Krishna Mukunda Murari Serial Today Episode


కృష్ణ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన పెద్దత్తయ్య తనని దూరం పెడుతోంది అని బాధపడుతుంది. ఒకప్పుడు తన చేత హాస్పిటల్‌ కూడా పెట్టిస్తానన్న భవాని ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయిందా అని అనుకుంటుంది. ఒక్క నిమిషం తన గురించి ఆలోచిస్తూ ఉంటే బాగున్ను అనుకుంటుంది. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. 


మురారి: మనసులో.. పెళ్లి అయిన వేణి గారితో నేను ఒంటరిగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్. పెద్దమ్మ అబద్ధం చెప్పిందా. నేను వేణి గారితో మాట్లాడకూడదని అలా చెప్పొండొచ్చు కదా
కృష్ణ: సార్ ఎంత సేపు అయింది వచ్చి
మురారి: కృష్ణ మెడలో తాళి చూసి.. పెద్దమ్మ అబద్ధం చెప్పలేదు. అసలు ఇంత వరకు నేను ఈ తాళి ఎందుకు గమనించలేదు. అప్పుడే గమనించినట్లయితే నేను ఇంత వరకు రాను కదా
కృష్ణ: పాపం ఏసీపీ సార్ నాకు పెళ్లయింది అని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా.. రండి సార్ రండి.. కూర్చొండి
మురారి: లేదు లేండీ నేను వెళ్తా.. ఎప్పటికైనా వెళ్లాల్సిన వాడినే కదా
శకుంతల: ఏంటి అల్లుడు ఈ తీరు మాట్లాడుతున్నాడేంటి..  
కృష్ణ: ఏసీపీ సార్‌కి నేను భార్య అని చెప్పలేను అలా అని బాధ పెట్టలేను ఎలా.. ఏంటి సార్ ఏమైంది మీకు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు
మురారి: కొత్త విషయాలు తెలిసినప్పుడు అన్నీ కొత్త గానే అనిపిస్తాయి కదా
కృష్ణ: మీకు తెలిసిన ఆ కొత్త విషయం ఏంటో నాతో చెప్పకూడదా.. నా దగ్గర కూడా సీక్రెట్‌నా.. అంటే మీరు నన్ను దూరం పెట్టేస్తున్నారు అంతేనా 
మురారి: మనసులో.. ఇప్పుడు పెళ్లి అయిందా.. భర్త ఎవరు అని అడిగితే మీకు ఎందుకు అని అంటే నేను ఏ సమాధానం చెప్పాలి. అయినా నేను ఏం తప్పుగా అడగటం లేదే మీ భర్త ఏం చేస్తారు అని అడగడంలో తప్పు లేదే. 
కృష్ణ: సార్ ఏంటి ఏదో లోకంలో ఉన్నారు
మురారి: నరకం అనే లోకంలో ఉన్నాను.. అవును మీరు ఇక్కడ ఒక్కరే ఉన్నారు ఏంటి.. మీ వారు ఎక్కడ ఉంటున్నారు.. అదే మీరు ఎప్పుడు ఊరెళ్లినట్లు గానీ, మీ వారు ఇక్కడికి వచ్చినట్లు గానీ చూడలేదు అందుకే అడిగాను మీరు ఏం అనుకోకండి.. 
కృష్ణ: నా భర్త ఎవరు ఆయన ఏం చేస్తుంటారు అనేది మీకు కావాలి అంతే కదా.. ఆయన మీకు కూడా తెలుసు సార్.. అవును సార్.. మీకు బాగా తెలుసు. ఒకసారి బాగా ఆలోచించండి మీకే తెలుస్తుంది. 
మురారి: నేను ఆలోచించడం ఏంటి.. మీ వారి గురించి నేను ఆలోచించడం ఏంటి నాకు ఏమీ అర్థం కావడం లేదు
కృష్ణ: అర్థం అవుతుంది సార్. మీకు గతం గుర్తొచ్చినప్పుడు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక డాక్టర్‌గా చెప్తున్నా మీకు ఇప్పుడు హోం వర్క్ చాలా అవసరం. నేను నా భర్త ఎవరో చెప్పను. మీరే బాగా ఆలోచించండి. సార్ ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను. నేను నా భర్త కోసం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లను. కానీ నాకు మా వారికి ఎలాంటి విభేదాలు లేవు. నేను అంటే ఆయనకు ప్రాణం. నాకు ఆయన అంటే ప్రాణం. వెళ్లి ప్రశాంతంగా ఆలోచించండి. 


మరోవైపు ముకుంద తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి మురారిని అక్కడికి తీసుకొస్తుంది. అయితే మురారి కృష్ణ లేచిందో లేదో అని ఆలోచిస్తాడు. ఇక కృష్ణ కూడా అదే పూజ చేస్తుంది. ఇక కృష్ణ ముకుంద, మురారిలకు గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇక కృష్ణ మావారు చల్లగా ఉండాలి అని ఈ పూజ చేస్తున్నా తప్పా ముకుంద గారు అని అంటుంది. దీంతో మురారి వేణి గారు మా వారు అంటున్నారు ఎవరు ఆయన.. అతనికి నా గతానికి సంబంధం ఏంటి తల్లీ నాకు ఈ ప్రశ్నలన్నింటికీ తొందరగా సమాధానం దొరికేలా చేయు అని మనసులో కోరుకుంటారు. ఇక ముకుంద, కృష్ణ ఇద్దరూ ఎవరి ఇంటి ఎదురుగా వాళ్లు దీపాలు వెలిగిస్తారు. మురారి కూడా కృష్ణను చూస్తూ దీపాలు వెలిగిస్తాడు. ఇక కృష్ణ తులసి కోటకు పూజ చేసినంత సేపూ మురారి తననే చూస్తాడు. ఇక ఇద్దరూ కలిసి పూజ చేసినట్లు చూపిస్తారు. 


కృష్ణ: తల్లీ లక్ష్మీ దేవి, విష్ణుమూర్తి స్వామి మీ ఇద్దరి దయవల్ల మా ఆయనకు త్వరగా గతం గుర్తొచ్చేలా చేయండి స్వామి. మీ మీద నమ్మకంతోనే బతుకుతున్నాను. 
మురారి: ఏం కోరుకుంటుంది తన ఆయన బాగుండాలి అనా అనుకుంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.