Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ దీపని తీసుకొని ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అమ్మా అని శౌర్య ఏడుస్తుంది. నేనేమైనా తప్పు చేశానా కోపం ఉంటే నన్ను కొట్టు అమ్మా అని అంటుంది. ఇక సారీ చెప్తుంది పాప. నాకు నువ్వు కావాలి కార్తీక్ కావాలి మీ ఇద్దరూ నాకు కావాలమ్మా మీ ఇద్దరిలో ఎవరూ దూరం అయినా నేను ఏడుస్తానని పాప అంటుంది. దానికి అనసూయ పాప కోసమే బతుకుతా అంటావు కదే మరి దాన్ని ఏడిపిస్తావెందుకు అది ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో చెప్పింది కదా చేయొచ్చు కదా అంటుంది. 


ఇక కార్తీక్ పాపని లోపలికి పంపేసి దీప అత్త వాళ్ల ఇంటికి వెళ్లిందని క్షమించమని అడగటానికి వెళ్లిందని చెప్తాడు. మనల్ని పద్ధతిగా పొమ్మన్నారు దీపని మర్యాదగా గెంటేశారు అని చెప్తాడు. ఆ మనుషులతో నీకేంటి దీప నువ్వు ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు.


దీప: ఎందుకంటే మాట ఇచ్చింది నేను బాబు ఆ బాధ మీకు తెలీదు. మీకు మీ మరదలికి పెళ్లి చేస్తానని సుమిత్రమ్మకి, పారిజాతం గారికి, జ్యోత్స్ననికి మాటిచ్చాను. కానీ ఇలా జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మోసం చేసిన మనిషిలా అవకాశవాదిగా మిగిలిపోయాను. సూటిగా వాళ్ల వైపు చూడలేకపోతున్నాను.
కార్తీక్: అంత తప్పు నువ్వేం చేయలేదు దీప నా ఇష్టంతో నా స్వార్థంతో నేను నీ మెడలో తాళి కట్టాను. శౌర్య కోరుకునే మంచి తండ్రిగా మిగిలిపోవాలనుకుంటున్నా. నా స్వార్థం తప్పు అయితే నేను తప్పు చేశాను నువ్వు కాదు క్షమాపణ చెప్పాల్సి వస్తే నేను చెప్తా. నువ్వు ఈ ఇంటి మనిషివి దీప. నా పరువే నీ పరువు. నీ మర్యాదే నా మర్యాద.
దీప: వద్దు బాబు నాతో పాటు మిమల్ని కలుపుకొని మీ పరువు తీయలేను. ఆస్తులు లేకపోయినా ఆత్మాభిమానంతో బతికాను అది నిన్నటితో గంగలో కలిసిపోయింది. మోయలేనంత బరువు నా మెడలో వేశారు ఈ జన్మకి నాకు ఈ శిక్ష చాలు. నాకు సెలవు ఇప్పించండి నేను వెళ్తాను.
కాంచన: దీప నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. అత్తగారిగా చెప్తున్నా ఈ ఇంటి గడప దాటి నువ్వు వెళ్లడానికి వీళ్లేదు. దాటి వెళ్లాలని నువ్వు అనుకుంటే నిన్ను ఆపడానికి నీ కూతురు నీ భర్తతో పాటు నీ అత్తగారిలా నేను ఉంటాను. 
దీప: నేను పూజించే మనుషుల్ని నన్ను బంధువుల్ని చేయొద్దమ్మ.
అనసూయ: మన ఊరి ముత్యాలమ్మ నీకు ఈ అదృష్టం ఇచ్చిందనుకోవే. నీ జీవితానికి ఇది నవ వసంతమే. నీ బతుకులో మళ్లీ నువ్వే దీపం వెలిగించుకో. నీ ఈ నవవసంతాన్ని శివుడి ముందు నైవేద్యం పెట్టే కార్తీకదీపం చేసుకో. 
కాంచన: అనసూయ నీ కోడలిని కూతుర్ని చేసి నువ్వు నాకు కోడల్ని చేశావ్ ఎవరూ ఎక్కడికి వెళ్లరు మనం అంతా ఒకే కుటుంబం అందరూ ఈ ఇంట్లోనే కలిసే ఉంటాం. ఉంటున్నాం అంతే. 
కార్తీక్: ఏ జన్మలో ఉన్న బంధమో శౌర్య ద్వారా మనల్ని కలిసింది దీప మనల్ని కలపడానికి కారణం అయిన శౌర్య కోసం అయినా మనం కలిసి ఉందాం. 



కావేరి స్వప్నకి కాల్ చేసి దీప, కార్తీక్‌లు పెళ్లి చేసుకున్నారని జ్యోత్స్న నానమ్మ వచ్చి ఇంట్లో గొడవ చేసిందని చెప్తుంది. ఇక కావేరి దీపకి దూరంగా ఉండమని స్వప్నకి చెప్తే దీప ఇప్పుడు నా అన్నయ్య వదిన అని తనతోనే కలిసి ఉంటానని చెప్తుంది. ఇక స్వప్న కాశీ, దాసులతో వెళ్లి వాళ్లకి విష్ చేద్దామని అంటుంది. ఇక అనసూయ, కాంచనలు కూరగాయలు కట్ చేస్తూ మాట్లాడుకుంటారు. అనసూయ తన తమ్ముడు వంటవాడని అందుకే దీపకి వంటలు బాగా వచ్చాయని అంటే కాంచన దీపకి పిలిచి వంట చేయమని చెప్పమని అంటుంది.


దీప జరిగిన దాని గురించి ఆలోచిస్తుందని అంటుంది. ఇక కాంచన వాళ్లిద్దరినీ మనమే కలుపుదామని అంటుంది. ఇక పాలు కాగుతున్న అనసూయకి చేయి కాలడంతో పెద్దగా కేక వేస్తుంది. దాంతో దీప వచ్చి ఈ పనులు మీకు ఎవరు చేయమన్నారు అని అంటుంది. దాంతో అనసూయ నువ్వు వంట చేయవు కదా అందుకే మేం చేస్తున్నాం అంటుంది. నువ్వు వంట చేస్తానంటే మేం వెళ్లిపోతాం అని అంటుంది అనసూయ. దాంతో దీప నేనే వంట చేస్తానని అంటుంది. ఇక కాంచన కాఫీ తాగాలని ఉంది పాలు పొంగించి కాఫీ పెట్టి ఇవ్వమని అంటుంది. ఇక దీప వంట చేయడానికి వెళ్తుంది. ఇక శౌర్య కార్తీక్ గదిలోకి తొంగి చూసి నాన్న అని పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!