Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప దగ్గరకు జ్యోత్స్న వెళ్లి తన బావకు దగ్గర అవ్వడానికే ప్లాన్స్ వేస్తున్నావని, పెద్ద జాణవే నువ్వు అని అనడంతో దీప జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. నా మీదకే చేయి ఎత్తుతావే అని జ్యోత్స్న అడిగుతుంది. హద్దు దాటి మాట్లాడితే చెంప పగల గొడతాను అని అంటుంది దీప.
దీప: నేను ఇక్కడికి వచ్చింది వంట పని చేయడానికి నువ్వు అనుకున్న పని చేయడానికి కాదు. నీ స్థానంలోకి రావాలి అనుకుంటున్నా అని నువ్వు ఎలా అనుకుంటావ్. అసలు నీకు నాతో పోలిక ఏంటి జ్యోత్స్న నువ్వు ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నావ్. నా జీవితంలో నా కూతురికి తప్ప ఎవరికీ స్థానం లేదు. ఇదంతా నేను నేను చావకుండా నన్ను కాపాడిన కార్తీక్ బాబుకి నేను చూపిస్తున్న కృతజ్ఞత ఇది. నువ్వు ఇలాగే ఉంటే నీ పనుల వల్లే నువ్వు నీ బావని కోల్పోతావు. ఇప్పటికీ నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే అది నీ ఖర్మ. పద్ధతి మార్చుకో జ్యోత్స్న. లేదంటే జరిగే దాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. నువ్వు వెళ్లు నేను వంట చేసుకోవాలి.
దీప: కాశీ ఇంటికి రావడంతో.. కాశీ కార్తీక్ బాబుని కలవాలి అని నాకు ఎందుకు కాల్ చేశావ్.
కాశీ: అక్క బావని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విషయం నీతో చెప్పాలి అనుకున్నా. నువ్వు ఇక్కడున్నావ్ అని తెలిసి ఇక్కడికే వచ్చాను. బావ దగ్గరకు వెళ్దాం పదక్కా.
దీప: కాశీ నువ్వు ఏం మాట్లాడినా ఇంట్లో ఎవరికీ తెలీకూడదు. నీకు నాకే కార్తీక్ బాబు మధ్యనే ఉండాలి. కాశీ నీకు జ్యోత్స్న తండ్రి తెలుసా.
కాశీ: తెలుసక్కా.
దీప: నేనేంటి శ్రీధర్ గారి గురించి ఆలోచించకుండా కాశీని ఇంటికే పిలిచేశాను.
కార్తీక్: కాశీ నువ్వేంటి ఇంత సర్‌ఫ్రైజ్ ఇచ్చావ్ అడ్రస్ ఎలా తెలిసింది.
కాశీ: అక్క చెప్పింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు స్వప్న వాళ్ల నాన్న నాకు కాల్ చేశారు బావ. ఆయన ఎవరినీ కలవలేదు.
కార్తీక్: ఎవరినీ కలవలేదు అంటే కాశీకి నిజం తెలీదు.
కాశీ: ఇంకోసారి నా కూతురిని కలిశావు అంటే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
కార్తీక్: అదేంటి వాళ్ల నాన్న పెళ్లికి ఒప్పుకున్నారని నీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నారని స్వప్న నాకు కాల్ చేసింది కదా.
కాశీ: అవునా. నాకేం అర్థం కావడం లేదు బావ. ఆయన ఎందుకు నన్ను కలవలేదు. ఎందుకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు.
కార్తీక్: స్వప్న ఫోన్ కూడా స్విఛ్ ఆప్ వస్తుంది. ఒప్పుకున్నవారు ఎందుకు వార్నింగ్ ఇస్తారు.
కాశీ: నేను ఇప్పుడు ఇలాగే ఉంటే స్వప్నని నా నుంచి దూరం చేస్తారు. నేను ఎదో ఒకటి చేయాలి.
కార్తీక్: ఏదో ఒకటి చేయాలి అంటే నా దగ్గరకు ఎందుకు వచ్చావ్. అవతల అమ్మాయి వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి కాశీ.
కాశీ: ఒకసారి మనం స్వప్న ఇంటికి వెళ్దామా బావ.
కార్తీక్: నువ్వు ఎంత అవుట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నావ్ అంటే నేను పేషెంట్ అని మర్చిపోయి నన్ను రమ్మని పిలుస్తున్నావ్.
కాశీ: సారీ బావ నేను మిమల్నే నమ్ముకున్నాను ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరే మా పెళ్లి చేయాలి.
కార్తీక్: ఇదీ పరిస్థితి దీప. నాన్న కాశీని కలవలేదు అంటే మా నాన్నకి నిజం తెలిసిపోయింది. అందుకే స్వప్నని హౌస్ అరెస్ట్ చేసి వేరే పెళ్లి చేయాలి అనుకున్నాడు.
జ్యోత్స్న తన మీద దీప చేయి ఎత్తిందని ఇంట్లో వాళ్లకి చెప్తుంది. ఇంటి వారసురాలిని ఇప్పటి వరకు మనమే ఏం అనలేదు అలాంటిది దీప చేయి ఎత్తిందంటే మీరు ఎవరూ ఏం మాట్లాడరేంటి అని పారిజాతం ఇంట్లో వాళ్లని ప్రశ్నిస్తుంది. నువ్వు ఏదో అనకపోతే దీప నిన్ను ఏం అనదని అంటారు. మమ్మీ మాటలు వింటుంటే నేను కన్నకూతురో దీప కన్న కూతురో అర్థం కావడం లేదని అంటుంది.
జ్యోత్స్న: చెప్పు మమ్మీ నీ కన్న కూతురు నేనా ఆ దీపా.
సుమిత్ర: అసలు కూతురు ఎవరో నీకు తెలీదా.
జ్యోత్స్న: తెలుసు. నేను అయితే మీ అసలైన కూతుర్ని కాదు. మరి మీరు నన్ను అలా చూడటం లేదు కదా.
దశరథ్: నీకు ఏదైనా బాధ ఉంటే అర్థం చేసుకోవడానికి మేం ఉన్నాం అమ్మ.
సుమిత్ర: దీప ఏ తోడు లేని మనిషి అని మేం జాలి పడ్డాం. కానీ నువ్వు ఈ ఇంటి మనిషివి మా వారసురాలివి. ప్రేమతో కోప్పడ్డా ప్రాణంగా చూసుకున్నా అంతా నువ్వే కదా.
జ్యోత్స్న: అయితే మీరు నా పెళ్లి గురించి ఆలోచించండి.
దశరథ్: నిశ్చితార్థం, పెళ్లి ఆగిపోవడంతో నువ్వు ఎంత బాధ పడుతున్నావో మాకు తెలుసు కార్తీక్ కోలుకోగానే నీ పెళ్లి చేస్తాం.
శ్రీధర్ స్వప్నని హౌస్ అరెస్ట్ చేస్తాడు. రాత్రి కాశీ స్వప్నని కలవడానికి వచ్చి చాటుగా స్వప్న ఇంటి గోడ ఎక్కి ఎవరూ చూడకుండా స్వప్నని కలుస్తాడు. మమ్మీ డాడీ చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని వెళ్లిపోమని చెప్తుంది. దీప, కార్తీక్‌లను కలిశాను అని ధైర్యం చెప్పారని అంటాడు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు డాడీ బాగే ఉన్నారని తిరిగి వచ్చాక అంతా తారుమారు అయ్యిందని చెప్తుంది. ఇక కాశీ తన నానమ్మని తీసుకొస్తానని పారిజాతం వస్తే ఒప్పుకుంటారని అంటాడు కాశీ. ఇక కావేరి రావడం చూసి కాశీ దాక్కుంటాడు. కావేరి మొత్తం చెక్ చేసి స్వప్నని తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ కాశీ గురించి ఆలోచిస్తాడు. దీప కార్తీక్‌కి ధైర్యం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.