Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode బంటుని ఇంటి నుంచి గెంటేయడం వల్ల బంటు గోడ దగ్గరకు వస్తాడు. దీంతో పారిజాతం గోడ దగ్గరకు వచ్చి బంటుతో మాట్లాడుతుంది. నెక్లెస్ ప్లాన్ బెడిసికొట్టినందుకు బంటుని తిడుతుంది. దీపని త్వరగా ఇంట్లో నుంచి గెంటేయకపోతే తాను ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి వస్తుందని అంటుంది. 


పారిజాతం: దీపని బయటకు పంపడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పేది జాగ్రత్తగా విను. దాని మొగుడి వివరాలు మనకు సగమే తెలిశాయి. ఏమైనా చేయాలి అంటే ఆ దీప గురించి మనకు పూర్తి వివరాలు తెలియాలి. తెలియాలి అంటే దీప సొంత ఊరు ముత్యాలమ్మగూడెం వెళ్లి మొత్తం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకో. దాని మీద దెబ్బ కొడితే అది ఇంటి నుంచి వెళ్లిపోతుంది. 


సుమిత్ర ఇంటికి వచ్చిన నర్శింహ దీపని నెట్టేస్తాడు. సుమిత్ర, దశరథ్ దీపని పట్టుకొని పైకి లేపుతారు. నర్శింహను చూసి సుమిత్ర నువ్వెందుకు వచ్చావ్ అని అడుగుతుంది.


నర్శింహ: నా పెళ్లాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని నన్ను ఎందుకు వచ్చావ్ అంటారేంటి అమ్మ. అయినా నేను వచ్చింది మీతో గొడవ పడటానికి కాదు వాడి సంగతి తేల్చడానికి. రేయ్ ఎక్కడున్నావురా బయటకు రారా..
దీప: నర్శింహ నువ్వు ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు బయటకు వెళ్లి మాట్లాడుకుందాం పద. 
నర్శింహ: నువ్వు ఎక్కడికి వెళ్లినా వాడు వస్తాడని నాకు తెలుసే. అందుకే ముందు ఆడి సంగతి తేల్చి మన రచ్చ బండ సంగతి తర్వాత పెట్టుకుందాం. రేయ్ నువ్వు ముందు రారా కిందకి.. 
దీప: నర్శింహ నువ్వు ముందుకు బయటకు పద.
నర్శింహ: వాడిని పిలిస్తే నువ్వు కంగారు పడుతున్నావ్ ఏంటే. వాడు ఇలా రాడే వాడిని ఎలా పిలిస్తే వస్తాడో నాకు తెలుసు అని నర్శింహ దీప జుట్టు పట్టుకుంటాడు. ఇంతలో కార్తీక్ వెనక నుంచి వచ్చి నర్శింహ కాలర్ పట్టుకుంటాడు. నా చేయి నీ ఒంటి మీద పడేలోపు నాలుగు దిక్కుల్లో ఎక్కడున్నా వీడు వచ్చేస్తాడని నాకు తెలుసే..
కార్తీక్: ప్రత్యక్షం అవ్వడం కాదురా నీలాంటి వాడిని దీప చుట్టు పక్కలకు కూడా రాకుండా గెంటేయాలి పదరా బయటకు. అని కార్తీక్ లాక్కెళ్లి నర్శింహను గెంటేస్తాడు. 
దీప: బాబు నా గురించి మీరు ఎవర్నీ కొట్టక్కర్లేదు. వాడు మనిషే కాదు ఆ విషయం నాకు తెలుసు.
నర్శింహ: ఏంట్రా అన్నావ్ నేను వెధవనా అంటే నువ్వు పత్తిత్తువా. నా పెళ్లానికి నీకు ఉన్న సంబంధం ఏంటి చెప్పు.
కార్తీక్: అనవసరంగా మాట్లాడి నా చేతిలో దెబ్బలు తినకు.
నర్శింహ: ఏ సంబంధం లేకుండానే నా భార్యని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావా.. ఏ సంబంధం లేకుండానే దీని కోసం నన్ను గుడిలో కొట్టావా.  నా పెళ్లాన్ని కూతుర్ని తీసుకొని షాపింగ్‌కు వెళ్లావా.. ఏ సంబంధం లేకుండానే నా కూతుర్ని నీకు పుట్టిన కూతురిలా ముద్దాడుతున్నావా.


కార్తీక్ నర్శింహ చెంప పగలగొడుతాడు. దీంత నర్శింహ తన పెళ్లానికి నీతో ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. దీంతో దీప నర్శింహ నోరు మూయమంటే.. రోడ్ల మీద చెట్లు కింద మీరు మాట్లాడుకోవడం తాను తన తల్లి చూశామని చెప్తాడు. దీంతో దీప షాక్ అవుతుంది. జ్యోత్స్న రగిలిపోతుంది. 


ఆ ఇంటి నుంచి నువ్వు వెళ్లే వరకు నేను పెంట పెంట చేస్తాను అని నర్శింహ అంటే సుమిత్ర నర్శింహ చెంప పగలగొడుతుంది. నర్శింహ రెండో పెళ్లి గురించి చెప్తుంది.  


నర్శింహ: నా పెళ్లాం మీ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉన్నపళం గా బట్టలు సర్దుకొని కూతురిని తీసుకెళ్తే సరే సరి లేదంటే నేను రెండు తగిలించి ఇంటి  దగ్గర పంపాల్సి వస్తుంది. 
సుమత్ర: మళ్లీ కొట్టి ఏంట్రా మళ్లీ బెదిరిస్తున్నావ్. దీప నా కూతురు. 
నర్శింహ: ఏ అధికారంతో దాన్ని మీ ఇంటిలో పెట్టుకున్నారు.
సుమత్ర: దీప నా కూతురు. 
నర్శింహ: అలా అయితే ఊరిలో మొగుడు వదిలేసిన వాళ్లందరి తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. దీన్ని మాత్రం కాదు.
శివనారాయణ: రేయ్ నా కోడలితో ఇలా మాట్లాడుతావేంట్రా. దశరథ్ పోలీసులకు కాల్ చేయ్. రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో వీడికి తెలియాలి. 
నర్శింహ: అయినా నాకు నా పెళ్లానికి మధ్యలో మీరు ఎవరండి. మా విషయంలో తల దూర్చడానికి మీ కేంటి సంబంధం.


కార్తీక్, నర్శింహలు కాలర్లు పట్టుకొని కొట్టుకుంటారు. దీప ఆపి నర్శింహను వెళ్లిపోమని అంటుంది. దీప ఊరు వెళ్లే వరకు నేను వెళ్లను అంటాడు. ఇక పారిజాతం మాకేంటి ఈ దరిద్రం అని దీపని అడుగుతుంది. 


పారిజాతం: మీ మొగుడు పెళ్లాల పంచాయితీకి మా ఇళ్లే దొరికిందా అమ్మ. మీ దిక్కుమాలిన సంబంధాల గురించి వింటుంటే మాకు కంపరంగా ఉంది. ఏయ్ ముందు నీ మొగుడిని తీసుకొని ఇక్కడి నుంచి పో.
సుమిత్ర: దీప ఎక్కడికి వెళ్లదు అత్తయ్య. తనకి ఇప్పుడు ఎవరూ లేరు మనం తప్ప. రేయ్ నువ్వు వెళ్లరా.
నర్శింహ: మీ అరుపులకు ఎవరూ భయపడరు. 


దశరథ్ పోలీసులకు కాల్ చేస్తుంటే దీప ఆపేస్తుంది. వాడి మీద జాలి పడటం వల్లే ఇంత వరకు వచ్చిందని కార్తీక్ అంటాడు. ఇక నర్శింహ మరోసారి దీపను ఊరెళ్ల మని బెదిరిస్తాడు. నర్శింహ వెళ్లగానే దీప ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గర్భంలో గరుడ అంశ ఉందని తెలుసుకున్న నాగేశ్వరి.. జ్వాలని చూసి గజగజ వణికిపోయిన పంచమి!