కృష్ణ, మురారీ రెస్టారెంట్ కి వెళ్ళి హ్యపీగా కపుల్ స్వీట్ తింటారు. భర్తకి ప్రేమగా స్వీట్ తినిపిస్తుంది. మురారీని కృష్ణ తదేకంగా చూస్తూ మురిసిపోతుంది. ఏంటి ఇవాళ నన్ను కొత్తగా చూస్తున్నావని మురారీ అడుగుతాడు. అత్తయ్య నా కొడుకుని బాగా చూసుకోమని చెప్పారు అందుకే బాగా చూసుకుంటున్నానని చెప్తుంది. కారులో వెళ్తూ ఇద్దరూ ఒక చోట ఆగి పుల్ల ఐస్ తింటారు. ఐస్ తిన్నాక పుల్ల పడేయకుండా నమలండి సూపర్ గా ఉంటుందని అంటుంది. అక్కడ పిల్లలు కొందరు క్రికెట్ ఆడుతూ డాన్స్ చేస్తుంటే కృష్ణ కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి ఎగురుతుంది. మురారీ వెళ్ళి తనని బలవంతంగా లాక్కుని వస్తాడు. ఇంటి ఆరుబయట ముకుంద నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమలో పడిన తర్వాత నా వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. కృష్ణ, మురారీ విడిపోవడం కోసమే పెళ్లి చేసుకున్న జంట. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు కలిసి ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో ఆలోచించాలని అనుకుంటూ ఉంటుంది.
Also Read: దివ్య గురించి విక్రమ్ మనసులో విషబీజం నాటిన రాజ్యలక్ష్మి- మళ్ళీ ఫస్ట్ నైట్ గోవింద
అప్పుడే మురారీ వాళ్ళు ఇంటికి వస్తారు. కృష్ణ కారు దిగకుండా టాప్ మీద ఎక్కి కూర్చుంటుంది. మురారీ వెళ్లిపోతుంటే పిలుస్తుంది. నన్ను ఎత్తుకుని దింపండి అప్పుడు వస్తానని చెప్తుంది. మురారీ వెళ్ళి కృష్ణని ఎత్తుకుని కారు మీద నుంచి కిందకి దింపుతాడు. ఆ సీన్ క్యూట్ గా ఉంటుంది. అది చూసి రేవతి మురిసిపోతుంది. ముకుంద మాత్రం రగిలిపోతుంది. కృష్ణ మురారీ వెనుకే నడుస్తూ భర్తని ఇమిటేట్ చేస్తుంది. గుమ్మంలో కృష్ణ పడబోతుంటే మురారీ పట్టుకుంటాడు. ఆ టచ్ కి కృష్ణ లో ఫీలింగ్స్ మొదలవుతాయి. నా కొడుకు కోడలు ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలని రేవతి మనసులోనే దేవుడిని మొక్కుకుంటుంది. కృష్ణ పడబోయిందని తన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ముకుంద మురారీ వైపు బాధగా చూస్తుంది. కృష్ణ రేవతి దగ్గరకి వచ్చి భలే కొడుకుని కన్నావ అత్తయ్య అని ముద్దు పెడుతుంది.
తండ్రి ఫోటో ముందు నిలబడి మాట్లాడుతుంది. కోపం, ద్వేషం మనసులో నుంచి పోతే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. అన్ని విషయాల్లో బాగుండె ఏసీపీ సర్ ఆ ఒక్క విషయంలో ఎందుకు ఇలా చేశారా అని బాధపడే దాన్ని. మీ చావుకు కారణం ఆయనే అనే భ్రమలో ఇంతకాలం బతికాను. ఇన్ని రోజులు అలాంటి మనిషితో పెళ్లి జరిగిందని బాధ పడ్డాను. మీరు ఎంత దూరం ఆలోచించి మా పెళ్లి జరిపించారో పూర్తిగా అర్థం అయ్యింది. ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నాయి. ఆయన్ని హంతకుడిగా చూసినప్పుడు ఏనాడూ ఎదురు తిరిగి నిజం చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలని అనిపిస్తుంది. నా పశ్చాత్తాపం చేతలతో చూపిస్తాను. సింపుల్ గా సోరి చెప్పడం కంటే సేవలతోనే నా కృతజ్ఞత చూపిస్తాను. ఒక మంచి మనిషి చల్లని నీడలో ఉండేలా చేశావని తండ్రికి సెల్యూట్ చేస్తుంది.
Also Read: జానకికి డెడ్ లైన్ పెట్టిన మనోహర్- రామ కోసం ఉద్యోగానికి రిజైన్ చేస్తుందా?
అప్పుడే మురారీ వస్తాడు. ఇవాళ నువ్వు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నావాని అడుగుతాడు. మీరు ఎప్పుడు ఒకలాగే ఉన్నారు నేనే ఎప్పటిలా లేనని అంటుంది. కృష్ణ మాట మారుస్తుంది. కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది అనుకుంటే చెప్పడం లేదు మా పెద్దమ్మ మాట్లాడటం లేదని కూల్ చేయడానికి ట్రై చేస్తుందేమో అనుకుంటాడు.