Karthika Deepam Idi Nava Vasantham Serial Episode తన తండ్రి రెండో పెళ్లి గురించి తన తల్లికి నిజం తెలిస్తే తన తల్లి బతకదని కార్తీక్ దీపతో చెప్తాడు. తన తండ్రి తల్లి మీద చూపించే ప్రేమకు తనకే ఈర్ష్య కలిగేదని, ఓ మంచి భర్త ఎలా ఉండాలని నిద్రలో లేపి అడిగినా మీ నాన్నలా ఉండాలని తన తల్లి తడుముకోకుండా చెప్తుంది. తన దృష్టిలో మా నాన్న దేవుడని కార్తీక్ చెప్తాడు.
కార్తీక్: భరించడానికో సహించడానికో మా నాన్న మామూలు ద్రోహం చేయలేదు దీప. నమ్మకద్రోహం చేశాడు. మనం ఎంత బలంగా నమ్మకం పెట్టుకుంటే జరిగిన మోసానికి అంత బాధ పడతాం. ఇప్పుడు చెప్పు దీప నిజం మా అమ్మకి చెప్పమంటావా. చెప్తే తట్టుకుంటుంది అంటావా.కాంచన: నువ్వు చెప్పకపోయినా నిజం తెలుస్తుందిరా.దీప: మనసులో కాంచన గారు మొత్తం వినేసినట్టున్నారు. కాంచన: ఏంట్రా ఇద్దరూ అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. నిజం ఏదో ఒకరోజు తెలుస్తుంది. కానీ ఆ నిజం ఏంటి. తట్టుకోదు అని తెలిసినా నిజం చెప్పాలి అంటున్నావ్ ఏంటి ఆ నిజం. ఆ విషయం గురించి మీ ఇద్దూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు.దీప: నేను కార్తీక్ బాబుని పెళ్లి గురించి ఆడిగాను. కార్తీక్: పెళ్లి ఎలాగూ వాయిదా పడింది కదా పెళ్లి రెస్టారెంట్ పనులు పూర్తయ్యాక చేసుకుంటా అని చెప్తే జ్యోత్స్న తట్టుకుంటుందో లేదో అని చెప్తున్నా.కాంచన: మళ్లీ మొదటికి వచ్చావ్ ఏంట్రా. ముందు పెళ్లి తర్వాతే ఏమైనా.కార్తీక్: సరే అమ్మా.దీప: మీకు ఒక విషయం చెప్పాలి అమ్మా ప్రమాదంలో కాళ్లు పోయినా గుండె ధైర్యంతో బతకాలి అనే ఆశతో కాళ్లు లేకపోయినా ధైర్యంగా ఉన్నారు. అదే గాయం మనసుకి తగిలితే తట్టుకోగలరా అమ్మకాంచన: తట్టుకోగలను దీప కానీ నా బలం బలహీనత నా భర్త, కొడుకు. వీళ్ల విషయంలో మాత్రం ఏం జరిగినా నేను తట్టుకోలేను. వాళ్లిద్దరూ నాకు ప్రాణం కంటే ఎక్కువ.
పారిజాతం: కాశీ ఇక్కడికి రమ్మన్నాడు లేడు ఏంటి. జ్యోత్స్న: వాడు నిన్ను రమ్మంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావ్. పారిజాతం: వాడు నీ సొంత తమ్ముడే వాడికి అవమానం జరిగితే నీకు జరిగినట్లు కదా.జ్యోత్స్న: ఈ చట్నీ సాంబారు కబుర్లు నా దగ్గర చెప్పకు. వాడికి అవమానం జరిగితే నాకు ఏంటి. వాడికి నాకు సంబంధం ఏంటి. నేను దశరథ్, సుమిత్రల కూతురిని. పారిజాతం: ఆ రకంగా అనుకున్నా నీకు వాడు తమ్ముడే.జ్యోత్స్న: అనుకోవడం ఏంటి నేను వాళ్ల కూతురినే. జరిగింది అంతా మర్చిపో అస్తమానం నువ్వు నా స్థాయిని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇంతలో కాశీ వస్తాడు.కాశీ: నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ నేను అనామకుడిని కాదు నాకు ఓ మంచి కుటుంబం ఉంది అని స్వప్న వాళ్ల నాన్నకి తెలియాలి.పారిజాతం: పారిజాతం రంగంలోకి దిగితే యుద్ధం మొదలైనట్లే. నన్ను ఏమీ అనకపోతేనే నాకు సగం కాలుతుంది. అలాంటిది నా మనవడిని పట్టుకొని అనామకుడు అన్నాడు అంటే వాడికి మంట పెట్టాల్సిందే. పారిజాతం స్వప్న ఇంటిలోకి వెళ్లూ శ్రీధర్‌ని చూసి షాక్ అయిపోతుంది. అల్లుడేంటి ఇక్కడున్నాడు. జ్యోత్స్న: ఏంటి గ్రానీ ఇక్కడ ఆగిపోయావ్.పారిజాతం: ఒక్కసారి అటు చూడు.కాశీ: మా మామయ్య గారిని చూసి మీరు ఎందుకు షాక్ అవుతున్నారు. పారిజాతం: మీ మామగారా.కాశీ: అవును అతనే స్వప్న వాళ్ల నాన్న. జ్యోత్స్న: నాకు ఏం అర్థం కావడం లేదు గ్రానీ.పారిజాతం: నాకు సగం అర్థమైంది. మనవడా పద వెళ్దాం.కాశీ: ఆవేశం ఏదో అన్నావ్ ముందుకు కాకుండా వెనక్కి వెళ్తున్నావ్.. అదిగో ఆవిడే మా అత్తయ్యగారు.పారిజాతం: ఇందాక నాకు సగం అర్థమైంది అన్నాను కదా ఇప్పుడు పూర్తి అర్థమైంది. కాశీ నువ్వు వెళ్లరా మేం మాట్లాడుతాం. అని బలవంతంగా కాశీని పంపేస్తుంది. శ్రీధర్: సరే బేబీ నేను ఇక వెళ్తా.కావేరి: నా పరిస్థితి నీకు తెలుసు కదా త్వరగా రా బేబీ.జ్యోత్స్న: గ్రానీ విన్నావా బేబీ అంట. పారిజాతం: మనవడి లవ్ స్టోరీ కంటే అల్లుడు లవ్ స్టోర్ అదుర్స్. అల్లుడూ నువ్వు ఇంత గుండెలు తీసిన బంటువి అనుకోలేదు అల్లుడూ. నీకు ఇళ్లు ఆఫీస్ తప్ప వేరే ప్రపంచమే తెలీదు అనుకున్నా అబ్బా..జ్యోత్స్న: ఇళ్లు ఆఫీస్‌తో పాటు మామయ్యకి ఓ చిన్న ఇళ్లు భార్య కూతురు కూడా ఉన్నారు. మరీ ఇంత మోసమా నాకు అయితే నర్శింహ గాడు గుర్తొచ్చాడు బావ.
పారిజాతం ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పొద్దని అంటుంది. జోత్స్న మాత్రం తాతకి చెప్పేస్తాను అని అంటుంది. పారు ఆపి మీ తాతకి నిజం తెలిస్తే ఊరుకోడని కార్తీక్‌తో నీ పెళ్లి అవ్వదని జ్యోత్స్నని తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ మెల్లగా నడుస్తాడు. దీప వచ్చి మెల్లగా నడవమని అంటుంది కాంచన కూడా కార్తీక్ నడుస్తుంటే సంతోషంగా ఉంటుంది. కార్తీక్ బాబు పూర్తిగా నడుస్తున్నాడని ఇక పెళ్లికి సిద్ధమని చెప్పమని కాంచనతో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.