హిమ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌ కోలుకోలేకపోతున్నారు. తనను ప్రేమించదనే హిమ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుందని ఊహించుకుంటాడు ప్రేమ్. సత్యం కూడా అదే ధ్యాసలో ఉంటాడు. ఏంట్రా ప్రేమ్.. హిమ ఇంత పని చేసిందని బాధపడుతుంటాడు. ఎక్కువ ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోవద్దని సూచిస్తాడు. ఇంతలో ఫుడ్‌ పట్టుకొని జ్వాల వస్తుంది. ఎంగేజ్‌మెంట్‌ గురించి జ్వాలతో మాట్లాడొద్దని సత్యానికి ప్రేమ్ హితబోధ చేస్తాడు. 


గుడిలో క్యాన్సిల్ అయిన ఎంగేజ్‌మెంట్‌ సంగతి ప్రేమ్, సత్యానికి జ్వాల చెబుతుంది. తను ఎవర్ని ప్రేమించిందో అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్న హిమను తిట్టి పోస్తుంది సౌందర్య. నిరుపమ్, నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పమని నిలదీస్తుంది. అన్నింటికి సంతోషించి లాస్ట్‌ మినిట్‌లో పరువు తీశావని గట్టిగా అడుగుతుంది. స్వప్న ఏమైనా బెదిరించిందా అని క్వశ్చన్ చేస్తుంది సౌందర్య. తనను ఏమీ అడగొద్దని రిప్లై ఇస్తే గట్టిగా లాగి పెట్టి హిమ చెంప మీద కొడుతుంది సౌందర్య. మాట్లాడమని అడుగుతుంది. అయినా హిమ ఏమీ మాట్లాడొదు. ఇష్టం లేదనే మాత్రమే చెబుతుంది. నన్ను వదిలేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


అక్కడ నిరుపమ్ ఫుల్‌గా తాగి రోడ్డుపై అడ్డంగా ఉంటాడు. అటుగా వచ్చిన జ్వాల అతన్ని చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. నిరుపమ్‌ను లేపి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది జ్వాల. ఎందుకిలా తాగారని అడుగుతుంది జ్వాల. ఏమైనా పార్టీ చేసుకున్నారా అని అడుగుతుంది జ్వాల. నేను నీకు ఇష్టమే కదా అని అడుగుతాడు నిరుపమ్. ఐలవ్‌యూ చెప్పేస్తాడు. వింటున్నావా అంటూ మరోసారి ప్రేమ సంగతి చెప్తాడు. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా... నువ్వెప్పుడైనా చెప్పావా చెప్పలేదు.. చెప్పవని అంటాడు నిరుపమ్‌.  నా గుండెల్లోని ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకోవని అంటాడు. అతన్ని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంది జ్వాల. 


నిరుపమ్‌ను జ్వాల తీసుకొస్తున్న విషయాన్ని స్వప్న చూసి షాక్ అవుతుంది. జ్వాలను అక్కడే ఆగమంటుంది. ఇంతలో నిరుపమ్ ఏదో చెప్పబోతుంటే ఆగమని చెప్తుంది స్వప్న. నిరుపమ్‌ను స్వప్న తీసుకెళ్లిపోతుంది. జ్వాలను దూరం చేయాలని అనుకుంటుంది స్వప్న. 


నిరుపమ్ తనకే ఐలవ్‌యూ చెప్పాడని ఫీల్ అవుతుంది జ్వాల. చాలా సంతోషంగా ఉంటుంది. 


బ్యాగ్ సర్దుకొని హిమ ఇంటి నుంచి బయల్దేరుతుంది. సౌర్యకు అడ్డుగా ఉండబోనంటూ వెళ్లిపోతుంది. ఇంతలో సౌందర్య దారికి అడ్డంగా నిల్చొని ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని హిమను అడుగుతుంది. హాస్టల్‌లో ఉంటానని చెబుతుంది హిమ. పండగలకైనా వస్తావా లేదా అని ప్రశ్నిస్తుంది. నీకు నచ్చినట్టే చేస్తావు కదా.. అని దెప్పిపొడుస్తుంది సౌందర్య. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోతుంది హిమ. 


రేపటి ఎపిసోడ్:
హిమ మంచిది కాదని... నష్టజాతకురాలని.. నిరుపమ్‌ మైండ్‌ వాష్‌ చేస్తుంది స్వప్న. ఒంటరిగా ఉన్న నిరుపమ్‌ను కలుస్తుంది జ్వాల.