Karthika Deepam Idi Nava Vasantham Serial Episode స్వప్న కాశీలు ఆశీర్వాదం కోసం పారిజాతం వాళ్ల దగ్గరకు వెళ్తారు. స్వప్న శ్రీధర్ కూతురని తెలిసిపోతుందని పారిజాతం వాళ్లని తిట్టి పంపేయాలని తెగ ప్రయత్నిస్తుంది. కార్తీక్, దీపలు కూడా వాళ్లని వెళ్లిపోమని అంటారు. ఇక శివనారాయణ స్వప్నని తన తండ్రిని పిలవమని చెప్తాడు. నిజం తెలిసిన అందరూ చాలా టెన్షన్ పడతారు. పారిజాతం ఎంత చెప్పినా శివనారాయణ వినడు. తన మాటే వినమని అంటాడు. ఇంతలో శ్రీధర్ ఇంటికి వస్తాడు.
శ్రీధర్: ఈ ముహూర్తాలు ఫిక్స్ అయిన తర్వాత త్వరగా ఇంటికి వెళ్లాలి. స్వప్నని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. ఈ రోజే వైజాగ్ తీసుకెళ్లిపోతాను. కూతురి పెళ్లి సంగతి దేవుడెరుగు నా రెండో పెళ్లి విషయం బయట పడేలా ఉంది.
కార్తీక్: అమ్మా ముందు మనం లోపలికి వెళ్దాం పద.
కాంచన: ముందు ఈ గొడవ సంగతి తేలనీరా.
కార్తీక్: వాళ్ల గొడవ సంగతి మనకెందుకమ్మా.
స్వప్న: అదేంటి బాస్ అలా అంటున్నావ్. నువ్వు నాకు సొంత అన్నయ్య లాంటి వాడివి ఇలాంటి టైంలో నువ్వు దీప నాకు సపోర్ట్‌గా నిలబడకపోతే ఎలా.
కార్తీక్: మనసులో నీకు నిజం తెలీదు స్వప్న మా అమ్మని నేను బతికించుకోవాలి.
దీప: స్వప్న మనం వెళ్దాం పద.
శివనారాయణ: దీప నువ్వు ఆగమ్మా వీళ్లకి నువ్వు పెళ్లి చేసినా ఇది నా కుటుంబంతో ముడి పడింది. ఈ చిక్కు ముడి నేను జాగ్రత్తగా విప్పకపోతే శివనారాయణ మనవడు ఎవరినో లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ప్రచారం చేస్తారు.
దాసు: మనసులో స్వప్న శ్రీధర్ కొడుకని తెలిస్తే శివనారాయణ ఊరుకోడు ఇప్పుడేం చేయాలి. (ఇంతలో శ్రీధర్ ఎంట్రీ ఇచ్చి స్వప్న వాళ్లని చూసి బిత్తర పోతాడు. ఆయనతో పాటు ఆయన రెండో పెళ్లి గురించి తెలిసిన వాళ్లు షాక్ అయిపోతారు)
స్వప్న: మీరు ఇక్కడి ఎలా వచ్చారు.
కాంచన: ఏరా కార్తీక్.. మీ ఫ్రెండ్‌కి మీ నాన్న కూడా తెలుసా.
కార్తీక్: మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదమ్మా.
కాంచన: మీ నాన్న వస్తే వెళ్లిపోదాం అంటావ్ ఏంట్రా ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కదా.
కార్తీక్: మనసులో నువ్వు అన్యాయం అయిపోతావ్ కదమ్మా.
స్వప్న: నేను ఇక్కడున్నట్లు మీకు ఎలా తెలుసు. కాశీ మీకు ఫోన్ చేశాడా. నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే కాశీని పెళ్లి చేసుకున్నా.
శ్రీధర్: నా కథ క్లైమాక్స్‌కి వచ్చింది నా కూతురి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరిగేలా ఉంది.
స్వప్న: నేను ఎవరో తెలీక ఇక్కడ రకరకాలుగా మాట్లాడుతున్నారు. తక్కువ చేస్తున్నారు. మీరే చెప్పాలి.
శివనారాయణ: ఏంటమ్మా నేను మీ నాన్నకి ఫోన్ చేయమంటే అతనితో మాట్లాడుతున్నావ్. ఈయన మీ నాన్నకి ఫ్రెండ్‌నా.
స్వప్న: మా నాన్నకి ఫ్రెండ్ కాదు తాతయ్య గారు ఇతనే మా నాన్న. నేను దారిన పోయిన మనిషిని కాదు స్వప్న నా కూతురని అందరికీ చెప్పు డాడీ.
కాంచన: రేయ్ మీ ఫ్రెండ్ మీ నాన్నని పట్టుకొని డాడీ అంటుందేంటిరా.
కార్తీక్: ఏం లేదమ్మా నువ్వు ఏం జరిగినా ధైర్యంగా ఉండు.
శివనారాయణ: ఏంటమ్మా మీ నాన్నకి ఫోన్ చేయ్ అంటే మా అల్లుడిని పట్టుకొని డాడీ అంటావేంటి.
స్వప్న: మీ అల్లుడు గారా.
శివనారాయణ: ఏం అల్లుడు గారు మాట్లాడరేంటి ఈ అమ్మాయి మిమల్ని డాడీ అంటుంది. ఓహో అందర్ని అంకుల్ అని పిలిచినట్లు ఈ మధ్య డాడీ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయిందా.
స్వప్న: తాతయ్య గారు మీరు ఏదో తమాషా చేస్తున్నారు. ఈయనే మా ఫాదర్ పేరు శ్రీధర్.
సుమిత్ర: అన్నయ్యని పట్టుకొని ఫాదర్ అంటుందేంటండి.
స్వప్న: అన్నయ్యా.. డాడీ మీకు చెల్లి ఉందా.
కాంచన: చెల్లే కాదు భార్య కూడా ఉంది. ఏవండీ ఆ అమ్మాయి మిమల్ని ఫాదర్ అంటుందేంటి అసలేం జరిగింది కాస్త అర్థమయ్యేలా చెప్పండి.
కార్తీక్: మనసులో.. నీకు ఇది డెడ్ ఎండ్ నాన్న నో అదర్ ఆప్షన్ ఒప్పుకోవాల్సిందే.
పారిజాతం: దీప అంతా నాశనం చేశావే.
స్వప్న: వీళ్లందరికీ ఏమైంది డాడీ మీరు ఈ ఇంటి మనిషి అన్నట్లు మాట్లాడుతున్నారేంటి. మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు కదా. (గోడ మీద ఫొటో చూసి బిత్తర పోతుంది)
కార్తీక్: చూసేసింది ఇప్పుడు స్వప్నకి ఓ క్లారిటీ వస్తుంది. దేవుడా అమ్మకి మాత్రం ఏం కాకుండా చూడు.
స్వప్న: ఆ ఫ్యామిలీ ఫొటోలో మీరు ఉన్నారేంటి.
శివనారాయణ: మా ఫ్యామిలీ కాబట్టి. అతను నా అల్లుడు తను నా కూతురు అతని భార్య. వీడు కార్తీక్ వీళ్ల కొడుకు. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు.
స్వప్న: ఏంటి డాడీ ఇదంతా. వీళ్లు చెప్పేది నిజమా.
శివనారాయణ: ఇక చాలు ఆపు. ఏంటి అల్లుడు గారు ఇదంతా ఈమె నిన్ను డాడీ అంటుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు.
స్వప్న: మీలా ఇంకెవరైనా ఉన్నారా,. ఆ ఫోటోలో ఉన్నది మీరేనా. నాకు ఏం అర్థం కావడం లేదు డాడీ. కార్తీక్ మా అన్నయ్యా.. నీకు ముందే పెళ్లి అయిందా.
శివనారాయణ: ముందు లేదు వెనక లేదు ఒక్కటే పెళ్లి అది నా కూతురితో అయింది. పారిజాతం చెప్పింది నిజమే నువ్వు ఎవరో పద్ధతి లేని అమ్మాయిలానే ఉన్నావ్. అవును నువ్వు మా అల్లుడినే డాడీ అనిపిలిచావా ఇలా ఇంకెవరినైనా పిలుస్తుంటావా.
శ్రీధర్: మామయ్య గారు నా కూతుర్ని ఏమీ అనకండి.
కాంచన: మీ కూతురా.
శ్రీధర్: అవును కాంచన స్వప్న నా కూతురే.
శివనారాయణ: మీ కూతురు అంటే అనాథని చేరదీశారా.
స్వప్న: నేను అనాథని కాదు మా అమ్మ పేరు కావేరి.
శ్రీధర్: నన్ను క్షమించండి మామయ్య కావేరి నా రెండో భార్య. ఈ స్వప్న నాకు కావేరికి పుట్టిన బిడ్డే.
శివనారాయణ శ్రీధర్‌ని కొడతాడు. స్వప్న డాడీ అంటే ఆ పిలుపు కూడా నా ఇంట్లో వినడానికి వీలు లేదు ఎవడు నీకు డాడీ అని అడుగుతాడు. ఇక శ్రీధర్ మామ కొట్టిన దెబ్బకు వెళ్లి కాంచన కాళ్ల మీద పడతాడు.
కాంచన: మీరేనా ఇలాంటి పని చేసింది. మీరేనా నన్ను మోసం చేసింది.
శ్రీధర్: నన్ను క్షమించు కాంచన.
కార్తీక్: నాన్న మీరు ఇంకెం మాట్లాడకండి. జరిగింది చాలు. అమ్మా ప్లీజ్ ఏడవకు.
శివనారాయణ: నువ్వే గెలిచావురా దాసు. ఏ తప్పు చేశావని నిన్ను ఇంటి నుంచి గెంటేశానో. అంతకు పెద్ద తప్పు చేసిన నా అల్లుడు అక్రమ సంతానంతో నీ కొడుకుకి పెళ్లి చేసి నా మీద నువ్వే గెలిచావురా.
స్వప్న: నేను అక్రమ సంతానం కాదు తాతయ్య గారు.
శివనారాయణ: నోర్ముయ్ తాతయ్య అన్నావంటే ఊరుకోను.
శ్రీధర్: మామయ్యగారు
శివనారాయణ: చచ్చిపోయాడు. నీ మామయ్య ఈరోజుతో చచ్చిపోయాడు. నీ చేతలతో నువ్వే చంపేశావ్. నా కూతురు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ప్రాణం అనుకున్న నా ఇంటి గౌరవాన్ని ఒకేసారి చంపేశావ్. తప్పు చేసిన వాళ్లకి తప్పుడు మనుషులకు నా ఇంట్లో చోటు లేదు బయల్దేరండి. బయటకి పోరా కుక్క. మళ్లీ జీవితంలో నీ ముఖం నాకు చూపించకు.
ఇంటిళ్లపాది ఏడుస్తూ కూర్చొంటారు. అందర్ని శివనారాయణ ఇంటి నుంచి వెళ్లిపోమని అంటాడు. ఆశీర్వాదం కోసం వస్తే ఇలా జరిగింది రాకుండా ఉండాల్సిందని కాశీ అనుకుంటాడు. శ్రీధర్ బాధగా వెనుదిరుగుతాడు. దాసు కాశీని వెళ్దామని అంటాడు.. స్వప్నని తీసుకొని కాశీ వెళ్లిపోతాడు. తల్లి కొడుకులు ఒకర్ని ఒకరు పట్టుకొని ఏడుస్తారు. కార్తీక్ తల్లిని తీసుకొని ఏడుస్తారు. దీప కూడా వెళ్లిపోతుంది. సుమిత్ర భర్తని పట్టుకొని ఏడుస్తుంది. జ్యోత్స్న కూడా ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. శివనారాయణ కూడా ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: ఒళ్లంతా రక్తం.. తండ్రి చేతికి గన్ ఇచ్చి తనని చంపేయ్‌మన్న క్రిష్.. సత్య మీద ఫైర్!