చెత్త పుస్తకాలు షాపు వద్ద డిస్కషన్ తర్వాత సౌందర్యను ఫాలో అవుదామని అనుకుంటుంది జ్వాల.  కానీ... అది వీలుపడదు. ఇంతలో అక్కడే పడి ఉన్న ఫొటోలో ఉన్నది జ్వాల అని తెలుసుకుంటాడు షాపు యజమాని. ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉండిపోతాడు. ఇంతలో జ్వాలా వెళ్లిపోతుంది. 


నిరుపమ్‌ ఒంటరిగా కూర్చొని తన తల్లి, తండ్రిని కలపడం గురించి ఆలోచిస్తుంటాడు. తన తల్లిలోని ప్రేమ ఎవరూ గమనించరని కోపాన్ని మాత్రమే చూస్తారని అనుకుంటాడు. వీళ్లను కలపడానికి ఈ మ్యారేజ్‌ డేకు మించిన ఛాన్స్ ఇంకొకటి రాదనుకుంటాడు. ఇంతలో జ్వాల ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. రెగ్యులర్‌గా ఉన్న రెస్టారెంట్‌లోనే అని చెప్తాడు. వాళ్లిద్దరూ మాట్లాడుతుండగానే... తన తల్లి స్వప్వ వస్తుంది. ఫోన్ పెట్టేసి తల్లితో మాట్లాడుతాడు నిరుపమ్. 


ఎదురుగా ఉన్న కేక్‌ను చూసి షాక్, కోపం, అసహనంతో  ఉండిపోతుంది. విషెస్‌ చెప్పినా పట్టించుకోదు. కేక్‌ కట్‌చేయాలా అని అడుగుతుంది. లేదు అందరూ వచ్చాక చేద్దువుగానిలే అంటాడు నిరుపమ్. కానీ దానికి కోపంతో ఊగిపోతుంది. అందరంలో మీ డాడి, మీ అమ్మమ్మ లేకపోతే ఇష్టమని క్లారిటీ ఇస్తుంది. కూల్‌ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ... అవేం పట్టించుకోదు స్వప్న. నువ్విక్కడ,డాడీ అక్కడ ఇంకా ఎన్నాళ్లు ఇలా అని ప్రశ్నిస్తాడు నిరుపమ్. నేను చచ్చే వరకు అని సమాధానం చెబుతుంది. ఆమె ఏం చెప్పినా స్వప్న ఒప్పుకోదు. వెళ్లిపోతున్నాను అని చెప్పేలోపు భర్త సత్యం వస్తారు. పక్కనే జ్వాల ఉంటుంది. ఇద్దర్నీ చూసిన స్వప్నకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. 


నువ్వేంటి ఇక్కడ అని జ్వాలను అడుగుతుంది స్వప్న. ఇదేమీ ఈ హోటలా అని అడుగుతుంది జ్వాల. మీరు మీరు మాట్లాడుకోండి.. నేను వెళ్తున్నానని చెప్పేస్తుంది స్వప్న. ఉండమంటాడు నిరుపమ్. పెళ్లిరోజు కూడా గొడవపడాలా అని అడుగుతాడు నిరుపమ్. అప్పుడే పెళ్లి రోజను తెలుసుకున్నట్టు నటించిన జ్వాల.. సత్యానికి శుభాకాంక్షలు చెబుతుంది. స్వప్న కోపంగా చూస్తుంది. దీనికి జ్వాల ఓ స్టోరీ చెబుతుంది. అన్నీ ఉన్నా ఏమీ లేని పేదవాళ్లలా ఉన్నారంటూ స్వప్నపై సెటైర్లు వేస్తుంది. డబ్బులున్నా మనసు ఉండదని... పెద్ద పెద్ద ఇల్లు ఉన్నా.. కలిసి ఉండరని ఎద్దేవా చేస్తుంది. ఒకే పెళ్లి రోజు రెండు కేక్‌లు కట్‌ చేసుకోవడమేంటని జ్వాల ప్రశ్నిస్తుంది. దానికి ఆగ్రహంతో ఊగిపోయిన స్వప్న నీవెంత నీ బతుకు ఎంత అని నిలదీస్తుంది. సత్యంతో కలిసి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకుంటే ఎక్కడ కలిసిపోతానోనని భయపడుతున్నావని స్వప్నను రెచ్చగొడుతుంది జ్వాల. లోపల భయపడుతూ అందర్నీ తిడుతున్నావని మరింతగా రెచ్చగొడుతుంది. జ్వాల మాటలకు మరింతగా  రెచ్చిపోతుంది. బస్తీలో మ్యారేజ్‌డే చేస్తానని చెప్పేస్తుంది జ్వాల. దానికి స్వప్న రియాక్ట్ అయి... మా మ్యారేజ్‌డే ఫంక్షన్ నా కొడుకు చేస్తానని చెబుతుంది. ఇద్దరికీ కలిపి చేస్తాడంటుంది. స్వప్న చాలా సీరియస్‌గా చెప్పినా మిగతా ముగ్గురు లోలోపల నవ్వుకుంటారు. జ్వాలను మాత్రం పిలవద్దని... వీడియో పంపించమని స్వప్న చెప్పేస్తుంది. మనసులో జ్వాలకు థాంక్స్ చెబుతాడు నిరుపమ్. స్వప్న వెళ్లిపోయిన తర్వాత జ్వాలకు థాంక్స్  చెబుతూ... రావాలని పిలుస్తాడు... అక్కడే మనసులో మాట చెబుతానంటాడు. నిరుపమ్ వెళ్లిపోయిన తర్వాత డ్రీమ్‌లోకి వెళ్లిపోతుంది జ్వాల. 


హాస్పిటల్‌ లో కూర్చొని స్వప్న గురించి ఆలోచిస్తుంది హిమ. స్వప్న అసలు మ్యారేజ్‌డేకు ఒప్పుకుంటుందా అని అనుకుంటుంది. తను నష్టజాతకురాలినే అని అనుకుంటుంది. సౌర్యను ఇంటికి తీసుకురావచ్చేమో గానీ... స్వప్న మనసు మారుతుందా అని అనుకుంటుంది. ఇంతలో నిరుపమ్‌ వస్తాడు. స్వప్న మనసు మార్చడం ఎవరి వల్ల కాదని అంటుంది హిమ. ఆ మాటలకు నవ్వుతూ... మ్యారేజ్‌డేకు స్వప్న ఒప్పుకున్న సంగతి చెప్తాడు నిరుపమ్. ఎలా ఒప్పుకుందని అడుగుతుంది హిమ. జరిగిన విషయాన్ని హిమకు వివరిస్తాడు నిరుపమ్. ఇదంతా జ్వాల ద్వారా జరిగిందని చెప్తాడు. ఆమెను కూడా ఫంక్షన్‌కు పిలిచానని చెప్తాడు నిరుపమ్. దానికి షాక్ అవుతుంది హిమ. నిరుపమ్‌ వెళ్లిపోతాడు. 


సౌర్య పంక్షన్‌కు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుమాన పడుతుంది హిమ. మళ్లీ తనను అసహ్యించుకుంటుందని... మళ్లీ సమస్యలు మొదలవుతాయని లోలోపల మధన పడుతుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.