కృష్ణ భవానీని చిన్న కోడలిగా అంగీకరిస్తుంది. ఇంటి కోడలి హోదాలో దక్కాల్సిన ఏడు వారాల నగలు తనకి అందిస్తుంది. ఈ ఇంట్లో అందరినీ నువ్వు ప్రేమతో వాళ్ళని గెలుచుకున్నావాని భవానీ మెచ్చుకుంటుంది. ఏసీపీ సర్ మనసులో తను లేనని, తన మనసులో భార్య స్థానం లేదని కృష్ణ చాలా బాధపడుతుంది. ఏడు వారాల నగలు తనే స్వయంగా కృష్ణకి వేసి అందంగా అలంకరిస్తుంది. మురారీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పేయమని అంటుందని బాధపడతాడు. నందు వచ్చి మురారీతో మాట్లాడుతుంది.


నందు: ప్రతీ ఆడది తాళికి విలువ ఇస్తుంది. అది బంధం అనుకుంటుంది. నీకోసం నేను కృష్ణని ఏమీ అనలేకపోతున్నా లేదంటే అమ్మతో మాట్లాడి మీ ఇద్దరినీ ఒక్కటి చేసేదాన్ని. కానీ నువ్వు ఒట్టు తీసుకుని నా నోరు మూయించావ్


Also Read: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్


అలేఖ్య వచ్చి మురారీ వాళ్ళని కిందకి రమ్మని పిలుస్తుంది. ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. తాళిబొట్టుకి మనస్పూర్తిగా పూసలు గుచ్చమని పూజారి చెప్తాడు. ముత్తైదువులు తాళికి పూసలు గుచ్చుతారు. ఒకప్పుడు తప్పని సరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఉన్న ప్రేమ మరొకరికి చెప్పుకోకుండా మనస్పర్థలతో మళ్ళీ చేసుకుంటున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే వాళ్ళు కలిసిపోతారా ఏంటని ముకుంద మనసులో అనుకుంటుంది. వామ్మో ఒకవేళ ముత్తైదువుల ఆశీర్వాదం ఫలించి వాళ్ళు కలిసిపోతారేమోనని భయంతో తాళికి పూసలు గుచ్చుతుంది. అది చూసి రేవతి టెన్షన్ పడుతుంది. గమనించిన భవానీ ఇంట్లో ఏదో జరుగుతుందని అనుమానపడుతుంది. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురుని తీసుకొస్తుంటే రేవతి డల్ గా ఉండటం గమనించి భవానీ ఏమైందని అడుగుతుంది.


భవానీ: మీరు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఏదో కోల్పోయినట్టు ఉన్నారు


రేవతి: అలాంటిది ఏమీ లేదక్క


భవానీ: లేదు ఏదో జరుగుతుంది. నువ్వు, మురారీ డల్ గా ఉన్నారు. ఇక కృష్ణ మొహంలో నవ్వు చూసి ఎన్నో రోజులు అయ్యింది. మీ అందరి ముందు నాలాగా కట్టుబొట్టు చేసి రెడీ అయి నవ్వించిన తింగరితనం ఏది? వాళ్ళ మధ్య మనస్పర్థలు పోవాలనే కదా ఈ మాంగల్యధారణ చేయిస్తుంది


రేవతి: అవునక్క వాళ్ళ మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దీనితో అవి పోవాలని అనుకుంటున్నా


Also Read: యష్ ని ఇంటరాగేట్ చేసిన దుర్గ - భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనలైన వేద


కృష్ణ తన జీవితంలో ఉన్నా లేకపోయినా తనే నాభార్య అని మురారీ అనుకుంటాడు. ఇదే పసుపు కుంకుమలుగా భావించి ఏసీపీ సర్ కట్టే తాళిని జీవితాంతం ఉంచుకుంటాను. ఆయనే నా భర్త అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఇద్దరూ పీటల మీద కూర్చుని పూజ చేస్తారు. ఈ పెళ్లితో కృష్ణలో మార్పు వచ్చి మురారీ ప్రేమని అర్థం చేసుకుంటే బాగుంటుందని నందు సంతోషపడుతుంది. మురారీ కృష్ణ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు. ఆ సీన్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ముకుంద మాత్రం లోలోపల కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. కృష్ణ తాళి పట్టుకుని చూసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఇక ఇద్దరు దంపతులు పూల దండలు మార్చుకుంటారు.