మురారి ఆవేశంగా భవాని దగ్గరకు వచ్చి వేణిని ఎందుకు దూరం పెడుతున్నారని అడుగుతాడు. షాక్ తిన్న భవాని నిజం చెప్తానని అయితే నిజం తెల్సిన తర్వాత మళ్లీ నువ్వు వేణి దగ్గరకు వెళ్లి అడగకూడదని చెప్తుంది. మురారి సరే అంటాడు.
భవాని: ఆ అమ్మాయిని డాక్టర్ చదివించింది మనమే.. ఏ దిక్కు లేదని చేరదీసి ఒక దారి చూపిస్తే.. వాళ్లింట్లో వాళ్లు మన ఫ్యామిలీ పట్ల చాలా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించారు. మనల్ని బాధపెట్టారు. ఒకరకంగా నువ్విలా కావడానికి కూడా కారణం వాళ్లే. ఇంతకంటే ఎక్కువ అడగొద్దు నాన్నా. అందుకే ఆ అమ్మాయితో నువ్వు ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నా మాట కాదనవు కదా?
మురారి: లేదు పెద్దమ్మ కాదనను.
అనగానే భవాని సంతోషంగా లోపలికి వెళ్తుంది. మురారి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు.
కృష్ణ నిద్రలేచి బయటికి రాగానే బయట వరండాలో మురారి కూర్చుని ఉంటాడు. మురారిని చూసిన కృష్ణ షాక్ అవుతుంది. వెంటనే తేరుకుని మురారిని టీ తాగుతారా అంటూ లోపలికి పిలుస్తుంది. గ్యాస్ అయిపోవడంతో మురారి ఇక్కడ టీ తాగలేం కానీ మా ఇంటికి రండి నేను టీ పెడతాను తాగుదాం అంటూ చేయి పట్టుకుని కృష్ణను తీసుకుని వారి ఇంట్లోకి మురారి వెళ్లబోతుంటే
కృష్ణ: ఆగండి కొంచెం ప్రెష్ అప్ అయి వస్తాను
అంటూ లోపలికి వెళ్తుంది. ఇంట్లో ముకుంద కంగారుగా మురారిని వెతుకుతూ రేవతిని ఢీ కొంటుంది.
ముకుంద: సారీ అత్తయ్య చూసుకోలేదు. మురారి కనిపించకపోయే సరికి
రేవతి: మురారి ఏమైనా పసిపిల్లవాడా? పిచ్చోడా? నువ్వే వాణ్ని నీ పిచ్చి చేష్టలతో పిచ్చి వాన్ని చేస్తున్నావు.
ముకుంద: అత్తయ్య వెళ్తూ వెళ్తూ మురారి బాధ్యత నాకు అప్పగించింది కదా అత్తయ్య.
మధు: బాధ్యత తీసుకోవడం అంటే సంకనెక్కించుకోవడం కాదు. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావ్.
ముకుంద: ఎక్కువ మాట్లాడితే నా రియాక్షన్ మామూలుగా ఉండదు మధు.
మధు: నా రియాక్షన్ సంగతి అటుంచు. ఒక్కసారి అటు చూడు నీ రియాక్షన్ మామూలుగా ఉండదు.
అని మురారి, కృష్ణని వెంటబెట్టుకుని ఇంటికి రావడం చూసి మధు చెప్తాడు. వాళ్లిద్దరూ రావడం చూసిన ముకుంద షాక్ అవుతుంది. రేవతి, మధు హ్యాపీగా ఫీలవుతారు. కృష్ణ లోపలికి వస్తూ గుమ్మం దగ్గర నిలబడి భవానికి తెలిస్తే ఏమవుతుందోనని ఆలోచిస్తుంటే.. మురారి, కృష్ణను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. రేవతి కాఫీ తెస్తానని చెప్పగా లేదమ్మా కృష్ణకు నా చేతి కాఫీ రుచి చూపిస్తానని కిచెన్‌లోకి వెళ్లి కాఫీ చేసుకుని తీసుకోస్తాడు మురారి.
కృష్ణ: సార్ మీరు చేసిన కాఫీ అద్బుతంగా ఉంది.
మురారి: థాంక్యూ.. ఇల్లు చూపిస్తాను రా..
ముకుంద: నేను వస్తాను.
అనడంతో మధు అడ్డుపడి ముకుంద పెద్దమ్మ నీకో ఇంపార్టెంట్ పని అప్పజెప్పిందని చెప్తాడు. మురారి, కృష్ణ పైకి వెళ్లగానే.. ఏం పని చెప్పిందని ముకుంద మధును అడుగుతుంది. రాజమౌళికి ఫోన్ చేసి బాహుబలి త్రీ ఎప్పుడో కనుక్కోమంది అంటాడు. ముకుంద కోపంగా మధును చూస్తుంది. మధు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మురారి బెడ్‌రూంలోకి కృష్ణను తీసుకెళ్లి అక్కడ ముకుంద ఫోటో చూసి మర్చిపోయి మిమ్మల్ని ముకుంద రూంకి తీసుకొచ్చాను. ప్రతిరోజు ఎందుకో నేను నా రూంకే వెళ్లేవాణ్ని కాని ఇవాళ మీతో మాట్లాడుతూ ముకుంద రూంకి తీసుకొచ్చాను అంటాడు మురారి.
కృష్ణ: మీకు ఈ రూం నచ్చితే ఇక్కడే ఉండండి. ఇది మీ ఇల్లే కదా!
అనగానే మురారికి ఏవోవో గుర్తుకు వస్తుంటాయి.
మురారి: నాకు ఈ రూంకి ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఏవేవో గుర్తొస్తున్నాయి.
రూంలోకి ముకుంద వస్తుంది.
ముకుంద: అదేంటి మీరిద్దరు ఇక్కడున్నారు.
మురారి: నా రూం అనుకుని నీ రూంకి వచ్చాము. ముకుంద ఇఫ్ డోంట్ మైండ్ ఇకనుంచి నేను ఈ రూంలో ఉండొచ్చా? రూం మార్చుకుందాం
ముకుంద: అవన్నీ తర్వాత మురారి ముందు మనం షాపింగ్‌కు వెళ్లాలి. మళ్లీ పెద్దత్తయ్య వచ్చారంటే హడావిడి అయిపోతుంది. నువ్వే అన్నావ్ కదా వెళ్దామని..
మురారి: అవును కదా.. కృష్ణ నువ్వు కూడా మాతో రావొచ్చు కదా..
అనగానే ముకుంద వద్దంటుంది. ముకుందను మురారి ప్రతిదానికి ఎందుకు అడ్డుపడతావు అంటూ తిడతాడు. రేవతి, మధు కూడా అక్కడికి వచ్చి కృష్ణను షాపింగ్‌కు వెళ్లమని చెప్తారు. కృష్ణ అయిదు నిమిషాల్లో వస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. ఔట్‌హౌస్‌లోకి వెళ్లిన కృష్ణ దేవుడికి మొక్కుతూ ఉంటే రేవతి అక్కడకు వస్తుంది. ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అక్కడకు ముకుంద వచ్చి మురారి ఎప్పటకీ నీకు దగ్గర కాడని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ముగుస్తుంది.