Gruhalakshmi November 3rd Written Upate: జాను బాధపడుతూ కూర్చుని ఉంటే వాళ్ల నాన్నగారు వచ్చి ఎంటి ఆలోచిస్తున్నావ్‌ అని అడుగుతాడు. దివ్య అక్క కిడ్నాప్‌ గురించే ఆలోచిస్తున్నాను అంటుంది. అసలు దివ్య అక్కను కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం ఎవరికుందని అడుగుతుంది. అప్పడు జాను వాళ్ల నాన్న తులసి, దివ్య కలిసే ఈ కిడ్నాప్‌ నాటకం ఆడారేమో అనిపిస్తుంది అంటాడు. జాను వాళ్ల నాన్న తిడుతూ


జాను: నువ్వు రాంగ్‌ డైరెక్షన్‌లో ఆలోచిస్తున్నావ్‌ డాడీ దివ్య అక్క, తులసి ఆంటీ ఆలాంటి వాళ్లు కాదు. నేను నమ్మను.


జాను డాడి : నమ్మి తీరాలి. దివ్యను కిడ్నాప్‌ చేసిన వాళ్లు మీ బావ చేతికి లెటర్‌ ఇవ్వడమేంటి? బెదిరించాలంటే ఆ తులసిని బెదిరించొచ్చు కదా? హని ఉండేది తులసి దగ్గరే కదా ముక్కు ఎక్కడుందంటే ఇలా తిప్పి ఎవ్వరూ చూపించరు కదా అక్కడెవ్వడో టీ స్టాల్‌ వాడు కారు నెంబర్‌ రాసుకోవడం ఏంటి? దాన్ని విక్రమ్‌ చేతికి ఇవ్వడం ఏంటి? ఇదంతా నాటకంలా లేదు. కావాలని దివ్య ఎక్కడుందో బావకు తెలిసేలా చేసినట్లు లేదు.


అనగానే మీకు ఇలాంటి వంకర ఆలోచనలు ఎలా వస్తాయి డాడీ అని జాను అడుగుతుంది. లేదని జాను బ్రెయిన్‌ వాష్‌ చేయడానికి కట్టుకథలు చెప్పి వెళ్లిపోతాడు. జాను ఆలోచనలో పడిపోతుంది.


హనిని బెడ్‌రూంలో నిద్రపుచ్చి తులసి బయటకు వస్తుంది. బయట నందు, హని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. తులసి అక్కడికి వచ్చి


తులసి: నందగోపాల్‌ గారు భోజనం చేయలేదు. కనీసం ఈ పాలైన తాగండి.


నంద: వద్దు తులసి నా మనస్సు ఏం బాగాలేదు. కాసేపు ఇలా ఒంటరిగా వదిలేయ్‌.


తులసి: ఏమైంది మనసుకు.. ఏమంటుంది..?


నంద: చేసిన తప్పుకు సిగ్గు పడుతుంది. చీటర్‌ అంటూ హని నా వైపు చూసిన చూపును మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో రెండే రెండు సార్లు చీటర్‌ అనిపించుకున్నాను. ఏడెనిమిదేళ్ల క్రితం నీతో అనిపించుకున్నాను. ఇప్పుడా చిన్న పిల్లతో చీటర్‌ అనిపించుకున్నాను. రెండు సార్లు నేను నమ్మించి మోసం చేశాను. రెండు సార్లు ఇద్దరికి తీరని నష్టం చేశాను. నేను చేసిన నష్టానికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను.


మనిషి తప్పు అనుకుని ఏ పని చేయడు. చేసిన తప్పుని ఒప్పుకున్నప్పుడే గొప్పవాడవుతాడు అని చెప్తుంది తులసి. ఈ పాతికేళ్లల్లో ఇవాళే  నాకు చాలా సంతోషంగానూ.. ధైర్యంగాను ఉంది. ఎందుకంటే మొదటిసారి మీరు నా వైపు నిలబడ్డారు అంటుంది. అయితే నా బిడ్డను కాపాడుకోవాలన్న  బాధతో హనిని అప్పగించాలనుకున్న కానీ హని మీద నాకు కోపం లేదు. అని చెప్తాడు నందగోపాల్‌. సంతోషంతో నేను కూడా ఇవాళ భోజనం చేయలేదు పాలు తాగాను. మీరు ఈ పాలు తాగండి అని పాలు నందకు ఇచ్చి వెళ్లిపోతుంది తులసి.


Also Read: కావ్యపై ద్వేషం పెంచుకున్న రాజ్‌ - స్వప్నకు వార్నింగ్‌ ఇచ్చిన కావ్య


లాస్య, రత్నం ఇంట్లో ఆవేశంగా తిరుగుతూ ఉంటారు.


రత్నం: అయిపోయింది ఇక మన పరువు పోయింది. ఎంత బెదిరించినా ఆ తులసి, నందు భయపడరు. మన మాట వినరు.


లాస్య: రత్నం నిప్పు చల్లారిపోతున్నప్పుడు మంట ఎగదోయాలి. అప్పుడే మంట రాజుకుంటుంది. అలాగే భయం చల్లారిపోతున్నప్పుడు గట్టిగా ఒక దెబ్బ కొట్టాలి. అప్పుడు మళ్లీ చచ్చినట్లు భయం మొదలవుతుంది.


రత్నం: ఇంతవరకు తులసిది ఇంట్లో ఒంటరి పొరాటమే.. ఇక నుంచి ప్యామిలి మొత్తం తనకు సపోర్టుగా నిలబడుతుంది. వాళ్లంతా కలిసిపోయారు. తులసి మనల్ని లెక్క చేయదు.


లాస్య: యుద్దం చేస్తున్న ఆఖరి క్షణంలో అర్జునుడు చేతులెత్తేశాడు. కానీ శ్రీకృష్ణుడు ఊరుకున్నాడా? అదే భగవద్గీతలో చెప్పారు కదా రెండు చేతులు జోడించి యుద్దానికి రెడీ అవ్వాలని.  


చెప్తూ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తారు. ఎంత వీలైతే అంత త్వరగా హనిని తమ దగ్గరు తెచ్చుకోవాలని డిసైడ్‌ అవుతారు లాస్య, రత్న.


Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!


నందగోపాల్‌ హుషారుగా ఉండటం చూసి వాళ్ల అమ్మా నాన్న ఎందుకు ఇంత హుషారుగా ఉన్నావ్‌ ఏంటి సంగతి అని అడుగుతారు. దానికి నందగోపాల్‌ తులసి తనతో సంతోషంగా మాట్టాడిందని.. నేను తన వెనకాల ఉన్నందుకు చాలా ధైర్యంగా ఉందని  అందుకే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు నందు. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అని అడుగుతే లేదని నందగోపాల్‌ చెప్తాడు. మళ్లీ పెళ్లికి రెడీ అయితే సంతోష పడాలి అని వాళ్ల అమ్మా నాన్న చెబుతారు. అప్పుడే అక్కడికి తులసి వస్తుంది.


తులసి : ఏంటి మామయ్య  మీ అబ్బాయి ఏమంటున్నారు.


మామయ్య: ఏం లేదమ్మా వాడికి ఇవాళ  చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాడు.


అనగానే సరేలేండి. కేఫ్‌కు వెళ్లే టైం అవుతుంది. త్వరగా రెడీ అవ్వండి. నేను వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి తులసి లోపలకి వెళ్లిపోతుంది.


విక్రమ్‌ వాళ్ల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు.


జాను: దివ్య నా మనసులో ఒక ప్రశ్న ఉంది అడగొచ్చా?


దివ్య: అడుగు తెలిస్తే చెప్తాను.


జాను: నిన్ను కిడ్నాప్‌ చేసిన చోటికి బావ వెతుక్కుంటూ వచ్చారు. కానీ సరిగ్గా అదే టైం కి తులసి అంటీ ఎలా వచ్చారు.


అని అడగ్గానే ఇలాంటి చెత్త డౌట్లు మీకెలా వస్తున్నాయి అంటూ దివ్య అడుగుతుంది. సమయానికి మా అమ్మ వచ్చి నన్ను కాపాడిందని సంతోష పడకుండా ఇలా అనుమానాలు పెట్టుకోవడం దేనికి అంటూ దివ్య ప్రశ్నించడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.