Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాశీ కోసం స్వప్న చేయి కోసుకుంటుంది. స్వప్నని శ్రీధర్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. స్వప్నకి ప్రమాదం ఏం కాలేదని డాక్టర్ చెప్తారు. ఇక శ్రీధర్ భార్యకి కాల్ చేసి స్వప్న బాగానే ఉందని చెప్తాడు. కావేరితో మాట్లాడుతూ బయటకు వెళ్లి కార్తీక్‌ని చూస్తాడు.
శ్రీధర్: వీడు ఇక్కడికి వచ్చాడేంటి. స్వప్న దగ్గర ఫోన్ కూడా లేదు కదా మరెలా తెలుస్తుంది. లేచి నడుస్తున్నాడు కదా డాక్టర్ చెక్అప్ కోసం వచ్చి ఉంటాడు. వీడు హాస్పిటల్‌లో ఉన్నంత వరకు నేను స్వప్న దగ్గరకు వెళ్లకూడదు. లేదంటే నేనే స్వప్న తండ్రి అని తెలిసిపోతుంది. అనుకుంటూ పరుగులు తీస్తాడు. ఇంతలో దీప వస్తుంది. కాశీ దీపని పిలుస్తాడు.
దీప: ఇప్పుడు స్వప్నకి ఎలా ఉంది. అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లావ్. తొందరపడొద్దని కార్తీక్ బాబు చెప్పారు కదా. ప్రేమ ప్రేమ అని ఆ పిల్లని చంపేస్తావా.
కాశీ: నీకు దండం పెడతా అక్క ముందు స్వప్నకి ఎలా ఉందో చూడు.
దీప: శ్రీధర్‌ని చూసి.. ఈయనేంటి కూతురి దగ్గర లేకుండా ఇక్కడ ఫోన్ మాట్లాడున్నాడు.
కార్తీక్: మీరెందుకు వచ్చారు నేను ఒక్కడినే హాస్పిటల్‌కి వెళ్తా అని చెప్పా కదా ఈ మధ్య మా అమ్మకి అతి జాగ్రత్త ఎక్కువ అయి అందర్ని ఇబ్బంది పెడుతుంది. నాకు అంతా బాగానే ఉంది పదండి ఇంటికి వెళ్దాం.
దీప: నేను వచ్చింది మీ కోసం కాదు బాబు. మీ చెల్లి కోసం. స్వప్నతో మాట్లాడటానికి కాశీ స్వప్న ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ మీ నాన్నకి దొరికిపోయారు. పెద్ద గొడవ. గొడవలో మీ చెల్లి కాశీ లేకపోతే చచ్చిపోతా అని కత్తి తీసుకొని చేయి కోసుకుంది. ఇప్పుడు ఇక్కడే ఉంది. కాశీ ఫోన్ చేస్తే వచ్చా.
కార్తీక్: వాడు ఎక్కడున్నాడు.
దీప: మీ నాన్న గారు కొట్టారులెండీ మీరు కొట్టొద్దు.
కార్తీక్: కొట్టడం కాదు. వాడికి అసలు బుద్ధి ఉందా.
దీప: నేను తిట్టాను బాబు మనం వెళ్లి స్వప్నని చూద్దాం పదండి.
కార్తీక్: మా నాన్న ఉన్నాడు కదా ఇంకేం వెళ్తాం.
దీప: నేను చూస్తాను మీరు వెళ్లండి. ఇక దీప కాశీకి కాల్ చేసి నేను స్వప్నని కలవాలి అంటే నువ్వు వెళ్లి స్వప్న తండ్రితో మాట్లాడు. నేను చెప్పే వరకు అక్కడే ఉండు.
శ్రీధర్: ఓరేయ్ దరిద్రుడా నువ్వు ఇక్కడికి దాపరించావా. నీకు నా కూతురు తప్ప ఇంకెవరూ దొరకలేదా.
దీప: నీకు రెండు తిట్లు పడితే తప్ప నువ్వు చేసిన తప్పు అర్థం కాదు.
కార్తీక్: స్వప్న కొంచెం బలంగా కోసుకోవచ్చు కదా.
స్వప్న: ఆ చాకు షార్ప్‌గా లేదన్నయ్య.
కార్తీక్: ఇంటికి వెళ్లేటప్పుడు రెండు చాకులు పట్టుకెళ్లు.
స్వప్న: అది సరే నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు.
దీప: నేనే చెప్పా. కాశీ నాకు కాల్ చేశాడు.
కార్తీక్: వాడొకడు తయారయ్యాడు దీని ప్రాణానికి.
స్వప్న: కాశీని ఏం అనొద్దన్నయ్య.
కార్తీక్: మరి ఎవర్ని అనాలి.
స్వప్న: మా నాన్నని ఇలా జరగడానికి కారణం ఆయనే. మా పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా.
కార్తీక్: ఆయనకు ఏం ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి.
తన తండ్రిని పిలుస్తాను అని మా నాన్నని కన్విన్స్ చేయండని స్వప్న అంటుంది. ఇక కార్తీక్ ఎక్కువ సేపు ఇక్కడ తాను ఉండటం మంచిది కాదని దీపని తీసుకొని వెళ్లిపోతాడు. తనకి కాశీకి పెళ్లి చేస్తాడని అన్నయ్య అంటాడు అనుకుంటే ఇలా జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడేంటని అనుకుంటుంది. ఇక కార్తీక్‌ని వెళ్లిపోమని దీప చెప్పి కాశీకి సైగ చేస్తుంది. ఇక దీప కార్తీక్‌తో మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్తాడు. స్వప్న దగ్గరకు కాశీ వస్తాడు. స్వప్న, కాశీలు ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఇద్దరం పోరాడి మన ప్రేమ గెలిపించుకుందాం లేదంటే ఇద్దరం కలిసి చచ్చిపోదాం అని ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని కాశీ స్వప్నతో చెప్తాడు. మనకు సాయం చేయడానికి దీప, కార్తీక్‌లు ఉన్నారని అంటాడు. దానికి స్వప్న అన్నయ్య మనకు సాయం చేస్తాడనే నమ్మకం లేదని స్వప్న అంటుంది. దానికి కాశీ అలా ఏం లేదు వాళ్లు మన గురించే ఆలోచిస్తారని అంటాడు.
తన తండ్రికి నిజం తెలిసి పోయిందని అందుకే స్వప్నని వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడని ఆ పెళ్లి జరిగితే స్వప్న చనిపోతుందని కార్తీక్ అంటాడు. దానికి దీప మనం కాశీ, స్వప్నల పెళ్లి చేద్దామని అంటుంది. దానికి కార్తీక్ ఒప్పుకోడు. నువ్వు అనుకునేలా నేను చేయలేను అని కొన్ని విషయాలు బయట పడితే కుటుంబాలే నాశనం అయిపోతాయని కార్తీక్ అంటాడు. దానికి దీప ఆ సమస్య నాకు వదిలేయండి అని అంటుంది. ఏం జరిగినా మనం ఎదుర్కొవాలని అంటుంది.
స్వప్నని ఇంటికి తీసుకొని శ్రీధర్ వస్తాడు. శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోమని అంటాడు. ఎల్లుండే పెళ్లి అని చెప్తాడు. నా మాట కాదనకుండా పెళ్లి చేసుకోమని అంటాడు. ఈ సారి కాశీ గుమ్మం దాటి వస్తే పోలీసులకు పట్టిస్తానని అంటాడు. మరోవైపు కాశీ చాటుగా మా మాటలు వింటాడు. ఎలా అయినా పెళ్లి ఆపాలి అని అనుకుంటాడు.. మరోవైపు కాంచన కార్తీక్‌లు శ్రీధర్ కోసం ఎదురూ చూస్తూ ఉంటారు. శ్రీధర్ రావడంతో భోజనం చేయడానికి పిలుస్తుంది కాంచన. ఇంటి గురించి ఆలోచించమని ఆఫీస్ గొడవలే కాదని అంటుంది. కాంచన మీద శ్రీధర్ కస్సుబుస్సులు ఆడుతాడు. మీరు మారిపోయారని కాంచన అంటుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దాంతో శ్రీధర్ మనస్శాంతిగా భోజనం కూడా చేయనివ్వడం లేదని చేయి కడిగేసి వెళ్లిపోతాడు. సమాధానం లేని సూటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ఇలాగే ఉంటుందని అంటాడు కార్తీక్. దానికి కాంచన ఆయన ఏదో టెన్షన్‌లో ఉన్నారని అంటుంది. దానికి కార్తీక్ మనసులో ఆయన రెండో ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి సంతకం చేసిన టీచర్.. మహాకు ట్విస్ట్ ఇచ్చిన సీత, సూర్య నడిచేశాడోచ్!