హిమపై సౌందర్య కోపంతో ఊగిపోతుంది. పెళ్లి నాటకం అడైనా ఆమె మనసులో మాట తెలుసుకోవాలనుకుంటుంది.
సౌందర్య- ఇప్పటికే పెళ్లి వరకు వచ్చింది క్యాన్సిల్ చేసుకున్నామని అందరికి తెలిసిపోయింది. అందరి నోళ్లూ మూయించాలంటే నీకు పెళ్లి చేయడం ఒక్కటే మార్గం.
ఆనందరావు- అవునమ్మ.. నీ మనసులో ఉన్నది అర్థం కాదు. కనీసం చెప్పవు కూడా. ఇప్పుడు మేం చూసే పెళ్లి సంబంధమైనా నీకు ఇష్టమా లేదా
( నిశ్చితార్థం అనుకున్నప్పుడు నిరుపమ్ ఐలవ్‌యూ చెప్పడం... తన కూడా ప్రేమిస్తున్నట్టు చెప్పిన సీన్ హిమకు గుర్తుకు వస్తుంది. సౌందర్య, ఆనందరావు చెప్పేదానికి సైలెంట్‌గా ఉండిపోతుంది. )
సౌందర్య- మళ్లీ ఎందుకు అడుగుతారండీ... అడిగి మీ పెద్దరికాన్ని తగ్గించుకుంటారెందుకూ? చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరిగింది. బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నాకు అదే మాట చెప్పింది. చివరకి మాట తప్పింది. ఇప్పుడు సంబంధం చూసి పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏం చెబుతుందండీ... చేసుకుంటాను అని చెబుతుందా? మనల్ని సాధించడానికే సిద్ధంగా ఉంది.
హిమ- మనసులో(నాన్నమ్మ మిమ్మల్ని బాధ పెడుతున్నాను. కానీ.. అంత కన్నా ఎక్కువ బాధను నేను అనుభవిస్తున్నాను.)
ఆనందరావు- ఏమ్మా... ఈ పెళ్లికైనా ఒప్పుకుంటున్నావా లేదా?
సౌందర్య- చెప్తున్నాను కదండీ మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారు? అది పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టడానికే ఉంది.
హిమ- నేను ఈ పెళ్లి చేసుకుంటాను నాన్నమ్మ.
సౌందర్య- ఏమన్నావ్.. మళ్లీ చెప్పు
హిమ- నేను ఈ పెళ్లి చేసుకుంటాను నాన్నమ్మ(బావకు నాపై మనసు విరగాలంటే ఏదో పెళ్లికి ఒప్పుకోక తప్పదు)
సౌందర్య-ఏంటే నువ్వు. మా అంచనాలన్నీ తలకిందులు చేస్తావు. నిరుపమ్‌కు ఎవరో శోభతో పెళ్లి చేస్తానంటూ స్వప్న అంటోంది. ఆ విషయం తెలుసు నీకు అయినా నీ మనసు మారడం లేదా? అసలు ఎందుకు నీవు నిరుపమ్ కాదంటున్నావో చెప్పవా?
హిమ- స్వప్న అత్త చేసే ప్రయత్నాలను మనం కాదనలేం. శోభను పెళ్లి చేసుకోమంటే నిరుపమ్ బావా పెళ్లి చేసుకోవాలి కదా... నచ్చాలిక దా..
సౌందర్య- నువ్వెళ్లి చెప్పవే. బావా నేను రిజెక్ట్ చేశాను. నువ్వు అమాయకుడివి.. నాకు ఉన్న తెలివితేటలు నీకు లేవు. నేను కాదన్నందుకు బ్రహ్మచారిగా ఉండిపోతావా.. శోభను పెళ్లి చేసుకోమని నువ్వెళ్లి చెప్పు. నీకు అక్కర్లేనప్పుడు వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు. కనీసం నువ్వైనా వాడిని పెళ్లి చేసుకోమని ఒప్పించు. అని చెప్పి అక్కడి నుంచి సౌందర్య వెళ్లిపోతుంది.
ఆనందరావు- నువ్వు డాక్టర్‌వి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అని చెప్పి ఆయన కూడా వెళ్లిపోతాడు.
హిమ-(మనసులో..) తాతాయ్య- నాన్నమ్మా మీకు నిజం చెప్పలేను.. అలాగనే అబద్దం కూడా చెప్పలేను. అందుకని మాట్లాడకుండా ఉండాల్సి వస్తోంది. ఈ విషయంలో మీరు నన్ను క్షమించండి.
స్వప్నను జ్వాల పిన్నీ బాబాయ్ టార్గెట్ చేసుకుంటారు. మొదటిసారి ఆమె కారును పంక్చర్ చేశారు. ఇప్పుడు డోర్ లాక్ చేస్తారు. సౌందర్య వాకింగ్ నుంచి వచ్చి కారు ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ కాదు. ఇంతలో అటుగా వచ్చిన జ్వాల పిన్నీ బాబాయ్‌ను చూసి అనుమాన పడుతుంది. ఇదంతా పై వాడి లీల అంటూ కవర్ చేస్తారు. కారు డోర్ ఓపెన్ చేస్తే అడిగినంత ఇస్తానంటుంది. రిపేర్ చేయించుకుంటుంది.
సత్యం ఇంటికి నిరుపమ్ వస్తాడు. ప్రేమ్ గురించి అడుగుతాడు.
సత్యం- ఎలా ఉన్నావ్, నిన్ను ఏం అడగాలో.. నీతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.
నిరుపమ్- అర్థం కానివి లైఫ్‌లో చాలా ఉంటాయి డాడ్
సత్యం- భోజనం చేశావా
నిరుపమ్- ఫర్వాలేదు డాడ్
సత్యం జ్వాలకు ఫోన్ చేసి నిరుపమ్‌తో కలిపి అందరికీ భోజనాలు తీసుకురమ్మని చెప్తాడు.
సత్యం- కొన్ని సమస్యలు మౌనంగా ఉంటేనే పరిష్కారం అవుతాయి. కొన్ని అడిగితేనో అడుగు ముందుకేస్తేనో అవుతాయి. పోనీ నువ్వు ఓ పని చేయవచ్చు కదా. జ్వాలతోనైనా అడిగించరా.. నిరుపమ్- అనుకున్నాను డాడీ.
సత్యం- అనుకోవడం వేరు. అడిగించడం వేరు.
క్యారేజ్ తీసుకొస్తున్న జ్వాల నిరుపమ్ కోసం ఆలోచిస్తుంది. మనకు ఇష్టమైన వాళ్లు తింటున్నారంటే ఆనందే వేరుగా ఉంటుందని అనుకుంటుంది. వాళ్లు తింటే మన కడుపు నిండిపోతుంది. దీన్నే ప్రే అంటారేమో.
రోడ్డుపై సౌందర్య దేనికోసమే ఆలోచిస్తూ జ్వాల ఆటోకు అడ్డంగా కారు ఆపి ఉంటుంది.
సౌందర్య- ఏంటే నీ సంగతి నీ నాటకలన్నీ తెలిసిపోయాయే.
ఏంటీ నాన్నమ్మకు నేనే సౌర్య అని తెలిసిపోయిందా అని మనసులో జ్వాలా అనుకుంటుంది.
ఎక్కడకి వెళ్లావే... నీ కోసం ఎక్కడని వెతకను. అవసరం లేనప్పుడు కనిపిస్తావు. ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తావు. మరి ఈ రోజు ఏమైందే.. ఎంత వెతికినా కనిపించలేదు.
హమ్మయ్య.... అసలు విషయం తెలియలేదన్నమాట.
జ్వాల- అంతేనా..
సౌందర్య- అంతే అంటే నేనేమ్మన్నాను..
జ్వాల- బెదిరిస్తున్నావ్
సౌందర్య- ఎందుకు బెదిరించకూడదే. నిన్ను బెదిరించే హక్కు నాకు ఉంది.
జ్వాల- అవును నాన్నమ్మ నన్ను బెదిరించే హక్కు నీకే ఉంది(అని మనసులో అనుకుంటుంది)
సౌదంర్య- నాకేంటో అప్పుడప్పుడూ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని పిస్తోంది.
జ్వాల- సీసీ నువ్వు కూడా నా ప్రేమలో పడ్డావా.
సౌందర్య- ప్రేమలో పడ్డం కాదే.. ఏంటో.. తెలియకుండానే మనిషికి మనిషికి అనుబంధం ఒకటి ఉంటుంది కదా...
జ్వాలా- మనది తెలియని బంధం కాదు నాన్నమ్మ మనది రక్త సంబంధం(అని మనుసులో అంటుంది)
సౌందర్య- ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావ్..
జ్వాల- లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాను.
సౌందర్య- ఎవరికీ
జ్వాల - నా మొగుడికి.
సౌందర్య- నిన్ను చేసుకున్నవాడెవడో గానీ అమాయకుడై ఉంటాడు.
జ్వాల- అమాయకుడే కాదు.. అందగాడు కూడా.
సౌందర్య- నీ దూకుడికి వాడు అయిపోతాడే.
జ్వాల- ఏం అయిపోడు... మహా రాజులా చూసుకుంటాను.
సౌందర్య- వంటలక్కలా వంటలు తీసుకెళ్లడమేంటే.....నువ్వు ఆటోనడుపుతావు కదా. (తల్లి వంటలు చేసిన సంగతి గుర్తుకు తెచ్చుకొని డల్ అవుతుంది జ్వాల)
సౌందర్య- ఏమైందే?
జ్వాల- ఏం కాలేదు. నాకు పని ఉంది
సౌందర్య- అదేంటే నేను నీ కోసం వస్తే వెళతాను అంటున్నావు. మీ ఇంటికి తీసుకెళ్లవా...
జ్వాల- నేను మీ ఇంటికి రావడమే కాని.. నేను మా ఇంటికి తీసుకెళ్లడం లేదు. (మనసులో)
సౌందర్య- నీతో నేను చాలా మాట్లాడాలే...
జ్వాల- అదేదే ఇక్కడే మాట్లాడు.
తన చిన్నప్పటి ఫోటో చూపించి ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే చెప్పవే అంటూ రిక్వస్ట్ చేస్తుంది సౌందర్య. దాన్ని చూసిన జ్వాల అచ్చం నాలానే ఉందని మురిసిపోతుంది.
సౌందర్య- ఊరుకోవే..
జ్వాల- ఎవరు
సౌందర్య- నా మనవరాలా
అది చిన్నప్పటి ఫొటో.
జ్వాల- అంటే ఇప్పుడు ఇంచు మించు నా ఏజ్ ఉంటుంది.
సౌందర్య- ఎక్కడైనా కనిపిస్తే చెప్పవే.
జ్వాల- ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు సడెన్‌గా ఎందుకు వెతుకుతున్నారు.
సౌందర్య౦- ప్రేమ లేదని నువ్వెలా చెప్తావే. రోజూ బాధపడతాం.
జ్వాల- రోజూ బాధపడితే మనం పరిచయమైనప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు.
సౌందర్య- ఎదుటివారి మనసులోని బాధను నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు.
జ్వాల- హలో సీసీ, బాధ గురించి నాకు చెప్పకు. ఇక్కడ టన్నులు కొద్ది బాధ ఉంది నీలా నేను బోర్డు పెట్టుకొని తిరగను.
సౌందర్య- మళ్లీ ఎక్కడ కలుద్దాం.
జ్వాల- సాయంత్రం కలుద్దాంలే.. మా ఇంటికి తీసుకెళ్తాను.
సౌందర్య- నిజమా-
జ్వాల- నిజమే, బాయ్
అని జ్వాల అక్కడి నుంచి సత్యం ఇంటికి వెళ్లిపోతుంది.
నిరుపమ్, ప్రేమ్‌ను చూసి సత్యం బాధపడతారు. ఇద్దర్ని ఇలా చూస్తుంటే ఆనందంగా ఉన్నా మరోవైపు బాధగా కూడా ఉందని అంటాడు.
సత్యం- నిరుపమ్ నీ బాధకు అర్థం ఉంది. కానీ వీడు ఈ మధ్య అదో రకంగా ఉంటున్నాడు.
నిరుపమ్- ఏరా నిజమేనా, నీకేం ప్రాబ్లమ్‌రా
ప్రేమ్- నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయిరా,
నిరుపమ్- మరి డాడీ అంటున్నారు కదా
ప్రేమ్- ఆయన పెద్ద మనిషిలా ఏదో ఒకటి అంటూ ఉంటారులే. నువ్వేం పట్టించుకోకు.
ఇంతలో జ్వాల వచ్చి అందర్నీ పలకరిస్తుంది.
జ్వాల- ఏంటి ఎక్‌ట్రా పలకరిస్తే ఏదో ఒకటి అనాలి కదా...
ప్రేమ్- ఇదిగో తిక్క...నువ్వు నాతో మాట్లాడకు.
జ్వాల- నేను ఏమన్నానని.. అనవసరంగా ఎందుకీ తగాదా
ప్రేమ్- వివరాలు అనవసరం. నన్ను పలకరించకు.
నిరుపమ్-అరేయ్... ఏమైందిరా నీకు. తనపై నీకెందుకు కోపం. అసలు ఎందుకు అరుస్తావ్
ప్రేమ్- నీకు ఏం తెలియదురా..
ప్రేమ్- ఇదిగో జ్వాలా నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఎక్‌ట్రా అని అది అని ఇది అని నన్ను పిలవకు. నీకు నాకు ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేదు. వచ్చావా... భోజనం తెచ్చావా... డబ్బులు తీసుకున్నావా వెళ్లిపోయావా అంతే..
జ్వాల- ఏడుస్తూ.. కేవలం డబ్బు కోసమే భోజనం తెస్తున్నావా..
ప్రేమ్- అంతేగా లేకపోతే నువ్వేమైనా నా మేనమామ కూతురివా.. నా మేనత్త కూతురివా?
సత్యం- అరేయ్ ప్రేమ్ నోటికి ఎంత వస్తే అంత అంటవా
ప్రేమ్- డాడ్ మీకు ఏం తెలియదు మీరు ఊరుకోండి.
నిరుపమ్- అసలు ఏమైందిరా. అంత కోపం ఎందుకు తనపైనా..
(తన మూలంగానే హిమకు నా ప్రేమ సంగతి చెప్పలేకపోయాను. ఎప్పుడూ అడ్డు వచ్చేది. లేకుంటే ఎప్పుడే నా ప్రేమ గురించి చెప్పేవాడిని అని మనసులో అనుకుంటుంది.)
జ్వాల- సత్యం సార్ బాక్స్ రేపు తీసుకుంటాను.
సత్యం- అమ్మా జ్వాల వాడేదో చిరాకులో అలా అన్నట్టు ఉన్నాడమ్మా.
నిరుపమ్- అవును జ్వాల. వాడి మాటలేం పట్టించుకోకు.
జ్వాల- ఫర్వాలేదు సాబ్. నేను వెళ్తాను.
నిరుపమ్- వాడి తరఫున నేను సారీ చెబుతున్నాను.
జ్వాల- ఎంత మాట డాక్టర్ సాబ్, మీరు నాకు సారీ చెప్పడమేంటి
నిరుపమ్- వాడిపై కోపం లేదు కదా..
జ్వాల- మీరు చెప్పారు కదా ఏం లేదులెండీ.
నిరుపమ్- వెరీ గుడ్ రౌడీ బేబీ
ఆ మాటతో నవ్వుతూ జ్వాల వెళ్లిపోతోంది.
నిరుపమ్- డాడీ.. మమ్మీ నాకు ఏదో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది. వద్దని మీరన్నా గట్టిగా చెబుతారా
సత్యం- నేను చెబితే తను వింటుందారా
నిరుపమ్- తన ఒక్కదానికేనా మీకూ బాధ్యత ఉంటుందిగా. మీరు గట్టిగా మాట్లాడాలి డాడ్.
సత్యం- సరేరా ప్రయత్నం చేస్తాను.
నిరుపమ్- డాడీ.. మమ్మీ అంటే నాకు గౌరవం ఉంది. కానీ నా పెళ్లి మాత్రం నాకు నచ్చిన వాళ్లతోనే జరుగుతుంది. లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. అని చెప్పి వెళ్లిపోతాడు.
సీన్ హాస్పిటల్‌కు మారుతుంది. తన సీట్‌లో కూర్చొని హిమ కోసమే ఆలోచిస్తుంటాడు నిరుపమ్.
రేపటి ఎపిసోడ్
హిమ వేరేవాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని తెలుసుకున్న నిరుపమ్ ఆగ్రహంతో హిమను నిలదీస్తాడు. హిమ నీతో పెళ్లి అంటూ జరిగితే నాతోనే జరగాలని అంటాడు నిరుపమ్. వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న సీన్‌ను జ్వాల చూస్తుంది. షాక్ అవుతుంది.