Krishna Mukunda Murari Today Episode శ్రీనివాస్ ఇళ్లు అమ్మేస్తాడు. సేటు శ్రీనివాస్‌కు డబ్బులు తెచ్చి ఇస్తాడు. శ్రీనివాస్ ముకుందకు కాల్ చేస్తాడు. ముకుంద కాల్ కట్ చేస్తుంది. తన తండ్రి ఏం పనీ పాటా లేదు అనుకుంటుంది. మళ్లీ కాల్ చేస్తాడు. ఇళ్లు అమ్మేశాను అని చెప్తాడు. ఎవరికైనా దొరికిపోతాను అని ముకుంద వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. 


మరోవైపు కృష్ణ గది అంతా తల కిందులైనట్లు వెతుకుతుంది. మురారి ఏంటి అని అడిగితే నాకు చిరాకుగా ఉంది అని నా పని నన్ను చేసుకోనివ్వండి అని అంటుంది. దీంతో మురారి చిరాకుగా ఉందా అని కృష్ణకు కితకితలు పెడతాడు. ఇద్దరూ అలా నవ్వుకోవడం సరసాలాడటం ముకుంద చూస్తుంది. 


ముకుంద: ప్రేమించాను అని ఎంత వెంటపడినా ఏ రోజూ పట్టించుకోలేదు. కానీ అది కొంచెం చిరాకు పడగానే నవ్వించడానికి తెగ ఆరాట పడుతున్నాడు. 


ఇంతలో కృష్ణ చేయి తగిలి ఫైల్ పడిపోతుంది. ఇక ఆ ఫైల్ సర్దుతూ కృష్ణ తన పెద్దత్త భవాని తొందరగా తల్లి కావాలి అన్న లెటర్ చూస్తుంది. త్వరగా ఆ కోరిక నెరవేరుస్తాను అని మా అత్తయ్యకు చెప్పి శోభనం ముహూర్తం పెట్టిస్తాను అనుకుంటుంది. ఇంతలో రేవతి పిలవడంతో ఆ లెటర్ అక్కడే పెట్టి వెళ్తుంది. ముకుంద వచ్చి ఆ లెటర్ తీసుకుంటుంది. ఇక రేవతి తనకి వంట చేయడం ఇష్టం లేదు అంటే కృష్ణ నేను సుమలత అత్తయ్య చేస్తాం అంటుంది. 


కృష్ణ: అత్తయ్య ఇంట్లో సమస్యలు అన్నీ తీరిపోయాయా..
రేవతి: తీరిపోయాయే బాగానే ఉన్నాం కదా.
కృష్ణ: ఏమీ లేవా..
రేవతి: ఏమీ లేవే నువ్వు ఏమైనా తెచ్చావా..
కృష్ణ: నన్ను చూసి చెప్పండి అత్తయ్య. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో మీకు అర్థం కావడం లేదా..
రేవతి: ఓ నీ బాధ ఏంటో అర్థమైంది. 
కృష్ణ: కనిపెట్టేశారా.. సిగ్గు పడతూ.. ఇలాంటివి నేను చెప్పడం కాదు మీరు చెప్తే బాగుంటుంది. చెప్పండి ప్లీజ్.
రేవతి: ఏయ్ ఈ మాత్రానికే అలా మెలికలు తిరిగిపోతావేంటి. హాస్పిటల్‌కి వెళ్లాలి అని ఉంది అంతేనా..
కృష్ణ: అత్తయ్య అది కాదు.. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అత్తయ్య.. 
రేవతి: ఇంకేమున్నాయే.. 
కృష్ణ: ఇంకేం లేవా.. అని అరుస్తుంది. అరే కొడుకు పెళ్లి అయింది. సంవత్సరాలు దాటుతున్నాయి. మనవడో మనవరాలినో ఎత్తుకోవాలి అని లేదా.. ఎంత సేపు వంట గదిలో దూరామా.. వండామా.. అందరికీ సరిపోయిందా ఇదేనా..మీ కోడలి కడుపు పండితే చూడాలి అన్న ఆశ లేదా..
రేవతి: ఓసినీ ఇదా ఉండు.. ఇప్పడే వెళ్లి అక్కతో మాట్లాడుతా.. నువ్వు వంట పని చూడు..


ముకుంద లెటర్ పట్టుకొని రగిలిపోతుంది. తల్లి అవుతుందంట.. తల్లి.. ఈవిడ తల్లి అయితే తండ్రి మురారి కదా.. నో మురారి నా బిడ్డకు మాత్రమే తల్లి అవ్వాలి అనుకుంటుంది ముకుంద. ఎన్ని సార్లు శోభనానికి ముహూర్తాలు పెట్టినా జరగనివ్వను అనుకొని లెటర్ చింపేస్తుంది. దాన్ని ఆదర్శ్ చూస్తాడు. 


ఆదర్శ్: ఏంటి ముకుంద ఏదో లెటర్ చింపేస్తున్నావ్.
ముకుంద: ఇదా ఏదో పాత లెటర్.. ఎవరో ఎప్పుడో రాసింది. ఇప్పుడు ఉపయోగం లేదు అని చింపేశా.
ఆదర్శ్: ఉపయోగం లేకపోతే మామూలుగా చింపొచ్చు కదా అంత కోపం కసిగా ఎందుకు చింపావ్. ఇప్పుడు కూడా నీ ముఖంలో ఆ టెన్షన్ కనిపిస్తుంది. ఆదర్శ్‌ లెటర్ ముక్క తీసుకొని అందులో కృష్ణ అని ఉండటం చూసి.. కృష్ణ గురించి రాసుంది ఏంటి.. 
ముకుంద: దొరికిపోయాను.. ఏమీ లేదు అంటే ఉన్న ఇంప్రెషన్ పోతుంది. అలా అని నిజం చెప్పలేను. ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేయాలి... నాకు సంబంధించిన ప్రతీదీ మీకు చెప్పాను. అది ముకుంద రాసిన లెటర్. ఈ లెటర్‌లో కృష్ణ గురించి రాసింది. చూశాకా నాకు కన్నీళ్లు ఆగలేదు. కృష్ణ మీద కోపం ఆగలేదు. ఆ కోపం అంతా ఈ లెటర్ మీద చూపించి చింపేశా. అసలు ఒక ఆడదానిగా సాటి ఆడదానిగా ఇంత అన్యాయం ఎలా చేస్తారు ఆదర్శ్‌ గారు. తలచుకుంటే బాధగా ఉంది. పాపం మన ముకుంద ఎంత నరకం అనుభవించిందో. దారుణం ఆదర్శ్‌ గారు.. మరీ దారుణం.


రేవతి భవాని దగ్గరకు వెళ్లి కృష్ణ శోభనం గురించి మాట్లాడుతుంది. భవాని కృష్ణ, మురారిలను పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు మనస్శాంతి లేకుండా చేస్తానన్న నర్శింహ.. కార్తీక్‌ ఇంట్లో జడ్జిగా మారిన వంటలక్క!