కృష్ణకి అన్యాయం చేయవద్దని రేవతి ముకుందతో మాట్లాడేందుకు చూస్తుంది. కానీ తను మాత్రం ప్రేమని గెలిపించుకునేందుకు ఎంత దూరమైన వెళ్తానంటూ తెగేసి చెప్తుంది.


రేవతి: కృష్ణ విషయంలో చేస్తున్న పని తప్పని అనిపించడం లేదా?


ముకుంద: అనిపించడం లేదత్తయ్య. ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు. అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా నిజమైన భార్యాభర్తలుగా నటించడం మోసం కాదా? త్యాగం పేరుతో నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమనడం అన్యాయం కాదా? కృష్ణ వాళ్ళు ఏం చేసిన అది లోక్ కళ్యాణం కోసం.. కానీ నా ప్రేమని దక్కించుకోవడం తప్పని అంటారు. తప్పులన్నీ మీ వైపు పెట్టుకుని నన్ను నిందిస్తారు. దోషిలాగా నిలబెడతారు ఇది కరెక్ట్ కాదు. అందుకే మీరు ఇన్నాళ్ళూ దాస్తూ వచ్చిన నిజాన్ని అత్తయ్యకి తెలిసేలా చేస్తాను. ఏం జరుగుతుందో జరగనివ్వండి. కృష్ణ ఈ ఇంట్లో ఉండకూడదు, ఆదర్శ్ తిరిగి రాకూడదు. ఇదే నా అజెండా.. ముకుంద వెడ్స్ మురారీ ఇదే జరుగుతుంది రాసి పెట్టుకోండి


ALso Read: బాలయ్య స్టైల్ లో ఏంఎస్ఆర్ కి రిషి అదిరే వార్నింగ్- శైలేంద్ర గురించి జగతి నిజం బయటపెడుతుందా?


ముకుంద కిచెన్ లో ఉండగా అలేఖ్య వచ్చి హనీ మూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారని అడుగుతుంది. అప్పుడే హనీ మూన్ దాకా వెళ్లావ్ ఏంటని అంటుంది. పారిస్ కి వెళ్లాలని ఉందని చెప్తుంది. మీతో పాటు మేము కూడా వస్తామని అలేఖ్య అడుగుతుంది. ముందు పెళ్లి కానివ్వు తర్వాత దాని గురించి ఆలోచిద్దామని అంటుంది. మురారీ డల్ గా ఇంటికి రావడం చూసి ఏమైందని భవానీ అడుగుతుంది. జర్నీ చేసి అలిసిపోయానని చెప్తాడు. కృష్ణ ఎక్కడ కనిపించడం లేదని భవానీ అంటే హాస్పిటల్ లో ఏదో ఆపరేషన్ ఉందని కాల్ చేసి చెప్పిందని అంటాడు. కానీ మధుకర్ వచ్చి కృష్ణ హాస్పిటల్ లో లేదు ఇంట్లోనే ఉందని చెప్తాడు. అప్పుడే కృష్ణ కిందకి దిగి వస్తుంది. ఏంటి కృష్ణకి ఏదో ఆపరేషన్ ఉందని చెప్పావ్ కదా అని భవానీ నిలదీస్తుంది. తను చెప్పిన అబద్దాన్ని కవర్ చేసేందుకు కృష్ణ ట్రై చేస్తుంది. ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారా అని భవానీ డౌట్ పడుతుంది.


భవానీ: ఆదర్శ్ వస్తున్నాడని ముకుంద ఇంటి పనులు, వంట పనుల బాధ్యతలన్నీ తీసుకుంది


కృష్ణ: అవునా .. ఇవన్నీ ఆదర్శ్ కోసం చేస్తున్నావా?


ముకుంద: అవును ఆదర్శ్ కోసమే అలవాటు చేసుకుంటున్నా


తనకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనుకుంటుంది. ముభావంగా ఉండకుండా ఎప్పటిలాగా తింగరితనంతో ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కృష్ణ మనసులో అనుకుంటుంది. భవానీ కూడా ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అనుకుంటుంది. కృష్ణ గదిలో ఉంది ముకుంద, మురారీ చేసిన మోసం తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అని కృష్ణ అంటుంది.


కృష్ణ: పెద్దత్తయ్య దగ్గర కానీ అత్తయ్య దగ్గర కానీ ఏదైనా రహస్యం దాచారా?


మురారీ: పెద్దమ్మ దగ్గర అమ్మ దగ్గర దాచిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర దాచిన నిజాలు నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు నీతో మాత్రం చెప్తాను


కృష్ణ: నిజాలు దాస్తే మీ హెల్త్ కి అవతలి వాళ్ళ హెల్త్ కి మంచిది కాదు. పెద్దత్తయ్య దగ్గర దాచిన నిజం చెప్పేసి న్యాయం అడగండి


Also Read: కావ్య రాక్స్.. రుద్రాణి షాక్- తెలివిగా అత్త మనసు మార్చిన కళావతి


మురారీ: ఒకవేళ నిజం ఎప్పటికీ తెలియకూడనిది అయితే


కృష్ణ: ఏసీపీ సర్ నిజం నాకు మాత్రమే చెప్పి నన్ను కన్వీన్స్ చేసి అత్తయ్య వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నారా? అని మనసులో అనుకుంటుంది


ఇద్దరూ మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాత్రం మరొకటి మాట్లాడుకుంటూ విసుగు పుట్టిస్తారు. మురారీ ద్వారా నిజం చెప్పించాలని చాలా ట్రై చేస్తుంది కానీ ఫలితం ఉండదు. కృష్ణకి నిజం తెలిసిపోయిందేమోనని టెన్షన్ పడతాడు.