కృష్ణ నిద్రలేచేసరికి మురారీ గదిలో కనిపించడు. తనని నిద్రలేపకుండా బయటకి వెళ్లడని బాత్ రూమ్ లో ఉన్నాడని అనుకుని పిలుస్తుంది. బయటకి వచ్చి చూసేసరికి మురారీ, ముకుంద ఒకేసారి మెట్లు దిగుతూ బయటకి వెళ్ళడం కనిపిస్తుంది. అది చూసి కృష్ణ ఫీల్ అవుతుంది. ముకుందకి జాగింగ్ కి వెళ్ళే అలవాటు లేదు కదా ఇప్పుడు కనీసం చెప్పకుండా వెళ్తున్నారని అనుకుంటుంది. మురారీ జాగింగ్ చేసుకుంటుంటే ముకుంద అడ్డుపడి తను మాట్లాడటానికి వచ్చానని అంటుంది.


మురారీ: నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా చివరికి చస్తానని బెదిరించినా కూడా ఐ డోంట్ కేర్. నువ్వు ఇలా దిగజారి.. మీతో ఇలా మాట్లాడటం నా వల్ల కావడం లేదు. మీరు నా ప్రాణ స్నేహితుడు భార్య. మీకు ఇలా నీతులు చెప్పడం బాగోలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇలా దారి కాయడాలు, కృష్ణకి నాకు మధ్య దూరిపోవడాలు ఇలాంటి పనులు చేస్తే ఉన్న గౌరవం కాస్త పోతుంది


ముకుంద: డబుల్ యాక్షన్ అదరగొట్టావ్. గుండెలు తీసిన బంటువి నువ్వు. మాట్లాడేదాన్ని పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా చివరికి రావల్సింది నా దగ్గరకే కలిసేది మన ఇద్దరమే. రెండు నిమిషాలు అడ్డుపడితేనే నీకు అంత కోపం వచ్చింది. మరి జీవితాంతం కృష్ణ నా ప్రేమకి అడ్డుపడితే నాకు ఎంత కోపం రావాలి


మురారీ: ఇందులో తన తప్పేమీ లేదు తనని ఏమి అనకు


Also Read: నిజం చెప్పేయమన్న జగతి- ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రిషి


ముకుంద: నువ్వు తనని వెనకేసుకుని రాకు నాకు ఒళ్ళు మండుతుంది. నేను నిన్ను అంత తేలికగా వదులుకోను. కృష్ణని ఇంట్లో నుంచి పంపించేసేదాకా ఊరుకోను.


మురారీ: సరే ఏం చేస్తావో చెయ్యి కృష్ణని ఇల్లు కాదు కదా గేటు కూడా దాటనివ్వను


ముకుంద: సరే ఇవాళ డేట్ 19 సరిగ్గా పది రోజుల్లో కృష్ణ మన ఇంట్లో నుంచి తనకి తానుగా వెళ్ళిపోతుంది. ఆదర్శ్ ఇంటికి తిరిగి రాడు. ఒకవేళ వచ్చినా ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. పారిపోయేలా చేస్తాను. నీకు నాకు మధ్య కృష్ణ, ఆదర్శ్ కాదు కదా భవానీ ఫ్యామిలీ మొత్తం వచ్చినా నాధాటికి ఎవరూ తట్టుకోలేరు. ఇప్పటి వరకు నా ప్రేమని మాత్రమే చూశావ్. తెగింపు చూడాలని అనుకోకు చూడలేవు తట్టుకోలేవు అల్లాడిపోతావ్


జాగింగ్ పూర్తి చేసుకుని మురారీ బైక్ తీసి వెళ్లబోతుంటే ముకుంద వచ్చి బైక్ ఎక్కబోతుంటే ముందుకు కదిలించేస్తాడు. దీంతో తను కిందపడిపోతుంది. నడుము పట్టేసిందని పైకి లేపమని అంటుంది. తనకి దెబ్బ తగిలిందని నటించి మురారీ భుజం మీద చెయ్యి వేసి బైక్ మీద కూర్చుంటుంది. కృష్ణ తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉండగా మురారీ వాళ్ళు బైక్ మీద రావడం చూస్తుంది. ముకుంద కృష్ణని చూసి నొప్పితో నడవలేకపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. బండి మీద కూర్చుని వచ్చేసరికి నడుము పట్టేసిందని చెప్తుంది. భుజం మీద చెయ్యి వేసుకుని నడుస్తానని అడుగుతుంది. కృష్ణ ఇక్కడే ఉంది కదా పిలుస్తానని అంటాడు. మురారీ ఎన్ని సార్లు పిలిచినా కూడ కృష్ణ వినిపించి కూడా వినిపించనట్టుగా తులసి కోట చుట్టు ప్రదక్షిణలు చేస్తుంది.


మురారీ వాళ్ళు అలా రావడం చూసి కృష్ణ లోలోపల బాధపడుతుంది. ముకుంద ఇదంతా కావాలనే చేస్తుంది, కృష్ణకి తనకి మధ్య మనస్పర్థలు రావాలని చూస్తుందని మురారీ అనుకుంటాడు. జాగింగ్ కి వెళ్తున్నట్టు పిలిస్తే తను కూడా వచ్చేదాన్ని కదా కృష్ణ మురారీతో అంటుంది. ముకుంద ఎందుకు కుంటుతుందని అడిగితే పరిగెడుతుంటే కాలు జారి పడిపోయిందని చెప్తాడు. వెంటనే ముకుంద దగ్గరకి వెళ్ళి పలకరించి ఎలా ఉందని ఆరా తీస్తుంది.


కృష్ణ: పరిగెడుతుంటే జారి పడిపోయావంట కదా అలా ఎలా జరిగింది


Also Read: సీతారామయ్య కోరిక విని షాకైన తల్లీకొడుకులు- భర్త ప్రేమకి పొంగిపోయిన కావ్య


ముకుంద: లేదు నేను మురారీ బైక్ ఎక్కుతుంటే స్లిప్ అయ్యాను. అప్పుడే తను పట్టుకుని బైక్ ఎక్కించాడని చెప్పేసి కావాలని ఎగురుతూ వెళ్ళిపోతుంది. అది చూసి కృష్ణ డౌట్ పడుతుంది. ఇందాక పైకి రావడానికి ఇబ్బంది పడింది ఇప్పుడేమో ఇలా చేసింది ఏసీపీ సర్ అబద్ధం చెప్పారా అని బాధపడుతుంది. కృష్ణకి ఎలాగైనా తమ మీద డౌట్ వచ్చేలా చేసి ఏదో ఒకరోజు పూర్తిగా తమ విషయం చెప్పేయాలని ముకుంద ఆలోచిస్తూ ఉండగా అలేఖ్య వస్తుంది. మురారీ గదిలో ముకుంద లవ్స్ మురారీ అని డెకరేట్ చేసింది తీసేసింది మధుకర్ అనే విషయం అలేఖ్య చెప్పేస్తుంది.