Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న డైమండ్ నెక్లెస్ దీప తన కూతురు సౌర్యతో దొంగతనం చేయించి ఉంటుందని పారిజాతం అంటుంది. దీప షాక్ అయిపోతుంది. ఇంతలో శివనారాయణ వచ్చి పారిజాతాన్ని తిడతాడు. ఇంతలో సౌర్య వస్తుంది. ఎందుకు గ్రానీని తిడుతున్నావని అడుగుతుంది. దీంతో పారిజాతం సౌర్యతో నీకు ఓ విషయం అడగాలి అంటుంది. ఇంట్లో అందరూ చిన్న పిల్లకి అలాంటి విషయాలు అడగొద్దని అంటారు. జ్యోత్స్న అడగమని అంటుంది.
పారిజాతం: మీ ఇంట్లో నెక్లెస్ ఉందా.
సౌర్య: అంటే ఏంటి.
పారిజాతం: డైమండ్ నెక్లెస్.
సౌర్య: ఎలా ఉంటుంది.
పారిజాతం: మిలమిలా మెరుస్తుంది కదా అదే..
సౌర్య: ఓహో అదా..
పారజాతం: అదా అంటున్నావ్ ఎక్కడైనా చూశావా.
సౌర్య: చూశానుగా.
సౌర్య చూశాను అంటే అందరూ షాక్ అవుతారు. ఎక్కడ అని పారిజాతం అడిగితే సౌర్య మా ఇంట్లోనే ఉందని మా అమ్మ బ్యాగ్‌లో ఉందని చెప్తుంది. పారిజాతం రెచ్చిపోతుంది. తాను నింద వేయలేదు అని నిజమే చెప్పానని ఇప్పుడేం చేస్తారని నిలదీస్తుంది.
దీప: సౌర్య అలాంటి నెక్లెస్ మన బ్యాగ్‌లో ఉండటం ఏంటే.
సౌర్య: ఉందమ్మ నేను చూశాను.
దీప: నువ్వు పెట్టావా దాంట్లో.
పారిజాతం: ఏయ్ ఆపవే.. నీ తప్పు తప్పించుకోవడానికి నీ కూతురు మీద పెట్టాలి అనుకుంటున్నావా..నువ్వు పెట్టకుండా మరి అది నీ బ్యాగ్‌లోకి ఎలా వస్తుంది.
సౌర్య: ఎందుకు మా అమ్మని తిడుతున్నావ్.
పారిజాతం: మీఅమ్మే కదా దాన్ని మీ బ్యాగ్‌లో పెట్టింది.
సౌర్య: అని నేను చెప్పానా..
కార్తీక్: మరి ఎవరు పెట్టారు.
సౌర్య: బంటుని చూపిస్తూ అదిగో ఆ అంకుల్ పెట్టాడు. నేను ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటే ఆ అంకుల్ వచ్చాడు. మా బ్యాగ్‌లో పెట్టి వెళ్లిపోయాడు. గ్రానీ నువ్వు చెప్పినట్లే జరిగింది. మా అమ్మ బ్యాగ్‌లో పెట్టింది ఆ అంకులే. అమ్మమ్మ అమ్మ కోసం సర్‌ఫ్రైజ్ ఇచ్చిందేమో అని నేనేం చెప్పలేదు. కార్తీక్ నేను చేసింది కరెక్ట్ కదా.
కార్తీక్: రౌడీ ఆల్‌వేజ్ కరెక్ట్. నువ్వు వెళ్లి ఆ నెక్లెస్ తీసుకురా. నేను ఈలోపు ఆ అంకుల్‌కి థ్యాంక్స్ చెప్తా. నువ్వేళ్లి కాస్త లేటుగా వచ్చేయ్.
కార్తీక్ బంటుని కొడుతాడు. నీతో ఇంకెవరైనా ఆ పని చేయించారా అని అడుగుతాడు. దాంతో బంటు పారిజాతాన్ని కాపాడటానికి నేనే చేశాను అని ఒప్పుకుంటాడు. దీంతో మళ్లీ కార్తీక్ బంటుని కొడతాడు.
కార్తీక్: చేయని తప్పునకు నిందలు మోయడం ఎంత కష్టమో నీకు తెలుసా. నిందలు మోస్తున్న మనిషి మానసికంగా ఎంత నరకం అనుభవిస్తుందో నీకు తెలుసా. వెళ్లు ఆ మనిషి కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగు. బంటు దీప కాళ్లు పట్టుకుంటాడు.
ఇక దశరథ్ బంటుని ఇంటి నుంచి వెళ్లిపోమని అంటాడు. ఇంతలో సౌర్య నెక్లెస్ తీసుకొని వస్తుంది. కార్తీక్ దాన్ని తీసుకొని జ్యోత్స్నకి ఇస్తాడు. అది తీసుకొని జ్యోత్స్న సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక పారిజాతాన్ని శివనారాయణ తిట్టి పంపేస్తాడు. దీపని ఏమీ అనుకోవద్దని అందరూ చెప్తారు. ఇక పాపని తీసుకొని దీప వెళ్లిపోతుంది.
సుమిత్ర: కార్తీక్ నీకు నా కూతురికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.
కార్తీక్: నీకు ఎందుకు అలా అనిపించింది.
సుమిత్ర: ఇంతకు ముందు మీ మాటలు చూసి.
కార్తీక్: అవి ఎప్పుడూ ఉండేవేలే అత్త నువ్వే లైట్ తీసుకో నేను వెళ్తాను.
కాంచనకు పారిజాతం కాల్ చేసి మాట్లాడుతుంది. ఇంతలో ఏమైందని శ్రీధర్ వచ్చి అడుగుతాడు. కాంచన చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. దాంతో శ్రీధర్ అత్తయ్య కార్తీక్ గురించే చెప్పింది కదా అని అంటాడు. కార్తీక్ దీపని సపోర్ట్ చేసి జ్యోత్స్నని తిట్టాడని అంటుంది. దీపతో కార్తీక్ చనువుగా ఉంటున్నాడు అని చెప్పిందని చెప్తుంది. ఆ విషయం కార్తీక్‌కు అడగొద్దని కాంచన అంటుంది. దీంతో శ్రీధర్ ఇది అబద్ధం అయినా మనం సీరియస్‌గా తీసుకోవాలని.. కార్తీక్, జ్యోత్స్నలకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని అంటాడు.
మరోవైపు దీప కడియాన్ని కలుస్తుంది. కడియం ఓ హెటల్‌ని తీసుకున్నానని దీపకి చూపిస్తాడు. ఇక తన హెటల్‌లో ఉప్మానే స్పెషల్ టిఫెన్‌గా పెడదామని అంటుంది. ఇక కడియం కార్తీక్ గురించి దీపని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఆ బిరుదు అందుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ - నిజంగా.. సాయి పల్లవి 'హైబ్రిడ్ పిల్లే!'