Krishna Mukunda Murari Today Episode: భవాని కొడుకు ఆదర్శ్‌కి గోరుముద్దలు తినిపిస్తుంది. ఆదర్శ్ కూడా తల్లికి తినిపిస్తాడు. జాబ్ ఎందుకు రిజైన్ చేశావని కొడుకుని అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా అని ఆదర్శ్‌ అనేస్తాడు. 


కృష్ణ: నేను చెప్తా అత్తయ్య రిస్క్ ఆపరేషన్స్ అంటే చాలు ముందే ఉంటారు. ఈయన దూకుడు వల్ల మిగతా వాళ్లు ఎక్కడ రిష్క్‌లో పడతారా అని అడ్మనిస్ట్రేషన్‌లో వేశారు అంట. అది ఇష్టం లేక ఆదర్శ్‌ రిజైన్ చేశాడు. 
భవాని: అన్ని రిస్క్ ఆపరేషన్లేనా.. చేస్తాడు. చేస్తాడు.. ఎందుకు చేయడు అమ్మ ఒకర్తి ఉందని గుర్తు ఉంటేనే కదా.. 
ఆదర్శ్: నువ్వు అలా మాట్లాడకు అమ్మా.. 
భవాని: లేకపోతే మరేంట్రా.. అసలు నువ్వు రిస్క్‌ ఆపరేషన్లు ఎందుకు తీసుకున్నావు. 
అయినా ఎందుకు వేయించుకున్నావో నాకు తెలుసులే. ఈ అమ్మ గుర్తు ఉండి ఉంటే మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు.
మురారి: ఇంక ఆ ఛాన్స్ లేదులే పెద్దమ్మ రిజైన్ చేశాడు కదా.. 
కృష్ణ: మనసులో.. పెద్దత్తయ్య ఏంటి ఎప్పుడు చూసినా అమ్మ ఉంటుంది అమ్మ ఉంటుంది అంటుందే కానీ ఎదురు చూసే భార్య ఉంటుంది అని చెప్పడం లేదు. ఈవిడకు ఇంకా ముకుంద మీద కోపం తగ్గలేదా..
ముకుంద: మనసులో.. అత్తయ్య ఏంటి అసలు నా ప్రస్తావనే తీసుకురాలేదు. అంటే నా మనసు పసిగట్టిందా.. అమ్మో అలా అయితే నన్ను ఇంట్లోనే ఉండనివ్వదు. అనుమానం రాకుండా నటించాలి. భగవంతుడా ఎందుకు ఇంత కఠినమైన పరీక్ష పెట్టావు. 


ఇక మధు ఆదర్శ్‌ని చివరి సారి చేసిన ఆపరేషన్ ఏంటని అడుగుతాడు. ఆదర్శ్‌ తన బెటాలియన్ చేసిన ఆపరేషన్ గురించి చెప్తాడు. తానే ముందుండి 10 మంది పాకిస్తాన్ చొరబాటు దారులను చంపానని చెప్తాడు అందరూ క్లాప్స్ కొడతారు. 


మధు: అవును బ్రో మీరు ప్రతీ ఆపరేషన్‌కి పేరు పెడతారు కదా ఈ ఆపరేషన్‌కు ఏం పేరు పెట్టారు. 
ఆదర్శ్: అవన్నీ ఇప్పుడు ఎందుకు..
మురారి: ఇంత చెప్పి పేరు చెప్పడానికి ఏమైంది. 
ఆదర్శ్: అది.. ఆపరేషన్ ముకుంద.
మురారి: నువ్ సూపర్‌రా.. ఆదర్శ్ నిజంగా హాట్స్ఆఫ్.. భార్య పేరు మిలటరీ ఆపరేషన్‌కు పెట్టిన మొట్టమొదటి మిలటరీ ఆఫీసర్‌వి కూడా నువ్వే. 
రేవతి: ముకుంద మీద ఆదర్శ్‌కి ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం అక్క. ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తాలు పెట్టించేద్దాం. పంతులు గారికి కబురు పెట్టించనా..
భవాని: అలాగే..


ఉదయం కృష్ణ, ముకుందలు తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తుంటారు. అది చూసి రేవతి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏమైందని భవాని అడిగితే ఆసీన్ చూపిస్తుంది. చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదా అని అంటుంది. ఇక నందూ అయితే నాకు చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు అంటుంది. 


రేవతి: ఇలాంటి ఒకరోజు వస్తుందని అస్సలు అనుకోలేదు అక్క. ఇలా ఇద్దరూ కలిసిపోతారు అని నేను కలలో కూడా అనుకోలేదు. 
నందూ: అవును అమ్మ బద్ధ శత్రువుల్లా ఉండేవారు సొంత అక్కా చెల్లెల్ల కంటే అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అన్నింటికీ కారణం కృష్ణే. తన బతుకునే పనంగా పెట్టింది. ఇక కృష్ణ, ముకుందలు పూజ చేసి హారతి తీసుకొని వస్తారు. ముకుంద భవానికి హారతి ఇస్తుంది. భవాని తీసుకుంటుంది దాంతో ముకుందతో పాటు అందరూ సంతోషంగా ఫీలవుతారు. ఇంతలో మధు వచ్చి మన ఇంటి కథే సినిమాగా తీస్తాను అంటాడు.
భవాని: ముఖం పగులుతుంది. సినిమా తీసి మన ఇంటి విషయాలు బజారులో వేద్దాం అనుకుంటున్నావా.. మన కథ సినిమాగా తీస్తే జరిగేది అదే.. ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్య ఉంది. ఇప్పుడు లోకం మొత్తం తెలుస్తుంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. 
ముకుంద: మనసులో.. అందరికీ తెలిస్తే పరువు పోతుంది అంటే అది నేను చేసిన పనుల వలనే కదా అంటే అత్తయ్య గతం ఏదీ మర్చిపోలేదు. 


మురారి: మనసులో.. ఇక అమ్మా పెద్దమ్మ హ్యాపీగా ఉంటారు సమస్యలు అన్నీ తీరిపోయాయి. ఇక నేను జాబ్ లోకి వెళ్తాను. అప్పుడు కృష్ణ కూడా హాస్పిటల్‌కి వెళ్తుంది. కృష్ణ వచ్చావా.. నీ గురించే ఆలోచిస్తున్నా.. ఇక నువ్వు హాస్పిటల్‌కి వెళ్లు. 
కృష్ణ: అలాగే ఏసీపీ సార్. ముకందలో చాలా మార్పు వచ్చింది. పూజ చేయడానికి కూడా వచ్చిందంటే.. గతాన్ని పూర్తిగా మర్చిపోయింది అని అర్థం. నాకు చాలా హ్యపీగా ఉంది. సరే మీరు కాఫీ తాగండి.. 


మరోవైపు రేవతి, నందూ హాల్‌లో పంతులు కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. ఆదర్శ్‌ని పిలుచుకురమ్మని రేవతి ముకుందకు చెప్తుంది. ఎందుకు అని ముకుంద అడిగితే పంతులు వస్తారు అని అంటుంది. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది. మనసులో నచ్చని పని చేయలేను ఎలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రేవతి అలా ఆలోచిస్తావేంటి వెళ్లి ఆదర్శ్‌ని పిలువు అని చెప్తుంది. ముకుంద వెళ్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ జనవరి 26th - సత్యభామ సీరియల్: సత్యకు నచ్చిన మాధవ్.. ఓకే చెప్పేస్తుందా.. హర్షని కొట్టిన రుద్ర!