కృష్ణ విషయం చెప్పకుండా టెన్షన్ పడుతుంటే మురారీ ఏమైందని అడుగుతాడు. అసలు విషయం ఏంటని అంటాడు. చవితి చంద్రుడిని చూశానని సోది చెప్పినట్టు చెప్తుంది. ఎక్కడ నీలాపనిందలు పడతాయోనని భయంగా ఔనదని ఓవర్ యాక్షన్ చేస్తుంది. విషయం తెలిసేసరికి మురారీ రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. నువ్వు తింగరి పిల్లవి కాదు.. మెంటల్ కృష్ణ అని పిలవాలని అంటాడు. ఇద్దరూ చాలా దగ్గరగా మాట్లాడుకోవడం చూసి ముకుందను కోపంతో మురారీ అని పిలుస్తుంది. డోర్ నాకు చేయకుండా గదిలోకి రావడం సభ్యత కాదని కృష్ణ కౌంటర్ వేస్తుంది.
ముకుంద: పండగ కింద జరుగుతుంటే పైన మీరు ఏం చేస్తున్నారు.
కృష్ణ: మేం ఇప్పుడు రాము మా విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు.
Also Read: ఎండీ సీటు దక్కకుండా శైలేంద్రకి ఝలక్ ఇచ్చిన వసు - జగతి జ్ఞాపకాల్లో మహేంద్ర
కృష్ణ ఎప్పటిలాగా సాధారణంగా ఉన్న చీర కట్టుకుని రావడం చూసి మురారీ తనని తిడతాడు. వెళ్లి చీర మార్చుకుని రమ్మని చెప్తాడు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండటం చూసి అలేఖ్య తప్పు చేస్తున్నానా అనుకుంటుంది. మళ్లీ తప్పు అంతా ముకుందదే అని లైట్ తీసుకుంటుంది. కృష్ణ కట్టుకున్న చీర చూసి ఇది ఏం చీర రేవతి తిడుతుంది. మళ్లీ చీర మార్చుకుని రమ్మని అంటుంది. మార్చుకోలేనని ఏసీపీ సర్కి నచ్చిందే చేస్తానని చెప్తుంది. ప్రభాకర్ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని పిలవడానికి ఎవరైనా వస్తారో లేదో అని ముకుంద గదిలోనే ఆలోచిస్తూ ఉండగా మధుకర్ వచ్చి ఒకసారి పిలిచి వెళ్లిపోతాడు. శకుంతల కృష్ణ వాళ్లకి ఎదురుపడి ముకుంద పిలిచినా రాలేదని చెప్తుంది. మురారీని వెళ్లి పిలుచుకుని రమ్మని అంటుంది.
మురారీ: నేను ఎందుకు తనే వస్తుందిలే..
శకుంతల: ఏంటి ఆ బిడ్డ పేరు చెప్తేనే భయపడుతున్నావ్
కృష్ణ: నేను వెళ్లి పిలుచుకుని వస్తానులే
శకుంతల: వద్దులే ఆ అమ్మాయి నిన్ను చీటికి మాటికి తిడుతుంది.
కృష్ణ రోజురోజుకీ స్పీడు పెంచుతుంది. ఎలాగైన పెద్దత్తయ్యకి విషయం తెలిసేలా చేసి కృష్ణని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటూ ఉండగా మురారీ ముకుంద దగ్గరకి వస్తాడు. కింద అందరూ ఎదురుచూస్తున్నారు రమ్మని పిలుస్తాడు. వాళ్ల మాటలు అటుగా వెళ్తున్న ప్రభాకర్ వింటాడు.
Also Read: కావ్యకి సపోర్ట్‌గా మాట్లాడిన అపర్ణ- రాజ్‌ని నిలదీసిన కనకం, కళావతి పయనం ఎటువైపు?
ముకుంద: వాళ్లందరూ నాకు ఎందుకు? నాకు నువ్వు కావాలి. ఇక్కడ ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా ఎందుకు ఉంటున్నానో తెలుసా నీకోసం. మురారీ గుండెల మీద చెయ్యి వేసి ఇక్కడ నా స్థానం. కృష్ణ నీ ముందే నన్ను అన్నీ మాటలు అంటుంటే చూస్తూ ఊరుకున్నావ్. నిన్ను దేవుడిలా కొలుస్తున్న నన్ను తిడుతుంటే ఒక్క మాట అన్నావా? నేను నీకు అంత కానీ దాన్ని అయ్యానా
మురారీ: నువ్వు నాకు కానిదానివే. కానీ మా కుటుంబానికి కావాల్సిన దానివి అది మాత్రం గుర్తు పెట్టుకో. భార్యాభర్తల మధ్యలోకి రావడం ఎంత వరకు కరెక్ట్ ఆలోచించావా?
ముకుంద: నేను తప్పా నీకు ఆ స్థానంలో ఎవరూ ఉండకూడదు
మురారీ: నీ భార్య స్థానం ఆదర్శ్ దగ్గర
ముకుంద: స్టాప్ ఇట్.. నేను ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు ట్రాష్ గురించి మాట్లాడతావే
మురారీ: ఆదర్శ్ గురించి మాట్లాడితే ట్రాష్ అంటావే ఇష్యూ చేయకుండా కిందకి వచ్చేయ్
అందరూ కిందకి వస్తారు. మురారీని ప్రభాకర్ కోపంగా చూస్తూ ఉంటాడు. మావయ్య ఫేస్ చూస్తుంటే మా ఇద్దరినీ చూసినట్టే ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలా అని మురారీ మనసులో అనుకుంటాడు. కృష్ణ వాళ్లని పిలుస్తుంటే అల్లుడితో మాట్లాడాలని చెప్పి ప్రభాకర్ మురారీని పక్కకి తీసుకుని వెళతాడు.