకుంద ఎక్కడికి వెళ్లుంటుంది అని కృష్ణ అనుకుంటుంది. ఇక ముకుందకు ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుంది. ఇక ముకుంద ఎక్కడికి వెళ్లుంటుందని అనుకుంటారు. అయినా సరే వాళ్లిద్దరినీ ఒక్కటి చేయాలి అని కృష్ణ మురారితో చెప్తుంది. ఇక మురారి కృష్ణతో ముకుంద ఈ ఇంటిని వదిలేసి ఉండలేదు అని వదిలేసి ఉంటే ఎప్పుడో వెళ్లిపోయేది అని అంటాడు. ఇక ఆదర్శ్‌ పొద్దునే మందు తాగాలి అని తన పిన్ని రేవతికి నీరు తెమ్మంటాడు. దీంతో మధు ఆదర్శ్‌కి క్లాస్‌ పీకుతాడు. ఇక తన గుండెలో మంట చల్లారాలి అంటే నీళ్లు కలిపిన మందు కాదు రా తాగాల్సిందే అని నట్టింట్లో మందు తాగుతాడు ఆదర్శ్‌. ఇక మురారి, కృష్ణ అది చూసి షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: 'నాగ పంచమి' సీరియల్ మార్చి 11th: పంచమిని కాపాడటానికి రంగంలోకి దిగిన నాగేశ్వరి.. చచ్చినా పెళ్లి చేసుకోనని తెగేసిన మోక్ష!