Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  : నర్శింహ తల్లి పెళ్లాం ఎదురుగానే మందు తాగుతాడు. దీపని ఇంట్లో అందరి సపోర్ట్ చేస్తున్నారని రగిలిపోతాడు. దాని జోలికి వెళ్లొద్దుని చెప్పానని.. అయినా వెళ్లావని అనసూయ కొడుకుని తిడుతుంది. శోభ చేతకానివాడివంటూ సెటైర్లు వేస్తుంది. దీంతో ఇద్దరినీ నర్శింహ తిడతాడు.  


అనసూయ: నువ్వు చేసిందే చెత్త పని. ఆ పెద్దావిడని కాపాడిందని దాన్ని అందరూ నెత్తిన పెట్టుకున్నారు. కానీ అసలు యవ్వారం మనకు తెలుసు. దాన్ని ఇంటికి తెచ్చి పెట్టుకోవడం వెనక ఇంకేదో ఉందని నాకు అర్థమైంది కానీ అదేంటో మనకు తెలీదు. నువ్వు ఇలా ఇంటి మీదకు పోయి గొడవ చేస్తే డబ్బున్నోళ్లు కేసులు పెడతారు. ఇంకేదో చేస్తారు. నువ్వు అవన్నీ వదిలేసి కారు తోలుకోరా. కోడలు పిల్లా నువ్వు కూడా ఓ మాట చెప్పు.


శోభ: చెప్తాను చెప్తాను అందరి సంగతి చెప్తాను. తాగింది దిగాక చెప్తాను.  


కార్తీక్ జ్యోత్స్న మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ తల్లిదండ్రలు అక్కడికి వస్తాడు.  కొడుకును అడగాల్సింది చాలా ఉందని అంటాడు శ్రీధర్. కాంచన భర్తని ఆపే ప్రయత్నం చేస్తుంది. 


శ్రీధర్: నీకు ఆరోజే చెప్పాను అనవసరమైన విషయాల్లో తల దూర్చొద్దని.. వాడు ఎవడురా నిన్ను వేలెత్తి చూపడానికి చెప్పు తీసుకొని కొట్టాల్సింది వెధవని.


కార్తీక్: నేను అదే పని చేశాను.


శ్రీధర్: అదే నీకు అవసరం లేదని చెప్పారు. ఓరేయ్ నువ్వు మా గురించి ఆలోచించకపోయినా పర్లేదు కోడలు గురించి ఆలోచించరా.


కాంచన: జరిగిన దానికి జ్యోత్స్న చాలా ఫీలవుతుందిరా. మొదటిసారి ఫోన్‌లో దాని ఏడుపు విన్నాను. అది నీ కారణంగా.


శ్రీధర్: అవన్నీ వీడికి పట్టవు కాంచన. సార్ స్త్రీ జనోద్ధరణ కోసం నడుం బిగించి అన్యాయం అయిన ఆడవాళ్ల కోసం అండగా ఆసరాగా ఉండే కార్యక్రమం మొదలెట్టాడు. సొంతవాళ్లు ఎవరూ బాధ పడినా వాడికి పట్టదు. ఎవరు ఏడ్చినా వాడికి వినిపించదు. మీ గురించి మీరే వినడానికి ఇబ్బంది పడుతుంటే ఇక మాకు ఎలా ఉంటుంది. నీకు కాబోయే భార్యకు ఎలా ఉంటుంది.


కాంచన: తప్పు చేస్తున్నావ్‌రా కార్తీక్. నువ్వు లండన్‌లో ఉన్నప్పుడు బావ ఎప్పుడు వస్తావ్ అని ఎదురు చూస్తూ బాగా హ్యాపీగా ఉండేదిరా నా కోడలు. కానీ నువ్వు దాని ఎదురుగా ఉంటూ దాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నావురా. దాని ఏడుపు నేను చూడలేనురా. ఎందుకు అంటే అది మా అమ్మ. మేం దాన్ని ఎంతో అపురూపంగా చూసుకున్నాంరా దాన్ని నువ్వు ఏడిపిస్తావురా.


శ్రీధర్: కాంచన ఇక మనం వీడితో ఎన్ని మాట్లాడినా వేస్టే రేపే మనం వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి మూహూర్తాలు పెట్టుకుందాం.


కార్తీక్: నాన్న..


శ్రీధర్: ఏంటి కందుకూరి వీరేశలింగం గారు తమ రెస్టారెంట్ పూర్తి అవ్వాలా..


కార్తీక్: లేదు మీకో విషయం చెప్పాలి. చెప్తాను కానీ ఇప్పుడు కాదు. వీలైనంత తొందర లోనే చెప్తా అప్పటి వరకు మీరు ఏం తొందర పడకండి ప్లీజ్. 


పారిజాతం: నువ్వు ఈ రోజు నిలదీసి అడిగిన ప్రశ్న నేను ముందు నుంచి అడుగుతున్నాను. నువ్వేమో జాలి అనుకున్నావ్. మీ బావ బాధ్యత అనుకున్నాడు. నీకు ఇంకా అర్థం కావడం లేదే. మగాడు పెళ్లి కాని పిల్ల వెంట పడితే అది ప్రేమ అవుతుంది. అదే పెళ్లి అయిన ఆడదాని వెంట పడితే నేను నీకు చెప్పకూడదు. నువ్వు వినకూడదు. నీ బావని నీ వాడిని చేసుకోవడానికి నీకు ఇంత కంటే మంచి అవకాశం రాదు. కానీ ఆ దీప ఉంటే నువ్వు అనుకున్నది జరగదు. ముందు నువ్వు ఆ దీపని ఇంట్లో నుంచి పంపించేయ్. తర్వాత పెళ్లి విషయం చెప్పి ముహూర్తాలు పెట్టేలా చేయ్. ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా మీ అమ్మదే అవుతుంది. అందుకే నువ్వు మీ అమ్మకి నీ బాధ అర్థమయ్యేలా చేయ్. నవ్వు ఎంతలా చేయాలంటే నీకు నేను ముఖ్యమా దీప ముఖ్యమా అన్నంతలా ఉండాలి. ఇది చేయి జారిపోక ముందే జాగ్రత్త పడు. 


దీప: శౌర్యని పడుకోపెడుతూ.. ఆ ఇంట్లో ఎవరైనా మీ నాన్న వచ్చి వెళ్లారని దీనితో చెప్తే తర్వాత నేను ఏం చేయలేను. 


శౌర్య: అమ్మ.. అమ్మమ్మ ఇంట్లో జ్యో, జ్యో గ్రానీ నాతో సరిగా ఉండటం లేదు. మనం కార్తీక్ వాళ్ల ఇంటికి వెళ్లిపోదామా. కార్తీక్ నన్ను ప్రేమగా చూసుకుంటాడమ్మ. దీంతో దీప శౌర్యని తిడుతుంది.  


దీప: నా కూతురికి దూరంగా ఉండు అంటే అతనికి అర్థం కావడం లేదు. పోనీ దీనికి గట్టిగా చెప్దామంటే దీనికి అర్థం కాదు. నాకు ఇదో సమస్య. అసలే నా మీద కోపంగా ఉన్న జ్యోత్స్న ఈరోజు మరింత కోపం పెంచుకుంటుంది.


ఇక ఉదయం దీప హోటల్‌కి వెళ్తుంది. టిఫెన్ చేసిన వారికి ఉప్మా ఫ్రీ అని బోర్డ్ పెడుతుంది. దీంతో అందరూ ఉప్మా సూపర్ అని అంటారు. కార్తీక్ కూడా ఆ హోటల్‌కి వస్తాడు. కార్తీక్‌ కూడా టిఫెన్ చేస్తాడు. దీప ఇంత చిన్న హోటల్‌లో పని చేయడం నాకు ఇష్టం లేదని కార్తీక్ అనుకుంటాడు. ఇక కార్తీక్ టిఫెన్ సూపర్ అని పొగుడుతాడు. ఇక కార్తీక్ ఉప్మాను తమ రెస్టారెంట్‌లో కూడా ట్రై చేస్తామని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపకి ప్రమాదం వస్తే ముందే ఎందుకు పసిగట్టలేకపోయానని ఫీల్ అయిన నయని.. విశాలాక్షి పరువు తీసే ప్లాన్​లో తిలోత్తమ!