సీరియల్ నటి చైత్ర లతా రెడ్డి (TV Actress Chaitra Latha Reddy) జీవితంలో ఏం జరుగుతోంది? సంసార జీవితంలో సమస్యలు తలెత్తాయా? భర్త నుంచి దూరంగా వెళుతున్నారా? విడాకులు తీసుకుంటున్నారా? అంటే... 'అవును' అని తమిళ టీవీ వర్గాలు అంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

చైత్ర రెడ్డి, రాకేష్ మధ్య ఏం జరిగింది?విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారా?టీవీ సీరియల్స్ ఆర్టిస్ట్ చైత్ర రెడ్డి, ప్రొడ్యూసర్ - సినిమాటోగ్రాఫర్ రాకేష్ సమల (Rakesh Samala) తమ వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 

చైత్ర రెడ్డి, రాకేష్ సమల నిశ్చితార్థం అక్టోబర్ 23, 2020న జరిగింది. ఆ తర్వాత నవంబర్ 11, 2020న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. తమిళ టీవీ ఇండస్ట్రీలో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే... ఎందుకు విడిపోతున్నారు? ఈ జంట మధ్య సమస్యలు ఏమిటి? అనేది సస్పెన్స్. ప్రస్తుతానికి తమిళ నెట్టింట వీళ్ళ విడాకుల వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో దిగిన ఫోటోలు డిలీట్ చేయడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Continues below advertisement

Also ReadMaa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

చైత్ర రెడ్డిది బెంగళూరు. 'కళ్యాణం ముదల్ కాదల్ వరై' సీరియల్ ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అంతకు ముందు కన్నడలో 'అవును మాతే శ్రావణి' సీరియల్ చేశారు. తమిళంలో 'యారడి నీ మోహిని' సీరియల్ చేశారు.    

తెలుగు బుల్లితెర వీక్షకులకు చైత్ర రెడ్డి (Chitra Reddy) తెలిసే ఉంటారు. ఆరేళ్ళ క్రితం జెమిని టీవీలో ప్రసారమైన 'సుభద్ర పరిణయం' సీరియల్‌లో ఆవిడ టైటిల్ రోల్ చేశారు. బాలాదిత్య చెల్లెలి పాత్రలో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ యాడ్ చేశారు. తెలుగు కంటే కన్నడ, తమిళ్ సీరియళ్ళలో ఎక్కువ సక్సెస్ అయ్యారు.

Also ReadSave The Tigers 3 - అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!

చైత్ర రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'కాయల్' (తమిళ్‌ సీరియల్) అక్టోబర్ 2021 నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పుడు సీరియల్స్ కాకుండా చైత్ర రెడ్డి సంసార జీవితం వార్తల్లోకి వచ్చింది. చైత్ర రెడ్డి, రాకేష్ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు చైత్ర రెడ్డి గానీ, రాకేష్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also ReadDeewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?