Krishna Mukunda Murari November 3rd : బిర్యానీ తయారు చేయడానికి సరుకుల కోసం  పిల్లలను  కిరాణా షాపుకు పంపిస్తుంది కృష్ణ. అ సామాన్లు అన్ని మా ఇంట్లో ఉన్నాయి కదమ్మ బయటి నుంచి ఎందుకు తీసుకురావడం అంటుంది రేవతి.  మీ ఇంట్లో సరుకులు తీసుకుని మీకు వండి పెడితే  మీరు నాకు అతిథులు కారని సొంత వాళ్లవుతారని చెప్తుంది కృష్ణ


మురారి : ఇప్పుడు సొంత వాళ్లు అయితే ఏంటి నష్టం. అలా అనుకుంటే కూడా ఏమైనా నష్టమా?


కృష్ణ : అదేం లేదు సార్‌ ఊరికే అన్నాను.


మురారి: వేణి గారు ఏమైనా హెల్ఫ్‌ చేయమంటారా? లేక వద్దు సొంతవాళ్లవుతారని అంటారా?


కృష్ణ : ఏమొద్దు సార్‌ చూస్తూ ఉండండి. సరే మీకు టైం పాస్‌ అవ్వడానికి ఒక చిన్న గేమ్‌ అడుదామా?


భవాని: రేవతి త్వరగా కానిస్తే.. తినేసి వెళ్దాం.


మురారి: ఉండండి పెద్దమ్మ ఏదో గేమ్‌ అంటుంది కదా చెప్పండి వేణి గారు.


అనగానే కృష్ణ గేమ్‌ గురించి చెప్పగానే అందరూ గేమ్‌ ఆడతారు. తర్వాత కృష్ణ వంట పూర్తి చేస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తుండగా గేమ్‌లో ఎలా గెలిచావు అని మురారి, కృష్ణ ను అడుగుతాడు. కృష్ణ తాను గేమ్‌ ఎలా గెలిచిందో చెప్తుంటే


భవాని: వేణి బిర్యాని చాలా బాగుంది. నాన్నా మురారి ఇక నెల వరకు ఇలాంటి బిర్యాని తినలేవు.


మురారి: ఎందుకు పెద్దమ్మ


భవాని: నీకు బెటర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ముకుందను తోడుగా ఇచ్చి అమెరికా పంపిస్తున్నాం. థాంక్స్‌ డాక్టర్‌ టు యువర్‌ డిన్నర్‌. అసలు నువ్వు డాక్టర్‌ గా మానేసి వంటలు చేసుకుంటే ఇంకా పైకొస్తావ్‌. ఆలోచించు గివ్ యు థాట్స్‌.     


భవాని చెప్పిన మాటలకు షాకైన కృష్ణ లోపలి నుంచి వస్తున్న బాధను దిగమింగుతూ చూస్తుండిపోతుంది. తర్వాత లోపలికి వెళ్లిన కృష్ణ భవాని మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.


Also Read: తులసిని అనుమానించిన విక్రమ్ – మళ్లీ పెళ్లి ఆలోచనలో నందు!


మధు మెల్లగా నడుచుకుంటూ కృష్ణ దగ్గరకు వెళ్తూ..


మధు: ఇంటి కోడలును కలవడానికి భయపడాల్సి వస్తుంది. వీటన్నింటికి కారణమైన ముకుందను మాత్రం మహారాణిలా చూస్తున్నారు.


అనుకుంటూ కృష్ణ అంటూ పిలుస్తూ లోపలికి వెళ్లిన మధుకు జ్వరంతో ఊగుతూ పడుకున్న కృష్ణ కనిపించడంతో భయపడుతూ ఈ విషయం వెంటనే రేవతి పెద్దమ్మకు చెప్పాలని వెళ్తాడు.


మురారితో భవాని మాట్లాడుతూ..


భవాని: మురారి అమెరికాలో మా ప్రెండ్‌ భారతి ఉంది అక్కడ నీకు అంతా కంఫర్ట్‌ గా ఉంటుంది. ఏంటి నాన్న అలా ముభావంగా ఉన్నావ్‌ ఎనీ థింగ్ రాంగ్‌


మురారి: ఏం లేదు నథింగ్‌


భవాని: చూడు నాన్న ఇలా అందరిలో ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నావు. నీ పరిస్థితి నేను చూడలేను నాన్న.


మురారి: అయ్యో పెద్దమ్మ అదేం లేదు. కాని మన లేడీ డాక్టర్‌ ఉంది కదా మళ్లీ అంత దూరం ఎందుకని..?   


Also Read: కావ్యపై ద్వేషం పెంచుకున్న రాజ్‌ - స్వప్నకు వార్నింగ్‌ ఇచ్చిన కావ్య


మధు కంగారుగా పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ లోపలికి పరుగెత్తుకుంటూ వస్తాడు. భవానిని అక్కడ చూసి ఏం లేదన్నట్లు వెళ్లిపోతాడు. మధు అబద్దం చెప్పినట్లు అనిపిస్తుంది అని మురారి అనుకుని పెద్దమ్మ ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్తాడు. బయటికి వచ్చిన మురారి మధును విషయం ఏంటని అడిగితే మధు ఏం లేదని కంగారుగా వెళ్లిపోతాడు. దీంతో మురారి ఎవ్వరిని అడిగినా ఎవ్వరూ నాతో ఏం చెప్పట్లేదు. అందరూ నాతో ఏదో దాస్తున్నారు అనుకుని అదేంటో నేనే కనుక్కోవాలి అనుకుని కృష్ణ దగ్గరకు వెళ్తాడు.


మురారి: వేణి గారు ఏమైందండి..?


కృష్ణ: ఏం లేదు సార్‌ జ్వరమని మధు చెప్పాడు.


మురారి: ఇంత హై ఫీవర్‌ పెట్టుకుని ఏం లేదని అంటారేంటండి? పదండి డాక్టర్‌ దగ్గరకు వెళ్దాం. అసలు తప్పంతా నాదే రాత్రి డిన్నర్‌ చేయమని చెప్పాను దాంతో రెస్ట్‌ లేకుండా పోయింది.


అని కృష్ణ వద్దంటున్నా మురారి, కృష్ణని తీసుకుని డాక్టర్‌ దగ్గరకు వెళ్లడానికి బయటికి వస్తారు.


ఇంట్లోకి వస్తున్న మధును కోపంగా భవాని పిలుస్తుంది. మధు రాగానే ఇంతకు ముందు ఎంతుకు అంత ఓవరాక్షన్‌ చేశావు. ఇంకోసారి అలా చేయకు అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు కృష్ణ కు ఫీవర్‌ వచ్చిందని మధు నిజం చెప్తాడు. ఇంతలో మురారి లోపలికి వెళ్తుంటే భవాని పిలుస్తుంది.  


Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!


భవాని: ఏంటి నాన్నా అంత కంగారుగా ఉన్నావ్‌ ?


మురారి: ఏం లేదు.. డాక్టర్‌ గారికి బాగాలేదు. అందుకే హాస్పిటల్‌ కి తీసుకెళ్దామని కారు కీ తీసుకోవడానికి వచ్చాను.


భవాని : అయినా నువ్వు తీసుకెళ్లడం దేనికి నాన్నా.. తను డాక్టరే కదా తోడుగా మన మధును పంపిద్దాంలే.. ఏవే ఒక టాబ్లెట్స్ తీసుకొస్తాడులే..


అనగానే తనను హాస్పిటల్‌కు తీసుకెళ్తానని కరాకండిగా చెప్పగానే అయితే ముకుందను తోడుగా తీసుకెళ్లమని చెప్తుంది భవాని. ముకుంద, మురారి ఇద్దరూ వెళ్తారు. రేవతి ఏదో ఆలోచిస్తూ.. గుమ్మం దగ్గరకు వస్తుంది.


మధు: ఏంటి పెద్దమ్మ ఇంకా ఆలోచిస్తున్నావు.. హ్యాపీగా ఉండాలి కదా నీ కొడుకు కోడలు ఇంత త్వరగా కలిసిపోవడం నీకు ఇష్టం లేదా?


రేవతి:  నోరు మూయ్‌ 


అంటూ ఆ ఇద్దరు వెళ్లి ఉంటే బాగుండు కాని ముకుంద వెళ్లింది ఏం పెంట చేస్తుందో ఏమో అంటూ అనుమానిస్తుంది. అయితే ముకుంద ఏమీ చేయలేదని అన్ని చూసుకోవడానికి కృష్ణ ఉందని చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.