Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  : పాపకి ఏం తినపించలేదు అని దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో శౌర్య తనకి బయటకు తీసుకెళ్లి తినిపించాడు అని చెప్తుంది. ఇక శౌర్యని దీప లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది. ఇక దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటారు. ఇక దీప కార్తీక్‌తో శౌర్యకు కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దని దానికి దగ్గర అవ్వొద్దని చెప్తుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇంకో ఇళ్లు చూసుకొని వెళ్లిపోతామని దీప చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తుంటాడు. శౌర్య వచ్చి కార్తీక్‌కు థ్యాంక్స్ చెప్పావా అంటుంది. దీప లేదు అంటే బుంగ మూతి పెట్టుకుంటుంది. దీంతో దీప కార్తీక్‌ దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ దీపతో తిట్టాల్సినవి ఏమైనా మర్చిపోయారా అండీ అని అడుగుతాడు. దీప లేదు అని థ్యాంక్స్ చెప్తుంది. 


పారిజాతం: ఆహా చిలకా గోరింకల్లాగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో.. సారీలు, థ్యాంక్స్‌లు కథ బాగా ముదిరింది. మనవడా నిన్ను ఇక దారిలో పెట్టాల్సిందే. పెడతాగా ఏం చేయాలో అదే చేస్తాను. 


నర్శింహ, అనసూయ, శోభలు దీప వార్నింగ్ తలచుకొని హడలెత్తిపోతారు. నర్శింహ తాగుతుంటే శోభ దీపని ఏం చేయలేపోయావ్ అని అంటుంది. అనసూయ కూడా శోభకే సపోర్ట్ చేస్తుంది. అసలు దీప ఎందుకు వచ్చింది ఏం చేశావ్ అని అడుగుతారు. దీప దాని కూతురు తప్పిపోయినట్లు తెగ టెన్షన్‌ పడుతుంటే ఇదంతా నేనే చేసినట్లు దానికి ఫోన్ చేసి బిల్డప్ ఇచ్చా అది ఇలా వచ్చేసింది. నువ్వు అని చెప్తేనే ఇలా చేస్తే నిజంగానే ముగ్గురిని చంపేస్తుందని అనసూయ అంటుంది. దానికి శోభ అలా వదిలేయకూడదు అత్తయ్య దానిని ఊరు వెళ్లే వరకు వదిలేది లేదు అని అంటుంది. నర్శింహ కూడా శోభ చెప్పిందే జరిగేలా చేస్తా అంటాడు.


మరోవైపు శివనారాయణ లెక్కలు వేసుకుంటూ ఉంటే పారిజాతం వచ్చి ఆయన్ను చూసి నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది. శివనారాయణ వెటకారంగా తన జేబు నుంచి వంద తీసి పారిజాతానికి ఇస్తాడు. 


పారిజాతం: ముందు నేను చెప్పేది వినండి. రేపు ఏంటో మీకు గుర్తుందా. రేపు నా పుట్టిన రోజు. నేను కోరిన కోరిక తీరుస్తాను అని నాకు మాట ఇవ్వండి.


శివనారాయణ: నేను చచ్చినా మాట ఇవ్వను. నువ్వు కోరే కోర్కెలు నేను తీర్చను.


పారిజాతం: నేను కోట్లు అడుగుతాను అనుకుంటున్నారేమో.. నేను కోరే కోరికతో నోటుతో పని లేదు అండీ నోటితోనే పని.


శివనారాయణ: ముందు కోరిక చెప్పు. అది నచ్చితే అప్పుడు చెప్తా.


పారిజాతం: నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అలాంటి కోరిక కోరను. మాటివ్వండి.


శివనారాయణ: సరే ఎవరినీ ఇబ్బంది పెట్టని కోరిక అంటున్నావ్ కదా అయితే ఇస్తా. పైగా రూపాయి కూడా ఖర్చు లేదు అన్నావ్ కదా. 


పారిజాతం: మనసులో.. నేను ఊరికే మాట తీసుకోలేదు శివనారాయణ. నేను చేసే పనికి నువ్వు అడ్డు రాకూడదు. రేపు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. చాలా సంతోషం అండీ.



దశరథ్: ఏంటి పిన్నీ చాలా సంతోషంగా ఉన్నావ్.


శివనారాయణ: రేపు మీ పిన్ని పుట్టినరోజురా తను ఓ కోరిక కోరుతుంది నేను కాదు అనకూడదు అంట.


దశరథ్: పిన్ని మీ కోరిక మేం ఎందుకు కాదు అంటామ్. పైగా రేపు నీ పుట్టిన రోజు వేడుకలా చేద్దాం. నాన్నే కాదు నేను మాటిస్తున్నా. నీ కోరిక మేం కాదు అనము పిన్ని. మా కోరిక కూడా నువ్వు కాదు అనకూడదు.  


దీప శౌర్యని పట్టుకొని ఏడుస్తుంది. శౌర్య దీప కన్నీరు తుడుస్తుంది. దీప శౌర్యకు చాలా జాగ్రత్తలు చెప్తుంది. నర్శింహని శౌర్య నీడ కూడా తాకనివ్వను అని అనుకుంటుంది. ఇక శౌర్యని పడుకోపెడుతుంది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్ల చావు వాళ్లు కొని తెచ్చుకున్నట్లే అని అంటుంది. ఇక కాంచన, శ్రీధర్‌లు కార్తీక్ రాకకోసం ఎదురు చూస్తారు. ఇంతలో కార్తీక్ వస్తాడు. కాంచన కార్తీక్ ఇది వరకు టైం సరికి వచ్చేవాడివి అని ఇప్పుడు అవుట్ హౌస్‌లు అంటూ మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద తండ్రి శ్రీనివాస్‌ని నిలదీసిన కృష్ణ.. కుమిలిపోతున్న మురారి!