క్యాంప్ కి వెళ్ళిన కృష్ణ మురారీని పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. తోటి డాక్టర్స్ వచ్చి క్యాంప్ గురించి మాట్లాడుతుంటే కాసేపు తనని ఒంటరిగా వదిలేయమని అంటుంది. నన్ను వదిలి ఎలా వెళ్లాలని అనిపించింది ఏసీపీ సర్ మీకు అని ఫోటోస్ చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అటు కారులో మురారీ వెళ్తూ కృష్ణ వెళ్ళిపోయిన సంఘటన గుర్తు చేసుకుని బాధపడతాడు. దారిలో ఒక అమ్మాయి వెళ్తుంటే తను కృష్ణలాగా కనిపిస్తుంది. వెంటనే కారు ఆపేసి సంతోషంగా కిందకి దిగుతాడు. తర్వాత తను కాదని అర్థమయ్యి బాధపడతాడు. అటు కృష్ణ క్యాంప్ దగ్గర ఒకామే ఆగు మురారీ అంటూ ఉండటం విని ఏసీపీ సర్ మళ్ళీ వచ్చారని పరుగున బయటకి వస్తుంది. అక్కడ అంతా వెతుకుతుంది. కానీ ఎక్కడ కనిపించడు. మురారీకి ఎవరిని చూసినా కృష్ణ అనే అనుకుని అందరిని పలకరిస్తూ ఉంటాడు.


Also Read: షాకింగ్ ట్విస్ట్, కావ్యని ఇంట్లో నుంచి గెంటేసిన రాజ్- సునామీ సృష్టించిన రుద్రాణి


భవానీ కృష్ణని గుర్తు చేసుకుంటుంది. రేవతి మాత్రం విసుగ్గా ఉంటుంది. క్యాంప్ నుంచి తిరిగి వచ్చేది అయితే ఇలా అందరికీ గిఫ్ట్ ఎందుకు ఇస్తుందని అనుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే భవానీ వచ్చి కృష్ణ పెన్ డ్రైవ్ ఇచ్చింది కదా దాన్ని టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేయమని మధుకర్ కి చెప్తుంది. ఇంట్లో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు, వారి ఇష్టా ఇష్టాలు ఏంటని చెప్తూ వీడియోలో కృష్ణ మాట్లాడుతుంది. పేరు పేరునా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వారిని ఇమిటేట్ చేస్తుంది. ఇక ముకుంద గురించి మాట్లాడుతూ దిగులు పడకు నీ లైఫ్ నువ్వు కోరుకున్నట్టు సంతోషంగా ఉంటుందని చెప్తుంది. కృష్ణకి ముకుంద, మురారీ విషయం తెలిసిపోయిందా ఏంటని అలేఖ్య మధుకర్ తో మెల్లగా చెవిలో అంటుంది. అత్త రేవతి గురించి గొప్పగా చెప్తుంది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అమ్మ లేని లోటు తెలియలేదు. అందుకు కారణం మీరే. మీరు నాకు దేవుడు ఇచ్చిన అమ్మ అంటుంది.


నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు తప్ప ఎవరూ నాకు కోడలిగా రాలేరు. నన్ను దాటుకుని ఎంత దూరం వెళ్తావో నేను చూస్తానని రేవతి మనసులో అనుకుంటుంది. ఇక భవానీలాగా కళ్ళజోడు పెట్టుకుని కనిపిస్తుంది. మా అందరికీ గురువు దైవం అన్నీ మీరే. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్తుంది. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నానని అంటుంది. ఏంటి మిస్ యూ అంటుంది. ఈ చిన్న గ్యాప్ కూడ తీసుకోలేకపోతుందా? అసలు ఏంటి తింగరి పిల్ల ఉద్దేశం అని భవానీ ఆలోచిస్తుంది. చాలా ప్లానింగ్ గా అన్నయ్యని, మా ఫ్యామిలీని బాగా వాడేసుకుందని నందు మరింత కోపం పెంచుకుంటుంది. కృష్ణ ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రాదని ముకుంద అనుకుంటుంది. దేశ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వార్త భవానీ కుటుంబం చూస్తుంది. దాన్ని చూసి అందరూ కంగారు పడతారు. మురారీ రోడ్డు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. వెంటనే కృష్ణకి ఫోన్ చేస్తాడు. పేషెంట్స్ ను చెక్ చేస్తూ కృష్ణ ఫోన్ గమనించుకోదు.


Also Read: అభిమన్యు కుట్ర తెలుసుకున్న నీలాంబరి- రౌడీల బారి నుంచి మాళవికని కాపాడిన వేద


రేపటి ఎపిసోడ్లో..


కృష్ణ మురారీ ఆలోచనల్లోనే ఉంటుంది. ఇక భవానీ కోపంగా ముకుందని పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని సీరియస్ గా అడుగుతుంది. మొదట కంగారు పడిన ముకుంద చివరికి అవును ప్రేమించాను. ఒకరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పేసరికి రేవతి షాక్ అవుతుంది.