Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  సౌర్య పువ్వులు కోయడానికి వస్తే బంటు వచ్చి అడ్డుకుంటాడు. ఇక సౌర్య పువ్వులు కోయనివ్వడం లేదని తన తల్లికి చెప్తుంది. ఇక అమ్మమ్మకు చెప్తాను అని సౌర్య అంటే పారిజాతం వచ్చి ఆపి వద్దమ్మా నువ్వు కోసుకో అని చెప్తుంది. బంటు అడ్డుకుంటే పారిజాతం ఆ పిల్లని అడ్డుకోకురా ఆ పిల్లతో నాకు పని ఉందని చెప్తుంది. 


మరోవైపు జ్యోత్స్న పుట్టిన రోజు సందర్భంగా ఇంటిని అందంగా రెడీ చేస్తారు. అందరూ జ్యోత్స్నని విష్ చేస్తారు. జ్యోత్స్న కార్తీక్ తల్లి కాంచన కాళ్లకు మొక్కుతుంది. దీంతో కాంచన త్వరగా కార్తీక్‌ను పెళ్లి చేసుకొని తన ఇంటికి వచ్చేయ్ మని రాబోయే పుట్టిన రోజు తన కోడలిగా తన ఇంట్లో జరగాలి అని అంటుంది. ఇక జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్లి బావ నాకు విష్ చేయవా అని అడుగుతుంది. దీంతో కార్తీక్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఇంకేం లేదా అని అడుగుతుంది. ఇంతలో పారిజాతం చాటుగా తెచ్చిన గులాబీని కార్తీక్ చేతిలో పెడుతుంది. కార్తీక్ బయటకు తీయగానే జ్యోత్స్న మురిసిపోతుంది. 


జ్యోత్స్న: నా భర్త్‌డేకి నీ లవ్‌ని గిఫ్ట్‌గా ఇస్తున్నావా.. థ్యాంక్యూ బావ లవ్‌యూ సో మచ్.
కార్తీక్: జ్యోత్స్న అది..
పారిజాతం: నీ కోసమే తెచ్చాడు మనవరాలా.. నీకు ఇవ్వడానికి వాడి మనసు కంటే ఇంకేం పెద్ద గిఫ్ట్ ఉంటుంది చెప్పు.
కార్తీక్: అత్త ఈ రోజు ఈ ఇంట్లో ఇంకొకరి భర్త్‌డే కూడా ఉంది. 
సుమిత్ర: ఎవరిది..
కార్తీక్: సౌర్య వాళ్ల అమ్మగారిది..
సుమిత్ర: అవునా..
సౌర్య: అమ్మమ్మ ఒకసారి బయటకు వచ్చి చూడు మా అమ్మ పెట్టిన ముగ్గు ఎంత బాగుందో. 
సుమిత్ర: సరే కానీ నువ్వు వెళ్లి మీ అమ్మని పిలవవే..
పారిజాతం: తను వస్తుందిలే సుమిత్ర ముందు నువ్వు రా కేక్ కట్ చేయిద్దాం.
సుమిత్ర: దీప అక్కడికి రావడంలో.. మీ అందరికీ ఒక విషయం తెలుసా ఈరోజు మన జ్యోత్స్న పుట్టిన రోజే కాదు దీప పుట్టిన రోజు కూడా.. 


పారిజాతం తాను మార్చిన బిడ్డను గుర్తుచేసుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ దీపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. ఇక సౌర్య ఊరిలో మా అమ్మకు ఎవరూ శుభాకాంక్షలు చెప్పరు ఇక్కడ ఎంత మంది చెప్పారో అని అమ్మా నువ్వు హ్యాపీయేనా అని దీపని అడుగుతుంది. 


ఇక కేక్ చూసిన సౌర్య పుట్టిన రోజుకు ఇది కాదు కదా కట్ చేయాల్సింది అని అంటుంది. అందరూ కేక్ కాకుండా ఇంకేం కట్ చేస్తారు అని అంటుంది. దానికి సౌర్య ఉండండి తీసుకొస్తా అని వెళ్లి బన్ తీసుకొని వస్తుంది. అందరూ షాక్ అవుతారు. దీప ఇబ్బందిగా ఫీలవుతుంది. 


సౌర్య: తాతయ్య చూశావా బర్త్‌డే కేక్ అంటే ఇది.
పారిజాతం: ఇదా చిన్న రొట్టె ముక్క పట్టుకొని కేక్ అంటావ్ ఏంటి.
సౌర్య: రొట్టె కాదు ఇది నా బర్త్‌డే బన్ కేక్. నా పుట్టిన రోజుకి మా అమ్మ నాతో ఇదే కట్ చేయిస్తుంది. మా అమ్మ పుట్టినరోజుకు నేను తప్ప ఎవరూ లేరు కదా. అందుకే మా అమ్మ కోసం ఈ బన్ కొని తెచ్చాను. అమ్మ రా అమ్మ నువ్వు జో కలిసి కట్ చేద్దువు..
దీప: సౌర్య పద మనం ఇంటికి వెళ్దాం. అమ్మా నేను తర్వాత వచ్చి కేక్ కట్ చేస్తా.. 
సుమిత్ర: మేం అడిగామా.. ఓసేయ్ అమ్మమ్మ అన్నీ కబుర్లు చెప్పావ్ ఇది చెప్పలేదు ఎందుకే.. మీ ఊరిలో మీకు ఎవరూ లేరు. కానీ ఇక్కడ మీ కోసం ఓ కుటుంబమే ఉంది. మాతో చెప్పకుండా మీరు అనాథల్లా పుట్టినరోజు చేసుకుందాం అనుకున్నారా. అలా చేసుకోవడం నేను చూసుంటే ఇద్దరికీ చెరొకటి పడేది. నువ్వురా దీప కేక్ కట్ చేద్దువు గాని..
దీప: వద్దమ్మ.. 
పారిజాతం: సుమిత్ర ఈ రోజు దీప బర్త్‌డే అయితే అవొచ్చు కానీ ఇలా ఇద్దరినీ ఒకే కేక్ కట్ చేయించడం నాకు నచ్చలేదు.
దశరథ: దీప కూడా నాకు కూతురులాంటిదే పిన్ని..


ఇక దీప జ్యోత్స్నతో కలిసి కేక్ కట్ చేస్తుంది. తర్వాత బన్ కట్ చేసి సౌర్యకు తినిపిస్తుంది. ఇక సౌర్య తన తల్లికి బన్ తినిపిస్తుంది. ఇక సౌర్య అమ్మా కార్తీక్‌కు పెట్టమ్మా అంటుంది. దీపతో పాటు అందరూ షాక్ అయిపోతారు. జ్యోత్స్న బావకు నేను పెడతానులే అంటుంది. దీప వెళ్తాను అంటే దశరథ ఆపి సౌర్యని ఇక్కడ స్కూల్‌లో చేర్పించాలి అనుకుంటున్నాం అని చెప్తాడు. దీపని కూడా ఇక్కడే ఉండిపోమని చెప్తాడు. 


దీప: లేదండి.. జ్యోత్స్న పుట్టిన రోజు అని ఆగాను లేదంటే నేను వెళ్లిపోయేదాన్ని. 
జ్యోత్స్న:  దీపక్క నిన్ను పంపాలి అని మేం అయితే అనుకోవడం లేదు. ఇక్కడ చదువుకుంటే పాప భవిష్యత్ బాగుంటుంది. నువ్వు కూడా ఇక్కడ మాతో పాటు ఉండి నీకు నచ్చిన పని చేసుకోవచ్చు.
దీప: లేదు జ్యోత్స్న ఊరిలో నాకు కొన్ని పనులు ఉన్నాయి వెళ్లాలి.
సుమిత్ర: వెళ్లడం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు గుడికి వెళ్దాం. కార్తీక్ పద..


మరోవైపు నర్శింహ శోభకు మంచి నీరు అడుగుతాడు. దాంతో శోభ చేతికి గాజులు వేసుకోకుండా వస్తుంది. శోభని గాజులు వేసుకోమని అంటే మా అమ్మ వస్తుంది గాజులు వేస్తుందని అంటుంది. నర్శింహ బయపడి వద్దుంటాడు. దీపని వెళ్లగొడితేనే నీతో ఉంటా అంటుంది. ఇక శోభ ఆ పాప నీ బిడ్డ కాదేమో అని నా అనుమానం అని అంటుంది. దాంతో నర్శింహ దీప తనని ఎక్కడ విలువ లేకుండా చేసిందని తన పని పట్టాలని అంటాడు. 


మరోవైపు అనసూయని పెద్దమనుషులు పిలిచి తన ఇంటిని జప్తు చేస్తామని అమ్మి వచ్చిన డబ్బుతో బాకీలు తీర్చుతామని అంటారు. ఇక అనసూయ ఊరివాళ్లని బతిమాలుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ జాడ కోసం వెళ్తున్న నయనికి గర్భిణిగా మారి డెలివరీ చేయమన్న విశాలాక్షి.. తల లేని దేవతకు పూజ!