Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాంచన శ్రీధర్‌ని కార్తీక్, దీపలను ఆశీర్వదించడానికి రమ్మని పిలుస్తుంది. ఇక అనసూయ కావేరి దగ్గరకు వెళ్లి మగాడు రెండో పెళ్లి చేసుకున్నా చెడు తిరుగులు తిరిగినా వాళ్లు పరువు పొగొట్టుకున్నా పట్టించుకోరని వస్తే మాత్రం నిన్ను రెండో పెళ్లి చేసుకున్నావని అందరూ అంటారని నీ పరువు పోతుందని చెప్తుంది. ఒక ఆడదానిలా నువ్వు రాకపోవడమే బెటర్ అని అంటుంది. 


కావేరి: వ్రతానికి మీరు వెళ్తారా.
శ్రీధర్: కార్తీక్ తండ్రిగా మీరు వస్తారు అని చెప్పింది కదా అంటే అర్థమేంటి వెళ్లకపోతే నేను కార్తీక్ తండ్రి కాదు అని. అందుకే వెళ్తాను.
దీప: నేను పెట్టిన షరతుకి మీ మనసు ఎంత బాధ పడుతుందో నాకు తెలుసు మీరు మీ ఆత్మాభిమానం పక్కన పెట్టి మీ భర్తను పిలవరు. ఇక ఈ వ్రతం జరగదు. ఇది జరగపోతే మీరు మా అత్త నన్ను ఏ విషయానికి ఇబ్బంది పెట్టరు.


శౌర్య చాలా బట్టలు కొనుక్కొని చక్కగా రెడీ అయి అని చెప్తుంది. దీపకి చూపించి ఎవరు కొన్నారని అంటే కొత్త నానమ్మ కొనిందని చెప్తుంది. రేపు వ్రతానికి ఏం డ్రస్ వేసుకోవాలని అడుగుతుంది. మరోవైపు కుబేర గురించి తెలుసుకోవడానికి పెన్సిల్ స్కెచ్ తీసుకొని తిరుగుతుంటాడు. ఎక్కడున్నావయ్యా ఆ రోజు నువ్వు తీసుకెళ్లింది అనాథని కాదు కోటీశ్వరుడి కూతురిని అని అంటాడు.  ఎలా అయినా పట్టుకుంటానని అంటాడు. దీప శౌర్యని పిలిచి ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. దానికి శౌర్య బయటకు వెళ్లారని చెప్తుంది. ఇంతలో కాంచన వాళ్లు వస్తారు. 


దీప: ఎక్కడికి వెళ్లారు అత్తయ్య.
అనసూయ: నీ కోరిక తీర్చడానికే. వ్రతం కోసం నువ్వు చేయాలి అంటే ఓ కోరిక కోరావు కదా.
కాంచన: నా కోడలి కోరిక తీర్చడానికి నేను ఏమైనా చేస్తా రేపు గుడిలో నువ్వు, కార్తీక్ వ్రతం చేస్తారు. ఆ వ్రతంలో మీ దంపతుల్ని దీవించడానికి మా దంపతులు వస్తారు.
అనసూయ: ఏంటే అర్థం కాలేదా మీ అత్తయ్యగారు నీ కోసం తన ఆత్మాభిమానం పక్కన పెట్టి మీ మామయ్యని పిలిచారు ఆయన వస్తారు వ్రతం జరుగుతుంది.
శౌర్య: నేను చెప్పినా అమ్మ నమ్మలేదు.
కార్తీక్: అమ్మ నమ్మదులే రౌడీ ఇప్పట్లో తేరు కోవడం కూడా కష్టమే
అనసూయ: ఇక మీ ఏర్పాట్లో మీరు ఉండండి అమ్మ తాను వ్రతం చేస్తుంది. 


దీప ఒంటరిగా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అనసూయ వచ్చి ఇక్కడేం చేస్తున్నావ్ దీప రా భోజనం చేద్దువు అని అంటుంది. వ్రతం చేసుకోవాలి అంటే మామయ్య రావాలి అని షరుతు పెట్టావని అన్నావ్ కదా అని అంటుంది. దానికి దీప అలా అయితే ఈ వ్రతం ఆగిపోతుందని అనుకున్నాను అని దీప అంటుంది. తన ఆత్మాభిమానం పంతం పక్కన పెట్టి మరి భర్తని పిలిచిందంటే కాంచన గారు కార్తీక్ జీవితం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారని అర్థం అని  నీకు ఇంకా అర్థం కాలేదా అని అనసూయ దీపతో చెప్తుంది. అందరూ నీ మంచి కోసం నీ బిడ్డ కోసం అంత చేస్తుంటే భగవంతుడు ఇచ్చిన బంధాన్ని తీసుకొని పాపిటిలో సింధూరం పెట్టుకొని సంతోషంగా ఉండక ఏంటే నీ బాధ అని అంటుంది.


దీప: మనం మంచిగా ఉంటే చాలా మనకు మంచి జరిగితే చాలా. మనల్ని నమ్ముకున్న వాళ్లు ఏమైపోయినా పర్లేదా
అనసూయ: వాళ్ల ఇద్దరికీ రాత లేదే వదిలేయ్. నీకు బుర్ర పని చేస్తే నువ్వు పూజించాల్సింది కార్తీక్‌బాబుని నర్శింహ నుంచి కాపాడారు. నీ మెడలో తాళి కట్టి నీ జీవితం కాపాడారు. ఇంక అందరి గురించి ఆలోచించి నువ్వు వాళ్లని దూరం పెట్టడం పాపమే. కాంచన గారికి కొడుకు సంతోషం తప్ప ఇంకేం కోరికలు లేవే. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండవే. 
దీప: భార్యగా కార్తీక్ బాబు పక్కన కూర్చొడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు అత్తయ్య. ఏదో తప్పు చేసినట్లు ఉంది.
అనసూయ: అలా అనుకోకే మనం చూసిన కష్టాలు కన్నీళ్లను పోల్చితే అసలు ఇవి లెక్కలోకి రావే. నువ్వు అన్నీ మర్చిపోయి నీ బిడ్డ భవిష్యత్ కోసం ఆలోచించు. దాన్ని కలెక్టర్ చేయాలి అని అనుకున్నావ్ కదా అది కలెక్టర్ అవుతుందే. మీ నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది. తొందరగా భోజనం చేసి పడుకోవే ఉదయం వ్రతం ఉంది. అమ్మానాన్న వ్రతం చేసుకుంటారని అది సంతోషపడుతుంది. దాని కోసం అయినా నువ్వు వ్రతం చేయవే. రా.


దాసుకి పారిజాతం కాల్ చేస్తుంది. నీతో ఓ విషయం చెప్పాలని అంటుంది. దానికి ఈ రోజు కుదరదు అని దాసు అంటాడు. వ్రతం ఉందని అంటే కాశీ, స్వప్నలకు వ్రతమా అని అంటాడు. దానికి దాసు కాశీ వాళ్లకి వ్రతం కాదని దీప వాళ్లది చెప్తే అరుస్తుందని అబద్ధం చెప్తాడు. పారిజాతాన్ని రెచ్చగొట్టాలని కాశీ ఫోన్ తీసుకొని వ్రతం దీపక్కది కార్తీక్ బావది అని చెప్తాడు. పారిజాతం షాక్ అయిపోతుంది. ఎంతకు తెగించారా అని తిడుతుంది. ఇక కాశీ ఫోన్ కట్ చేసేస్తాడు. కార్తీక్ గుడి వెళ్లడానికి రెడీ అవుతుంటే దీప వెళ్లి మీతో వ్రతం చేయలేను మీరు ఎలా అయినా ఆపాలి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌తో వ్రతం చేయాలి అంటే శ్రీధర్‌ మామయ్య రావాల్సిందే.. కోడలి కోసం సవతి గడప తొక్కిన కాంచన!