ముకుంద తన మనసులో ప్రేమని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతాడు. కృష్ణ, మురారీ మీద తీసిన వీడియోని మధుకర్ ఇంట్లో టీవీలో వేస్తాడు. అది చూసి కృష్ణ ఎమోషనల్ అయితే ముకుంద మాత్రం చాలా బాధపడుతుంది. ఇదేంటి నా మనసులో భావాలని అక్షరాలుగా పేర్చి మురారీతో చెప్పాలనుకున్న దాన్ని కృష్ణ ఇంత అందంగా ప్రేమగా చెప్తుంది. ఏం జరుగుతుంది? అసలు ఏంటి ఇదంతా అని ముకుంద మనసులో బాధపడుతుంది. మధుకర్ కి థాంక్స్ చెప్పుకుంటాడు మురారీ. కృష్ణ తన మనసులో ప్రేమని బయట పెట్టె ఒకరోజు వస్తుందని అనుకోలేదని మనసులోనే సంతోషపడతాడు. సందర్భం వచ్చింది కాబట్టి మీమీద నాకున్న ఫీలింగ్స్ బయట పడ్డాయి. ఇది మీకు అర్థం అవుతుందో లేదోనని కృష్ణ అనుకుంటుంది. ఈ సందర్భాన్ని వాడుకుని కృష్ణ తన మనసులో భావాన్ని చెప్పేసినట్టు ఉంది తన కళ్ళలో ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కృష్ణ మురారీ ప్రేమలో పడిపోయిందా అని ముకుంద టెన్షన్ పడుతుంది.
Also Read: డబుల్ ట్విస్ట్, నిజం తెలుసుకున్న స్వప్న- కావ్యని కిడ్నాప్ చేయించిన రాహుల్
వీడియో చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా చేశారని మెచ్చుకుంటారు. నా మనసులో మాటలు అంత బాగా చెప్తే ఆయనలో ఎటువంటి స్పందన లేదు ఏంటి? నేను వెళ్లిపోతానని అనుకుంటున్నారా? అని ఆలోచిస్తుంది కృష్ణ. అప్పుడే ముకుంద వచ్చి ప్రేమ గురించి చాలా బాగా చెప్పావని అంటుంది. ఆ స్క్రిప్ట్ మధుకర్ రాశాడంటే నమ్మకంగా లేదని కూపీ లాగడానికి చూస్తుంది. అవి స్క్రిప్ట్ లో లేదు అందులో లీనమైపోయానని అంటుంది. మురారీకి లవర్ ఉంటే ఎలా చెప్పెదో అలా చెప్పావని చెప్తుంది. కొన్ని రోజుల్లో వెళ్లిపోయే మనిషికి ఈ ఎమోషన్స్ ఏంటి? కృష్ణ మురారీతో ప్రేమలో పడిందా ఆలోచిస్తుంది. అందరూ భోజనం చేస్తూ ఉండగా మధుకర్ మరో కాన్సెప్ట్ చెప్తాడు. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు, అబ్బాయికి డైరీ రాసే అలవాటు ఉంది. తన ప్రేమ గురించి అందులో రాసుకుంటాడు. భార్య ఆ డైరీ చూసి వేరే వాళ్ళది చదవడం ఎందుకని అల్మరాలో పెట్టబోతుంటే ఆ అక్షరాలు ప్రేయసి గురించి రాసి ఉండటం చూసి షాక్ అవుతుందని చెప్పేసరికి మురారీ, ముకుంద మోహమోహాలు చూసుకుంటారు.
Also Read: రాజ్యలక్ష్మిని బెదిరించిన దివ్య- అన్ని దారులు మూసేసి నందుని ఇరకాటంలో పడేస్తున్న లాస్య
అది రేవతి గమనిస్తుంది. మురారీ వెంటనే గదిలోకి పరిగెత్తుతాడు. ఇంతలోనే ఏమైంది ఇంత కంగారుగా వెళ్లిపోయారని కృష్ణ అనుకుంటుంది. ముకుంద ప్రేమతో పడినప్పుడు రాసిన డైరీ ఇది కృష్ణ చూస్తే నాకు దూరమైపోతుందని దాన్ని దాచి పెట్టేస్తాడు. బయటకి వెళ్ళి దాన్ని కాల్చేయాలని అనుకుంటాడు. ఇంట్లో అందరూ హల్లో ఉంటారు. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నావని రేవతి అడుగుతుంది. చిన్న పని ఉందని టెన్షన్ పడతాడు. కానీ ఆ డైరీ కృష్ణ కంట పడుతుంది. అందులో తను రాసుకున్నది కూడా చదివేస్తుంది.