ఆశ్రమానికి వచ్చాక మాట్లాడదామని చెప్పిన నిరుపమ్... హిమకు షాక్ ఇస్తాడు. తన మనసులో మాట చెప్పేందుకు జ్వాలను రమ్మంటాడు. కానీ జ్వాలతోపాటు హిమ కూడా వస్తుంది. దీనిపై ఇటు నిరుపమ్, అటు జ్వాలా ఇద్దరు కూడా హిమను సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తారు. తామిద్దరం ఒంటరిగా మాట్లాడాలి అన్నాసరే హిమ అక్కడి నుంచి కదలకపోయేసరికి జ్వాల, నిరుపమ్‌కు కోపం వస్తుంది. అయితే వచ్చిన విషయం ఏంటని నిరుపమ్‌ను జ్వాల అడుగుతుంది. తాను అమెరికా వెళ్తున్నాను అంటాడు. దానికి హిమ షాక్ అవుతుంది. నిరుపమ్ అమెరికా వెళ్లిపోతే జ్వాల పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. అటు జ్వాల మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కోసమే నిరుపమ్ అమెరికా వెళ్తున్నాడని అనుకుంటుంది. జ్వాలలో మాత్రం ఏదో టెన్షన్ మొదలవుతుంది. తన తల్లికి ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. అంతే కళ్లు తిరిగి పడిపోతుంది. 


 ఇంటికి వచ్చిన హిమను సూటిపోటి మాటలతో నిలదీస్తారు నాన్నమ్మ, తాతయ్య. మనసులో మాట చెప్పాలని ప్రాధేయపడతారు, నిలదీస్తారు. సత్యం, శోభ వచ్చారని... జరిగింది చెప్పారని కూడా అంటారు. వాళ్లంతా శోభను విపరీతంగా పొగుడుతున్నారని కూడా అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా హిమ మాత్రం నోరు మెదపదు... ఇది నాన్నమ్మ తాతయ్యను అసహనానికి గురి చేస్తుంది. ఇంతలో తాను తీసుకొచ్చిన ఓ కవర్‌ను నాన్నమ్మ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఇందులోనే సమాధానం ఉందని అంటుంది. 


హిమ ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి చదువుతుంది సౌందర్య. షాక్ అవుతుంది. ఏడుస్తూనే మొత్తం రిపోర్ట్ చదువుతుంది. ఏడుస్తూ ఆ రిపోర్ట్‌ను భర్త ఆనందరావు చేతిలో పెడుతుంది. వాళ్లు అసలు విషయం తెలిసి సోపాలో కూలబడిపోతారు. 


అదే రిపోర్ట్‌ నిరుపమ్ కూడా చూస్తాడు. నీకు క్యాన్సర్ ఏంటి హిమ అంటాడు. అవున థర్డ్ స్టేజ్‌ అని చెబుతుంది హిమ. నా ప్రాణం అడ్డు వేసైనా సరి నిన్ను కాపాడుకుంటాను అంటాడు నిరుపమ్. వైద్యరంగంలో చాలా అద్భుతాలు చూస్తున్నామని కచ్చితంగా నీకు నయం అవుతుందని అంటాడు. హిమ మాత్రం ప్రాక్టికల్‌గా ఆలోచించు... ఇది తగ్గేది కాదని అంటుంది. చనిపోయే ముందు తనకో మాట ఇవ్వమంటుంది. తనకు క్యాన్సర్ అన్న సంగతి జ్వాలకు చెప్పొద్దని అంటుంది. ఇంత సీరియస్‌ గా నేను మాట్లాడుతుంటే నువ్వేంటి జ్వాల గురించి మాట్లాడతావు అని నిలదీస్తాడు నిరుపమ్. తను చాలా సెన్సిటివ్‌ అని... క్యాన్సర్ గురించి కానీ, మన ప్రేమ గురించి కానీ చెప్పొద్దని వేడుకుంటుంది. తాను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని కూడా అంటుంది. మరింత కోపంతో ఊగిపోతాడు నిరుపమ్. ఏమంటున్నావ్ హిమ.. ఇప్పుడున్న పరిస్థితి ఏంటీ... నువ్వు చెబుతున్న మాటలేంటని అడుగుతాడు. 


సత్యం, ప్రేమ్ కూడా హిమ గురించి మాట్లాడుకుంటారు. అన్ని బాగుంటే ఈ ఇంటి కోడలు అవ్వాల్సిన హిమకు ఇలా జరగడమేంటని అనుకుంటాడు సత్యం. క్యాన్సర్ కారణంగానే తన ప్రేమ సంగతి తెలిసినా రిప్లై ఇవ్వలేదని అనుకుంటాడు ప్రేమ్. 


రేపటి భాగం 


జ్వాల చేతిపై ఉన్న హెచ్‌ అనే లెటర్ చూసి షాక్ అవుతుది శోభ. ఏంటీ నీ లవర్ పేరు రాసుకున్నావా అని అడుగుతుంది. లవర్ పేరు గుండెల్లో ఉంటుందని సమాధానం చెబుతుంది జ్వాల. అది తన శత్రువు పేరని చెబుతుంది. 


అంతా ఉండగానే కీలకమైన ప్రకటన చేస్తాడు నిరుపమ్. ఇకపై హిమకు అన్ని సేవలు తానే చేస్తానని చెప్తాడు. ఓడాక్టర్‌గా, బావగా కాకుండా ఓ భర్తగా సేవలు అందిస్తానంటాడు. దానికి స్వప్న కోప్పడుతుంది. ఏంట్రా నువ్వు అనేది అంటుంది. అవును మమ్మీ.. హిమను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు.