కార్తీకదీపం జులై 14 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam july 14 Episode 1404)


శౌర్య ఇంట్లో అడుగుపెట్టడంతో ఆనందరావు ఆనందానికి అవధులుండవు. సౌందర్య, హిమ చాలా సంతోషిస్తారు. లోపలకు వచ్చిన శౌర్య ఇల్లంతా చూస్తుంది. సౌందర్య గోడకు తగిలించిన హిమ-శౌర్య లేటెస్ట్ ఫొటోని చూసి శౌర్య ఫైర్ అవుతుంది. అడుగుపెట్టగానే అపశకునం ఎదురైనట్టు దానిపక్కన నేను ఉండడం ఏంటని ఆ ఫొటో తీసి విసిరి కొడుతుంది. అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న నిరుపమ్ ఆ ఫొటోని క్యాచ్ పడతాడు. లోపలకు వచ్చిన నిరుపమ్ శౌర్య చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాడు...డాక్టర్ సాబ్ అని శౌర్య పిలవడంతో బావా అని కూడా పిలవొచ్చు అంటాడు. శౌర్య ఇలా ఇంట్లో అడుగుపెట్టడం ఏంటో...అలా నిరుపమ్ రావడం ఏంటో అర్థంకాలేదని బాధపడతారు. శౌర్య కోపం రోజురోజుకీ తగ్గుతుందని నాకు నమ్మకం ఉందన్న హిమ... ఈ ఫొటోని శౌర్య తన చేత్తోనే అక్కడ పెట్టేరోజు వస్తుంది అంటుంది...


Also Read: క్లైమాక్స్ కి చేరుతున్న 'కార్తీకదీపం', వీడిపోతున్న చిక్కుముడులు - హిమ-శౌర్య విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నడాక్టర్ సాబ్


నిరుపమ్: సారీ శౌర్య ...నువ్వెవరో తెలియక అలా అన్నాను...
శౌర్య: మీరు మీ మనసులో మాట చెప్పారంతే..
నిరుపమ్: నీకు అందరూ తెలిసినా నువ్వు నువ్వే అని ఎందుకు చెప్పలేదు
శౌర్య: కోరుకున్న వాళ్లు లేకుండా అందరూ ఉన్నా లేకున్నా ఒకటే
నేను హిమను ప్రేమిస్తున్నా అని చెప్పేలోగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. చెప్పేది కూడా వినవా అని నిరుపమ్ అంటే..
శౌర్య: మీరేం చెప్పొద్దు...మీ మనసులో నేను లేను అనేశారు...మీరు మీవాళ్లు మీలోకం మీది..నా బతుకేదో నేను బతికేస్తాను...
ఇంతలో రవ్వ ఇడ్లీ(ఆనంద్-మోనిత కొడుకు) టీ తీసుకొచ్చి ఇచ్చినా నిరుపమ్ తాగకుండా డబ్బులిచ్చి వెళ్లిపోతాడు...


స్వప్న: ప్రేమ్ లోపలకు వెళుతుండగా పిలిచిన స్వప్న...అసలు ఇంట్లో ఏం జరుగుతోందో నీకు తెలుస్తోందా..నీకు మీ డాడీకి బాధ్యత లేదా....
ప్రేమ్: బాధ్యత లేదని కాదు పట్టించుకోవాలో వద్దో తెలియడం లేదు
స్వప్న: హిమ యంగేజ్ మెంట్ లో చేసినట్టే చేస్తే మన పరువు పోతుంది కదా... 
ప్రేమ్: పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం...ఎవ్వరి నిర్ణయాలను మనం ప్రశ్నించలేం..
స్వప్న: నిరుపమ్ తో దాని పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు
ప్రేమ్: ఈ పెళ్లి జరగకపోతే నాక్కూడా సంతోషమే... నాక్కొంచెం టైమ్ ఇవ్వు..ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తాను...
స్వప్న: వాడేమో అలా తయారయ్యాడు...వీడిమో ఇంట్లోనే ఉండడు...


Also Read: అర్థరాత్రి వసు-రిషి కబుర్లు, విశ్వరూపం చూపిస్తానంటోన్న సాక్షి, ముందస్తు హెచ్చరికలు చేసిన గౌతమ్


శౌర్యని అందంగా అలంకరించి చూసుకుని మురిసిపోతుంది సౌందర్య. అసలు నిన్నిప్పుడు రౌడీ అనకూడదు...చక్కగా పద్ధతిగా అందంగా ఉన్నావ్ తెలుసా.. ప్రపంచంలో అందరూ ఆనందాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళతారు కానీ ఆనందం అంటే ఇదే. మనం ఇష్టపడేవాళ్లు, మనం ప్రేమించేవాళ్లు ఎదురుగా ఉండడం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు. 
శౌర్య: ఎందుకింత సంబరపడుతున్నావ్
సౌందర్య: ఇన్నాళ్లూ లేవుకదా..నేను తీర్చుకోవాల్సిన ముచ్చట్లు చాలా ఉన్నాయ్...ఈ చీరలో మీ అమ్మా నాన్నకి చూపిస్తాను పద
హాల్లోకి వచ్చిన శౌర్యని చూసి ఆనందరావు-హిమ ముచ్చటగా చూస్తుంటారు. శౌర్య చీరలో ఎంత బావుందో అనుకుంటుంది. ఇప్పుడు కార్తీక్ కూతురిలా ఆనందరావు మనవరాలిలా కనిపిస్తున్నావ్ అంటాడు ఆనందరావు.
శౌర్య: బయటకు అందరూ బాగానే ఉంటారు..మోసం చేశాక కదా అసలు రంగు బయటపడుతుంది...
హిమ ప్రేమగా శౌర్యని చూస్తుంటే...శౌర్య మాత్రంకోపంగానే చూస్తుంటుంది....
( మీకు మాటిచ్చినట్టే నిరుపమ్ బావ-శౌర్యకి పెళ్లి జరిగేలా చేస్తూనే ఉన్నాను నన్ను మీరే దీవించాలి అని మనసులో అనుకుంటుంది హిమ)


Also Read: తనవారితో కలసిపోయిన శౌర్య- పూర్తిగా మోనితలా మారిపోయిన శోభ - కార్తీకదీపం కథ ఇక సుఖాంతమేనా !
శోభ: మన సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు...
స్వప్న: నేను ప్రేమ్ ని అడిగాను చూద్దాం...
శోభ: ఇలాంటి టైమ్ లో స్పీడ్ పెంచకపోతే కష్టం ఆంటీ... 
స్వప్న: నిరుపమ్ కి నేను ఎంత చెప్పినా హిమ మాయలోంచి బయటకు రావడం లేదు
శోభ: నిరుపమ్ కోసం అమెరికా నుంచి వచ్చాను...మధ్యలో హిమ-జ్వాల గొడవే సరిపోతోంది. నేను ఓ అడుగు ముందుకేసి మాట్లాడుదాం అంటే నాకు సంబంధం చూస్తున్నాడు నిరుపమ్....
నన్ను ఆ నానమ్మ మనవరాలు ఇద్దరూ చెంపపై కొట్టారు..అది నేను మర్చిపోను..వాళ్లిద్దరికీ బుద్ధి చెబుతాను..నేనే రంగంలోకి దిగుతాను. వాళ్లిద్దరకీ పెళ్లి జరిగితే ఇంకేం చేయలేం....
స్వప్న: నీకన్నా ఎక్కువ తొందర నాకుంది శోభ...హిమ కోడలిగా రావడం నాకు ఇష్టం లేదు...ప్రేమ్ ఏదో పరిష్కారం చెబుతాను అన్నాడు కదా చూద్దాం...
అటు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు....
నీకిష్టం అని అన్ని వంటలూ చేశాను ఏం కావాలో అడుగు అంటుంది సౌందర్య...
శౌర్య: నాకు నాన్నంటే ప్రాణం తెచ్చిస్తావా...మీ డాక్టర్ మనవడంటే ఇష్టం తెచ్చి ఇవ్వగలవా...మన పిచ్చిగానీ మనకు ఇష్టం అయినవి ఏవీ దొరకు నానమ్మా....దొరకవు కాబట్టే ఇంకా వాటిపై ఇష్టం పెరిగిపోతుందేమో కదా...
ఆనందరావు: కడుపునిండా భోజనం చేద్దాం అమ్మా...ఇప్పుడు అవన్నీ ఎందుకు
శౌర్య: కడుపునింపుకోవడమే జీవితం కాదు...మనసనేది ఒకటి ఉంటుంది కదా
ఆనందరావు: ఇన్నాళ్లూ అందర్నీ వదిలేసి ఎలా ఉన్నావ్...మేం ఎవ్వరం గుర్తుకురాలేదా....
శౌర్య: మన చేతివేళ్లకు దెబ్బతగిలితే అయ్యో అని బాధపడతాం, అంతకన్నా పెద్ద తగిలితే చేతికి తగిలిన దెబ్బ చిన్నది అనిపిస్తుంది. నా మనసుకి గాయం అయింది దానిముందు అన్నీ చిన్నగా అనిపించాయ్...
సౌందర్య: ఏంటే ఇంత లేట్..తొందరగా రావొచ్చు కదా 
( నేను వెళ్లి కూర్చుంటే నాపై కోపంతో శౌర్య లేచి వెళ్లిపోతుందా ఏంటి అని హిమ అనుకుంటే...నేనున్నానని కూర్చోవడానికి భయపడుతోందా అని శౌర్య అనుకుంటుంది)
శౌర్య: వెళ్లి పోతున్న హిమను ఉద్దేశించి...నాన్నమ్మా రమ్మని చెప్పు అంటుంది
హిమ ఆశ్చర్యంగా చూస్తుంటుంది....


రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
నా మనసులో మాట చెబుతాను విను..నా పెళ్లి నీతోనే జరుగుతుందని మరోసారి క్లారిటీ ఇస్తాడు నిరుపమ్. అదంతా విన్న శౌర్యకి మరింత కోపం పెరుగుతుంది. అంతకోపం ఉంటే నా ఫొటోపై ఎందుకు నామీదకే విసురు..కోపం తగ్గుతుందంటే నన్ను చంపెయ్ అంటుంది హిమ. నా దగ్గర ప్రాణాలు తీసేంత క్రూరత్వం లేదు..చేసిన తప్పు క్షమించేంత మంచి మనసు లేదంటుంది శౌర్య...