Krishna Mukunda Murari Today Episode కృష్ణ, మురారిలు గదిలో మాట్లాడుకుంటారు. భవానితో శోభనాల గురించి మాట్లాడానని తను ఒప్పుకోలేదు అని కృష్ణ చెప్తుంది. కావాలి అంటే మనకు ముహూర్తం పెట్టించుకోమని చెప్పిందని.. నేను వద్దు అని రెండు జంటలు ఒకేసారి చేసుకుంటాం అని చెప్పానని కృష్ణ మురారికి చెప్తుంది. దీంతో మురారి ఏంటి రెండు జంటలు ఒకసారి చేసుకుంటామ్ అని చెప్పి వచ్చావా నిన్ను ఇలా కాదే కర్ర ఏదో అని వెంటపడతాడు. కృష్ణ పరుగు అందుకుంటుంది. 


మురారి: సరే అప్పుడు కూడా పంతులు గారు పెట్టిన ముహూర్తానికి పెద్దమ్మ ఒప్పుకోక పోతే ఏం చేద్దాం.
కృష్ణ: ఇలా అన్నారు బాగుంది. నా అనుమానం ప్రకారం పెద్దత్తయ్యకి ముకుంద మీద ఇంకా అనుమానం తగ్గలేదు. 
మురారి: అది అర్థమవుతుంది. దానికి ఏం చేయాలి.
కృష్ణ: వాళ్లిద్దరూ బాగాలేరు అనే భ్రమ తొలగించి బాగున్నారు అనేలా చేయాలి. దానికి ఏం చేయాలో అర్థం కావడంలేదు.
మురారి: ఐడియా ఇందాకే గోపి కాల్ చేశాడు. బెస్ట్ కపుల్ కాంపిటేషన్ పెడుతున్నాడు అంట. మనల్ని ఒక కపుల్‌గా పార్టిసిపేట్ చేయమన్నాడు. మనతో పాటు ఆదర్శ్ ముకుందల పేర్లు కూడా ఇచ్చాను అనుకో వాళ్లే ఆ ప్రైజ్ గెలిచారే అనుకో పెద్దమ్మ అనుమానాలు అన్నీ పటాపంచలైపోతాయ్.
కృష్ణ: సూపర్ ఏసీపీ సార్ మీరు.. ఇది కచ్చితంగా వర్క్‌అవుట్ అవుతుంది. కానీ వాళ్లే గెలుస్తారు అన్న గ్యారెంటీ ఏంటి. 


అందరూ భోజనాలకు కూర్చొంటారు. పప్పులో ఉప్పులేదు. కూర ఉడకలేదు ఇలా ఏవీ బాలేవు అని అందరూ అంటారు. ఎప్పుడూ బాగా వండే కృష్ణ ఈ సారి ఎందుకు ఇలా చేసిందా అని అందరూ అడుగుతారు. ఇక నందూ ఈరోజు నేను కృష్ణకి సాయం చేశానని చెప్తుంది. అందరూ నవ్వుకుంటారు. 


మురారి: మా ఫ్రెండ్ వాళ్లు బెస్ట్ కపుల్ పోటీలు పెడుతున్నారు. అందుకు ముకుంద, ఆదర్శ్‌ల పేర్లు ఇచ్చాను. 
ముకుంద: మురారి మా పేర్లు ఎందుకు నువ్వు, కృష్ణ వెళ్లండి.. 
కృష్ణ: మాపేర్లు కూడా ఇచ్చాం. మాతో పాటు మీ పేర్లు ఇచ్చాం.
మధు: మనసులో.. ఇప్పుడు ఎలా మ్యానేజ్ చేస్తుందో చూస్తా.. ఇప్పుడు అన్నీ తేలిపోతాయ్. 
ఆదర్శ్‌: నాకు ఓకే ముకుంద నీకు ఓకే..
భవాని: ఏదీ ఎవరితో బలవంతంగా చేయించకూడదు ఆదర్శ్ ఇంట్రస్ట్ లేకపోతే వదిలేయడమే మంచిది. 
ముకుంద: ఇంట్రస్ట్ లేకపోవడం ఏం లేదు అత్తయ్య. పాపం ఆదర్శ్‌ ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాడు కదా ఇప్పుడే అవన్నీ ఎందుకు అని.. 
మధు: అయినా ఇలాంటి పోటీలు అంటే ఎవరైనా ముందుంటారు. నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తున్నావో నాకు అయితే అర్థం కావడం లేదు. 
ముకుంద: ఇష్టం లేదు మధు. ఆదితో కలిసి పాల్గొవడం ఇష్టం లేదు అని కాదు. అక్కడ ఎవరైనా ఏమైనా అంటే ఆది తట్టుకోలేడు ఏమో అని అలా అన్నాను. బెస్ట్ కపుల్ కాంపిటేషన్‌లో ఏ గొడవలు లేని అన్యోన్యంగా ఉండే కపుల్‌ని ఒకే చేస్తారు. కానీ మేం కలిసి ఉన్నది పెళ్లి అయిన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారు అంటే ఏం చెప్పాలి. అందరి ముందు తల దించుకోవడం తప్ప చెప్పడానికి సమాధానం ఏం ఉంటుంది. ఇంత వరకు నా వల్ల జరిగింది చాలు. ఆదికి మళ్లీ నా వల్ల తలదించుకునే పరిస్థితి రాకూడదు. 
మురారి: నువ్వు చెప్పింది నిజమే ముకుంద.
ముకుంద: మనసులో.. నాకు తెలుసు మురారి నన్ను ఎవరైనా అర్థం చేసుకునే వాళ్లు ఉన్నారు అంటే అది నువ్వే. 
మురారి: కానీ ఎక్కువ కాలం కలిసి ఉండేవాళ్లే బెస్ట్ కపుల్స్ అనిపించుకుంటారు అంటే ఈ లోకంలో 90 శాతం మంది బెస్ట్ కపుల్స్ కావాలి. కానీ అందరూ అవుతారా.. బెస్ట్ కపుల్ అంటే ఎంత కాలం కలిసి ఉన్నామన్నది కాదు. ఎలా కలిసి ఉన్నాం అనేది ముఖ్యం. 
కృష్ణ: మీరు వస్తే అవన్నీ తొలగిపోతాయి. 


భవాని: తనలో తాను.. ఎవరు ఏమైనా అంటే ఆదర్శ్‌ ఫీలవుతాడు అనే వద్దు అందా లేకపోతే ఆదర్శ్‌తో వెళ్లడం ఇష్టం లేక అలా అందా.. ఆదర్శ్‌కి ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం అంటే ఇష్టం. రాత్రి పూట బయటకు వెళ్లడం అంటే ఇంకా ఇష్టం ఇప్పుడు వెళ్లుండేవాడు కానీ ముకుంద ముందే కలగజేసుకొని వద్దు అనేసింది. దీంతో ఆదర్శ్‌ కాదు అనలేక నీ ఇష్టం అనేశాడు. రింగ్ విషయంలోనూ ఇలాగే చేసింది. ఇవన్నీ చూస్తుంటే ముకుంద మీద రోజు రోజుకు అనుమానం పెరిగిపోతుంది. బెస్ట్ కపుల్‌ పోటీలు ఉన్నాయి కదా చూద్దాం. ఆదర్శ్‌తో కలిసి పాల్గొంటుందా.. లేక ఏదో కారణం చెప్పి తప్పించుకుంటుందా.. చూద్దాం.. 


ఆదర్శ్: ముకుంద మనం కూడా మురారి వాళ్లతో బయటకు వెళ్తే బాగుండేది.
ముకుంద: మనసులో.. కింద వాళ్ల గోల తప్పింది అంటే ఇక్కడ ఈయన మొదలు పెట్టారు. 
ఆదర్శ్‌: ముకుంద నిన్ను ఒక విషయం అడుగుతా చెప్తావా.. నీకు వాళ్లతో కలిసి వెళ్లడం ఇష్టం లేదు కదా.. 
ముకుంద: మనసులో.. వాళ్లతో కాదు నీతో కలిసి వెళ్లడం ఇష్టం లేదు. ఆ మాట నీకు చెప్పలేను కదా.. ఇంట్లో వాళ్లతో కలిసి ఉంటున్నాం. బయట వెళ్లడానికి అభ్యంతరం ఏంటి.. ఇంకా నీకు నా మీద నమ్మకం లేదా.. 
ఆదర్శ్‌: అలా కాదు ముకుంద.. ఎందుకో నాకు అలా అనిపించింది అడిగాను అంతే. నీకు వెళ్లడానికి ఇష్టం లేక తప్పించుకోవడానికి అలా చెప్పినట్లు అనిపించింది. 


కృష్ణ, మురారిలు సరదాగా బైక్‌ మీద వెళ్తారు. మధ్యలో ఓ చిన్న పిల్లాడు బైక్‌కు అడ్డుగా వస్తాడు. ఆ పిల్లాడి ఓ వ్యక్తి దొంగ అని కొట్టబోతే కృష్ణ అడ్డుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ ఫిబ్రవరి 2nd: సత్యభామ సీరియల్: సత్య నిశ్చితార్థం అడ్డుకున్న క్రిష్‌, లాగిపెట్టి కొట్టిన సంపంగి - నవ్వుకుంటున్న కాళీ!