ముకుంద గీతికకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రోజురోజుకీ కృష్ణ పెద్దత్తయ్యని ఇంప్రెస్ చేస్తుందని భయపడుతుంది. దీంతో గీతిక ఏదో ఐడియా చెప్పేసరికి సూపర్ అని మెచ్చుకుంటుంది. గీతిక చెప్పినట్టు వాళ్ళు బాగా దగ్గరైన తర్వాత కృష్ణ, మురారీది బూటకపూ పెళ్లి అని చెప్తే ఇంకా ఎక్కువ హర్ట్ అయ్యి, తనని కూడా దారుణంగా మోసం చేశారని తన ముందు కూడా నటించారని రెచ్చిపోతుందని ముకుంద సంబరపడుతుంది. కృష్ణని మురారీ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. తను నడవడానికి ఇబ్బంది పడుతుంటే తన చేతిని భుజం మీద వేసి నడిపిస్తూ ఉండగా నర్స్ హనీ వచ్చి ఏంటి కృష్ణ మేడమ్ ఇలా చేశారని అంటుంది.


కృష్ణ: నేనేం చేశాను


హనీ: మొత్తం మీరే చేశారు. పరిమళ మేడమ్ మన స్టాఫ్ అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక మిమ్మల్ని ఎవరు కాపాడతారో ఏంటో అనేసి వెళ్ళిపోతుంది


మురారీ: కృష్ణ నేను కూడ వస్తాను


కృష్ణ: వద్దు సర్ హనీ ఎందుకు అలా అన్నదో నేనే తెలుసుకుంటానని హాస్పిటల్ లోకి వెళ్ళగానే పరిమళ సీరియస్ గా అంతా నీ ఇష్టమేనా అని అరుస్తుంది.


కృష్ణ: ఎందుకు అంత కోపం


Also Read: రాజ్‌కి దొరక్కుండా తెలివిగా తప్పించుకున్న కావ్య - స్వప్నకి గడ్డి పెట్టిన దుగ్గిరాల కుటుంబం


గౌతమ్: ఎందుకు కృష్ణ ఇలా చేశావ్ నీ వల్ల హాస్పిటల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసా? సోరి పరిమళ నేను తనతో అబద్ధం చెప్పలేను


స్టాఫ్ అంతా కలిసి పూల బొకేలు ఇచ్చి కృష్ణకి కంగ్రాట్స్ చెప్తారు.


పరిమళ: నువ్వు జూనియర్ సర్జన్ గా చేసిన సేవలకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది


గౌతమ్: మధర్ థెరిస్సా ఫౌండేషన్ వాళ్ళు నీకు ఉత్తమ జాతీయ హౌస్ సర్జన్ గా అవార్డు ఇవ్వడమే కాకుండా రేపు మన హాస్పిటల్ లో సన్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది దేశంలోనే మొట్ట మొదటిసారిగా జూనియర్ డాక్టర్ కి అవార్డు ఇవ్వడం. ఇప్పటి వరకు ఎవరికీ లభించలేదు. అది నువ్వే. గర్వంగా ఉంది కృష్ణమ్మ


గుడ్ న్యూస్ విని కృష్ణ చాలా ఆనందపడుతుంది. హాస్పిటల్ బయట ఉన్న మురారీ కృష్ణ ఏదైనా సమస్యలో ఇరుక్కుందా ఏంటని టెన్షన్ పడుతూ ఉంటాడు. నర్స్ వస్తే కృష్ణ ఏం చేస్తుందని అడిగితే ఆపరేషన్ జరుగుతుందని చెప్తుంది. కృష్ణ ఇంటి దాకా వెళ్లొస్తానని అడిగితే కాసేపు వద్దని హడావుడి చేసిన పరిమళ వెళ్ళమని పర్మిషన్ ఇస్తుంది. కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి మురారీని గట్టిగా కౌగలించుకుంటుంది.


కృష్ణ: ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. జూనియర్ డాక్టర్ గా నేను చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. రేపు హాస్పిటల్ లో సన్మానం కూడా చేయబోతున్నారు.


మురారీ: కంగ్రాట్స్ కృష్ణ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది


Also Read: ఇంటికి తిరిగొచ్చిన ఆదిత్య, వేదకి ఖుషి సపోర్ట్ - అభితో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న నీలాంబరి


ఇక కృష్ణ ఇంటికి వెళ్దామని అంటుంది. భవానీ అక్కలాగా కృష్ణ బాగా చేసింది కదా అని అలేఖ్య వాళ్ళు రేవతి దగ్గర మెచ్చుకుంటారు. గుడ్ న్యూస్ ని ఏదో ఒక తింగరి పని చేసి ఇంట్లో చెప్పాలని కృష్ణ అంటుంది. వద్దు ఇప్పటికీ పొద్దున్న ఇచ్చిన షాక్ లో ఉండి ఉంటారని వేరే విధంగా చెప్పమని సలహా ఇస్తాడు. కానీ కృష్ణ మాత్రం సంతోషంగా భవానీ దగ్గరకి వెళ్ళి ఆశీర్వదించమని కాళ్ళ మీద పడుతుంది. ఏం సాధించావని భవానీ అడుగుతుంది. జూనియర్ డాక్టర్ గా అవార్డు వచ్చిందని, రేపు సన్మానమని చెప్పేసరికి భవానీతో సహా ఇంట్లో అందరూ కృష్ణని మెచ్చుకుంటారు.


భవానీ: నీ కోడలు ఎంత గొప్ప విజయం సాధించిందో ఇంట్లో అందరికీ స్వీట్స్ చేయి రేవతి


రేవతి: అందరికీ మంచి పేరు తెచ్చావు నువ్వు నా బంగారు తల్లివి