కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరో జనరేషన్ చుట్టూ తిరుగుతోంది. డాక్టర్ బాబు-వంటలక్కను కారు ప్రమాదంలో చంపేశారు. కార్తీక్ మరణించడంతో మోనిత తన బిడ్డను, ఆస్తిని వేరేవాళ్లకి అప్పగించి తెల్లచీర కట్టుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి  సౌందర్య-ఆనందరావు మినహా మిగిలినవారంతా కొత్తవారే. హిమగా కీర్తి కేశవ్ భట్, శౌర్యగా అమూల్ గౌడ, నిరుపమ్ గా మానస్, ప్రేమ్ గా మనోజ్ కుమార్ నటిస్తున్నారు. ప్రస్తుతం సీరియల్ మొత్తం ట్విన్స్ ప్రేమ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికీ సీరియల్ కి మంచి ఆదరణ దక్కుతున్నప్పటికీ వంటలక్క-డాక్టర్ బాబు-మోనిత ఉన్నప్పుడంత ఊపు లేదంటున్నారు సీరియల్ అభిమానులు. దీంతో త్వరలో ఈ దిశగా మార్పులు చేయవచ్చనే టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది మోనితగా నటించిన శోభాశెట్టి..



కార్తీక్ దీప కారు ప్రమాదంలో చనిపోయినట్టు చూపించారు కానీ...రీసెంట్ ఎపిసోడ్ లో అమ్మవారి హుండీలో శౌర్య చీటీ వేస్తుంది. అమ్మా నాన్న తిరిగి రావాలని అందులో రాసి ఉంటుంది. అంటే కార్తీక్-దీప రావొచ్చని  హింట్ ఇచ్చారా అనే డిస్కషన్ జరుగుతోంది.ఇదే టైమ్ లో నేను కూడా వస్తున్నానంటూ హింట్ ఇచ్చింది మోనిత. తన యూ ట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసిన వీడియోలో శోభాశెట్టి ఈ క్లారిటీ ఇచ్చింది.   



‘కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ’ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసిన మోనిత...‘రెగ్యులర్‌గా నా ఫ్యాన్స్ అంతా నాకు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మళ్లీ కార్తీకదీపంలోకి ఎప్పుడు వస్తారు అడుగుతూనే ఉన్నారు. నాకు కూడా మళ్లీ కార్తీకదీపం సీరియల్‌లోకి రావడానికి చాలా ఆశగా ఉంది.. రావాలా? వద్దా? అన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నాం. త్వరలోనే దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అయితే  ముందుగా.. ‘కార్తీకదీపం’ పాత ఆర్టిస్ట్‌లకు గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఈవెంట్‌కి ప్లాన్ చేశారు.. సీరియల్ అయిపోయిన తరువాత కలిసే అవకాశం రాలేదు. ఈ ఈవెంట్‌తో మళ్లీ అందరం కలవబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. 


Also Read: వసుధార కన్నీళ్లు చూసి అల్లాడిపోయిన రిషి, రెచ్చిపోయిన సాక్షికి ఇచ్చి పడేసిన గౌతమ్


సీరియల్ లో..కృత్రిమ గర్భధారణ ద్వారా డాక్టర్ బాబుతో ఒక కొడుకుని కన్న మోనిత..ఆనంద్ అని పేరు పెట్టింది. ప్రస్తుతం సీరియల్ లో రవ్వ ఇడ్లీ అని హిమ-శౌర్య పిలుస్తున్నది ఈ ఆనంద్ నే. పేదరికంలో మగ్గుతున్న కొడుకు కోసం మళ్లీ మోనిత రీఎంట్రీ ఇచ్చినా ఇవ్వొచ్చేమో.. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ...