సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాయి. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కృష్ణ చిన్నాన్నగా వచ్చేశాడు. ఆయన్ని చూసి కృష్ణ చిన్నాన్న అంటూ పరుగున వెళ్ళి ప్రేమగా కౌగలించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. భవానీ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పలకరించి ఇంట్లోకి పిలుస్తారు. తన పెళ్ళాం శకుంతల అని పరిచయం చేస్తాడు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఇంట్లో అందరినీ పేరు పేరునా కృష్ణ చిన్నాన్నకి పరిచయం చేస్తుంది.


మురారీ: మీ చిన్నాన్న మా గురువులాగే ఉన్నారు


కృష్ణ: వాళ్ళిద్దరూ కవల పిల్లలు


ప్రభాకర్: అంతా బాగానే కనిపిస్తుంది కానీ ముకుంద భర్త కనిపించడం లేదు ఏమైంది బయటకి వెళ్లారా


Also Read: కావ్య బుట్టలో పడిపోయిన తింగరి అత్త అపర్ణ- కొడుకు చెంప పగలగొట్టిన రుద్రాణి


తర్వాత మాట్లాడుకుందాం అనేసి ఇంట్లోకి వెళతారు. ముకుంద ఏదో తేడా కొడుతుందని ప్రభాకర్ దంపతులు అనుకుంటారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికి కూర్చుంటే ముకుంద వెళ్ళి మురారీ పక్కన కూర్చోబోతుంటే ప్రకాశం అడిగేస్తాడు. కూర్చోవడం లేదని చెప్పి పక్కకి వెళ్లిపోతే కృష్ణ వెళ్ళి కూర్చుంటుంది. కాసేపు అవీ ఇవీ చేశానని డబ్బా కొట్టుకుంటాడు. ప్రభాకర్ ఇడ్లీలో సాంబారు కలుపుకుని తినడం చూసి ముకుందకి వాంతులు అవుతాయి. అది చూసి ఏమైనా అనుకుంటారేమోనని భవానీ అనుకుంటుంది. ముకుంద ఆవేశంగా గదిలోకి వెళ్ళి అన్నీ వస్తువులు కింద పడేసి పగలగొడుతుంది. అలేఖ్య వచ్చి తనని ఆపుతుంది.


ముకుంద: నా చేతకాని తనం మీద నాకే కోపంగా ఉంది. అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు


అలేఖ్య: సహనంగా ఉండాలి


ముకుంద: నాకు పిరికి మందు పోయకు. అవసరం అయితే ఎంకరేజ్ చెయ్యి


అలేఖ్య: కంట్రోల్ చేసుకోక ఏం చేస్తావ్. మురారీ అంటే ఇష్టమని అందరికీ చెప్పు లేదంటే ఆదర్శ్ అంటే ఇష్టం లేదని డివోర్స్ ఇస్తానని చెప్పేసేయ్. అవి చేయలేని నీకు ఈ కోపం ఆవేశం పనికిరాదు. ఇప్పుడు నీకు కావలసింది ఆలోచన. పెద్దత్తయ్యకి శుభ్రంగా లేని వాళ్ళని ఇంట్లోకి రానివ్వదు అలాంటిది పెద్దపల్లీ ప్రభాకర్ ని ఇంట్లోకి రానివ్వడానికి కారణం కృష్ణ. ఇంట్లో జరిగే వాటికి కారణం కృష్ణ, రేవతి అత్తయ్య


ముకుంద: ఆపు వినలేకపోతున్నా


అలేఖ్య: నిజాలు ఇలాగే ఉంటాయి


ముకుంద: ఆదర్శ్ కి విడాకులు ఇస్తే నన్ను ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు. ఆదర్శ్ ని అడ్డం పెట్టుకుని నా ప్రేమకి అడ్డు తొలిగించే ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ కృష్ణ మీద పెద్దత్తయ్యకి ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా చేయాలి


ALso Read: ఓ వైపు రిషి పెళ్లి పనులు- మరోవైపు జగతి చావుకి ముహూర్తం పెట్టిన శైలేంద్ర


అలేఖ్య: అది సాధ్యం కాదు పెద్దత్తయ్య తనని నమ్మినట్టు నిన్ను నమ్మలేదు. కృష్ణ అందరినీ దగ్గరకి తీసుకుంటుంటే నువ్వు అందరినీ దూరం చేసుకుంటున్నావ్


కృష్ణ గదిలో ఉండగా మురారీ వస్తాడు. తన చిన్నాన్నని వేళాకోళం ఆడినందుకు అలక బూనుతుంది. దీంతో సోరి చెప్తూ మురారీ గుంజిలు తీస్తుంటే సరిగా అదే టైమ్ కి ప్రభాకర్ వస్తాడు. దీంతో కృష్ణ కాళ్ళ దగ్గర పడిపోతాడు. అదేంటని అడిగేసరికి కృష్ణ చైన్ కనిపించడం లేదని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. గదిలో ఉన్న కృష్ణ తండ్రి ఫోటో చూసి ప్రభాకర్ ఎమోషనల్ అవుతాడు.