కార్తీకదీపం (Karthika Deepam ) మార్చి 31 గురువారం ఎపిసోడ్


గడిచిన ఎపిసోడ్ లో నిరుపమ్ ను కలసిన జ్వాలతో...‘మీ తింగరి(హిమ)ని నాతో ఉంచుకుని.. నాలుగు రోజుల్లో తన భయం, పిరికి తనం అన్నీ పోగొట్టేస్తాను’ అంటూ హిమని తీసుకుని వెళ్లిపోతుంది.  హిమతో ఆటో నడిపించి హడావుడి చేసిన జ్వాల..ఆతర్వాత ఓటిఫిన్ సెంటర్ దగ్గరకు తీసుకెళుతుంది. ఒరేయ్ 'రవ్వ ఇడ్లీ అని అరుస్తుంది. అదేం పేరు అంటుంది హిమ ఆశ్చర్యంగా. ‘అదంతే.. వాడి పేరు అదే..’ అంటూ రవ్వ ఇడ్లీ దగ్గరకు రాగానే.. ‘రేయ్ రవ్వ ఇడ్లీ.. ఈమె మన కొత్త దోస్త్.. వెళ్లి రెండు టీ తీసుకునిరా’ అంటూ వాడి చేతిలో ఉన్న నీళ్లు మగ్గు జ్వాల తీసుకుంటుంది. ‘పద తింగరి.. ముఖం కడుక్కో.. ఏడ్చి ఏడ్చి ముఖం చూడు ఎలా అయిపోయిందో?’ అంటూ హిమని పక్కకు తీసుకుని వెళ్లి.. తనే ముఖం తడి చేత్తో తుడుస్తుంది. హిమ చేతులు కడిగిస్తుంది. హిమ చాలా ప్రేమగా జ్వాల వైపు చూస్తూ ఉంటుంది. 


మరోవైపు శౌర్య చిన్నప్పటి ఫొటో తీసుకుని ఓగుడిలో అందరికీ చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది. (గతంలో జ్వాల(శౌర్య) దీప, కార్తీక్‌ల పేర్ల మీద అన్నదానం చేసిన గుడి అది.) అదే ఆలోచనతో గుడి లోపలికి వెళ్లిన సౌందర్య.. చాలా మందిని సౌర్య చిన్నప్పటి ఫొటో చూపించి.. ‘తనకి ఇప్పుడు 20 ఏళ్లు ఉండొచ్చు.. ఇది తన చిన్నప్పటి ఫొటో.. తను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూ వెళ్తుంది.. తనని మీరు చూశారా?’ అంటూ అడుగుతూ ఉంటుంది. ‘తెలియదు’ అని కొందరు.. ‘చిన్నప్పటి ఫొటో చూపిస్తే ఎలా గుర్తుపడతాం’ అని మరికొందరు అనడంతో సౌందర్య డీలా పడిపోతుంది.   ‘ఎలా కనిపెట్టాలి? శౌర్య ఇక్కడే ఉందని సంతోషిచాలా? ఎలా ఉంటుందో తెలియనందుకు బాధపడాలా?  ఈ నాన్నమ్మని ఎప్పుడు కలుస్తావే.. అసలు ఎక్కడున్నావే?’ అంటూ కుమిలిపోతుంది. 


Also Read: హోలీ రంగుల రూపంలో వసుపై ప్రేమవెన్నెల కురిపించిన రిషి
హిమ- జ్వాల (శౌర్య)
వాడి పేరేంటో వాడే మరిచిపోయాడు..ఈ రవ్వఇడ్లీ అని ఫిక్సైపోయాడు అని జ్వాల అంటే.. ఓసారి పిలువు అంటూ హెచ్చరించడంతో హిమ గట్టిగా రవ్వ ఇడ్లీ అని పిలుస్తుంది.  ‘ఏంటీ’అంటాడు రవ్వ ఇడ్లీ. ‘రేయ్.. పిలిచినప్పుడు ఏంటీ అని అడక్కుడదురా.. దగ్గరకు రావాలి’ అంటుంది జ్వాల. దాంతో రవ్వ ఇడ్లీ.. హిమ, జ్వాలల దగ్గరకు వస్తాడు. ‘రేయ్ రవ్వ ఇడ్లీ.. ఈమె ఎవరో తెలుసా?’ అంటుంది జ్వాల నవ్వుతూ.. ‘ఇందాక చెప్పావ్‌గా దోస్త్‌ అని’ అంటాడు వాడు. ‘దోస్తేరా.. కానీ డాక్టర్ తెలుసా’అనడంతో వాడు షాక్ అవుతాడు. హిమతో ‘వీడికీ డాక్టర్ అవ్వాలని కోరి.. ఒకరకంగా చెప్పాలంటే దీనికి(టిఫిన్ బండికి) వీడే ఓనర్.. చదువుకుంటూ దీన్ని నడుపుతున్నాడు.. నేనే వీడ్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివిస్తున్నా’అంటుంది జ్వాల. దాంతో హిమ వాడి చేతులు పట్టుకుని.. నువ్వు డాక్టర్ అవుతావ్.. బాగా చదువుకో అంటుంది. ఇక ఇంతలో జ్వాల ‘రేయ్.. టీ చెప్పి ఎంత సేపు అయ్యిందిరా’ అంటే.. మరొకడు పరుగున వచ్చి.. హిమ, జ్వాలలకు టీ అందిస్తాడు. ‘థాంక్స్ అండి’ అంటుంది హిమ. దాంతో జ్వాల, రవ్వ ఇడ్లీ.. టీ తెచ్చిన అబ్బాయి బాగా నవ్వుతారు. ‘టీ ఇస్తే కూడా థాంక్స్ చెబుతారా’ అంటుంది జ్వాల నవ్వుతూ. హిమ కూడా నవ్వుతుంది. ఇక మరో అబ్బాయి వైపు చూసి.. ‘ఇతడి పేరేంటీ? పెసరట్టా’ అంటుంది అమాయకంగా.. దాంతో జ్వాల వాళ్లు మరోసారి పక్కున నవ్వుతారు.


ప్రేమ్-స్వప్న
కట్ చేస్తే.. ప్రేమ్ తన తల్లి స్వప్న ఇంటికి వెళ్తాడు సోఫాలో కూర్చుని స్వప్నని పట్టించుకోకుండా.. అక్కడ కూడా హిమ ఫొటోలు చూసుకుంటూ ఉంటాడు. ‘రేయ్ ప్రేమ్.. రమ్మనిపిలిస్తే.. ఏంటమ్మా అని అడగకుండా అలా నీ పని నీదే అన్నట్లు ఉంటావేంట్రా’ అంటుంది స్వప్న విసుగ్గా. ‘చెప్పు మమ్మీ.. వింటున్నాను కదా..’ అంటాడు ఫోన్ చూసుకుంటూనే.. దాంతో స్వప్న ఫోన్ లాక్కుని.. ‘రేయ్.. నువ్వు నా దగ్గరే ఉండరా.. తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా.. చిన్న కొడుకు మీద చచ్చేంత ప్రేమ ఉంటుందిరా నాన్నా.. నువ్వు కూడా నా దగ్గరకి వచ్చేయరా’ అంటుంది కాస్త ఎమోషనల్‌గా.. వెంటనే తన ఫోన్ తను తిరిగి తీసుకున్న ప్రేమ్.. అంతే గట్టిగా సమాధానం ఇస్తాడు. ‘మమ్మీ ఇదే విషయం అయితే పెద్దగా నేను చెప్పేదేమీ ఉండదు మమ్మీ.. నువ్వు చాలా సార్లు అడిగావ్.. రాను అని నేను చాలా సార్లు చెప్పాను.. అయినా నువ్వు ప్రేమల గురించి చెప్పడం ఏంటి మమ్మీ విచిత్రంగా..? నీకు నేను ఎలాగో.. అమ్మమ్మకి నువ్వు కూడా అంతే కదా మమ్మీ.? అయినా నేను నీ దగ్గరకి వచ్చేస్తే.. డాడీని ఎవరు చూసుకుంటారు? వద్దు మమ్మీ.. నేను రాను.. ముందు నువ్వు అమ్మమ్మ విషయంలో మారు.. వాళ్లతో ప్రేమగా ఉండు.. అప్పుడు నేను నీ దగ్గర ఉండాలని ఆశపడు’ అంటూ తన స్టైల్‌లో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు కోపంగా. 


Also Read: రౌడీ అన్న పిలుపుతో తండ్రి డాక్టర్ బాబుని గుర్తుచేసుకుని డాక్టర్ సాబ్ నిరుపమ్ కి పడిపోయిన జ్వాల
శౌర్య-హిమ
మరోవైపు.. శౌర్య.. హిమని ఆటోలో వెనుకే కూర్చోబెట్టుకుని.. వెళ్తూ ఉంటుంది. అదే దారిలో సౌందర్య కారు ఆపి.. సౌర్య చిన్ననాటి ఫొటో చూపించి.. అందరినీ అడుగుతూ ఉంటుంది. అయితే హిమ ‘అండీ అండీ..’ అంటూ జ్వాలని పిలవడంతో.. అలా అనొద్దు అంటుంది. అప్పుడు కూడా సరేనండీ అనడంతో ఆటో ఆపేసి కోపంతో తిట్టేస్తుంది.  జ్వాల అలా తిట్టేయడంతో హిమ తలపట్టుకుని కళ్లుతిరుగుతున్నాయంటుంది.  ‘వామ్మో దీనికి ఏదో అయ్యింది’ అంటూ చాలా కంగారుపడుతుంది. దేవుడా అనుకుంటూ వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు హిమ ముఖంపై కొడుతుంది. అప్పుడే సౌందర్య.. జ్వాల ఆటో వైపు వస్తూ.. ‘సౌర్యా నువ్వు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నా నిన్ను నేను గుర్తు పట్టలేని పరిస్థితి కదా నాది’ అనుకుంటుంది బాధగా. అలా అనుకుంటూ.. జ్వాల ఉన్న వైపు కాకుండా.. పక్కకు వెళ్లిపోతుంది సౌందర్య. హిమ తేరుకోవడంతో జ్వాల సంతోషిస్తుంది.  ‘వామ్మో నువ్వు మరీ ఇంత సుకుమారమా..’ అంటూ ఆటో స్టార్ట్ చేస్తుంది. 


ఆనందరావు- సౌందర్య:
‘ఇంట్లో సంతోషాలే లేకుండా పోయాయి’ అంటూ గతంలో జరిగినవి.. అవీ ఇవీ తలుచుకుని తన బాధని భార్యతో పంచుకున్న ఆనందరావు.. ‘తిరిగి ఇంట్లో ఆనందాలు రావాలంటే.. అది హిమ పెళ్లితోనే సాధ్యం’ అంటాడు. దాంతో సౌందర్య షాక్ అవుతుంది. అయితే సౌందర్య మనసులో నిరుపమ్‌తో హిమ పెళ్లి చెయ్యాలని ఉంది. మరోవైపు ప్రేమ్.. హిమని ప్రేమిస్తున్నాడు. నిరుపమ్ జ్వాలకి పడిపోయాడు... ఎపిసోడ్ ముగిసింది...


రేపటి ( శుక్రవారం) ఎపిసోడ్ లో
గతంలో బస్తీలో ఉన్న ఇంటికి వెళ్లిన జ్వాల.... ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయంటే ఎవరో ఈ ఇంట్లో మేల్కొనే ఉన్నారన్నమాట అనుకుంటుూ వెళుతుంది. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే కచ్చితంగా శౌర్యని కలవాల్సిందే అంటూ తండ్రి కార్తీక్ ఫొటోకి దండం పెట్టుకుంటుంది హిమ. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన జ్వాల( శౌర్య) తింగరి అని పిలిచే  తానే హిమ అని తెలుసుకుని షాక్ అవుతుంది...