Premi Viswanath: తెలుగు బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌లో వంటలక్క పాత్రతో ప్రతి ఇంటా సొంత కుటుంబ సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమి విశ్వనాథ్. కేరళకు చెందిన ఈమె తన అద్భుతమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ, అభిమానాన్ని సొంత చేసుకుంది. ప్రేమి విశ్వనాథ్ సీరియల్ కెరీర్, రియల్ లైఫ్ విషయాల గురించి తెలుసుకుందాం. 

Continues below advertisement

ప్రేమి విశ్వనాథ్ కేరళలోని ఎర్నాకులం (కొచ్చి) లో జన్మించింది. ఆమె విద్యాభ్యాసానికి వస్తే, న్యాయవాద కోర్సు పూర్తి చేసింది.  యాక్టింగ్ స్టార్ట్ చేయకముందు ఆమె కొచ్చిలోని ఒక ప్రైవేట్ సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. 

 సీరియల్ కెరీర్  

ప్రేమి విశ్వనాథ్ తన నటనను మోడలింగ్ ద్వారా ప్రారంభించింది. ఆపై మలయాళ బుల్లితెరకు పరిచయమయ్యింది. ఏషియానెట్ ఛానల్‌లో వచ్చిన 'కరతముత్తు' అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా ఆమె నటిగా పేరు తెచ్చుకుంది. ఇందులో నల్లటి రంగు ఉన్న అమ్మాయి ‘కార్తీక’గా ఆమె చేసిన నటనకు కేరళ ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు.  ఈ సీరియల్‌కు గానూ ఆమె బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డు కూడా దక్కించుకుంది.  ఆ తర్వాత 'మూనుమణి' అనే మరో మలయాళ సీరియల్‌లో నటించింది.

Continues below advertisement

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

'కరతముత్తు' సీరియల్ తెలుగులో 'కార్తీక దీపం' పేరుతో రీమేక్ చేసినప్పుడు ప్రేమి విశ్వనాథ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2017 అక్టోబర్ నుంచి దాదాపు 6 సంవత్సరాల పాటు సాగిన ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్‌పీ రికార్డులు సొంత చేసుకుంది. 'డాక్టర్ బాబు-వంటలక్క' జోడి తెలుగు పాప్ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. 

'కార్తీక దీపం' మొదటి భాగం ముగిసిన తర్వాత, ప్రేక్షకుల డిమాండ్ మేరకు 'కార్తీక దీపం 2 - ఇది నవ వసంతం' కూడా ప్రేమి విశ్వనాథ్ 'దీప'గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  

నటనతో పాటు, ఆమెకు బిజినెస్, ప్రొడక్షన్‌పై కూడా మంచి ఆసక్తి ఉంది. పరిశ్రమలో ఉండటం వల్లనే ప్రొడక్షన్ పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో తనకు అలాంటి ఆలోచన లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  తాను కేరళలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటానని తెలిపింది. తన భార్త తనకంటే ఎక్కువ బిజీగా ఉంటారని, ఎప్పుడో ఒకసారి కలుస్తామని చెప్పుకొచ్చింది. 

Also Read: తండ్రిని మరోసారి చంపేసిన పార్లలమ్మ, బెడిసికొట్టిన బాలు ప్లాన్, చింతామణి కొత్త స్కెచ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్

రెమ్యూనిరేషన్  

బుల్లితెరపై ప్రేమి విశ్వనాథ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఆమె పారితోషికం కూడా భారీగా అందుకుంటుంది.  'కార్తీక దీపం 1' సీజన్ సమయంలో ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.25,000 వరకు తీసుకునేవారని ఇండస్ట్రీ టాక్. ఇక ప్రస్తుతం నడుస్తున్న 'కార్తీక దీపం 2' సీక్వెల్ కోసం ఆమె తన క్రేజ్, డిమాండ్‌ను బట్టి రెమ్యూనిరేషన్‌ను భారీగా పెంచి, ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.50,000 వరకు తీసుకుంటున్నారని సమాచారం. బుల్లితెర ఫీమేల్ యాక్టర్స్‌లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల్లో ప్రేమి ఒకరుగా చెబుతారు.

ఫొటోగ్రఫీ అంటే.. 

ప్రేమి విశ్వనాథ్‌కు నటనతో పాటు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆమె సోదరుడు శివప్రసాద్ కేరళలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడంతో, ఆమె కూడా ఆ ఇష్టంతో కొన్ని పెళ్లిళ్లకు స్వయంగా ఫొటోగ్రఫీ కూడా చేశారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న 'V Media The Complete Studio' అనే రెండు ఫిల్మ్ స్టూడియోలకు ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.  సీరియల్స్‌తో పాటు 'సాల్మన్ 3D' వంటి కొన్ని సినిమాలో కూడా ప్రేమి నటించింది.

Also Read: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం

సోషల్ మీడియాలో యాక్టివ్ 

ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో (premi_vishwanath) షూటింగ్ లొకేషన్ విశేషాలు, రీల్స్, తన వ్యక్తిగత లైఫ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. సీరియల్‌లో చాలా డల్‌గా, డీగ్లామర్‌గా కనిపించే వంటలక్క.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మోడ్రన్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. 

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1'నిండు మనసులు' సీరియల్ సిద్ధు గురించి ఈ విషయాలు తెలుసా?
2'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
3కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!
4పెద్దికి 'పొదరిల్లు' సీరియల్‌లో పెళ్లికాలేదు కానీ రియల్ వైఫ్ ఫొటోస్ చూశారా!
5'పొదరిల్లు' సీరియల్ సూర్యప్రతాప్ ( ఆనంద్) ఏ ఏ సినిమాల్లో నటించారు, రోజుకి ఆయన రెమ్యునరేష్ ఎంతో తెలుసా?