Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్లు కార్తీక్ రెస్టారెంట్‌కి వచ్చి మమల్ని జాబులో తీసుకోమని చెప్తారు. మీరు నా రెస్టారెంట్‌కి వచ్చారని మీ సీఈవోకి తెలుసా అంటే ఇంతలో జ్యోత్స్న వస్తుంది. ఉద్యోగుల విషయంలో మోసం చేస్తున్నావు బావ అంటే నువ్వు నా భార్య, పిల్లల్ని చంపాలని చూశావని అంటాడు. మన కుటుంబాలు కలవాలనుకున్న ప్రతీ సారి నా మీద నింద వేస్తుందని అంటుంది. ఇప్పటికైనా ఓ మంచి మనిషిని పెళ్లి చేసుకొని మారు అని అంటాడు.

జ్యోత్స్న ఉద్యోగుల దగ్గరకు జ్యోత్స్నని తీసుకెళ్తే అక్కడ దీప వాళ్లని జ్యోత్స్న రెస్టారెంట్‌కి విడిపోవద్దని వాళ్లని ఒప్పిస్తుంది. అది కార్తీక్ జ్యోత్స్నకి చూపిస్తాడు. వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. దీప జ్యోత్స్నని చూసి వస్తుంది. వాళ్లు నా వరకు వచ్చారు అంటే అది నీ చేతకాని తనం అని వాళ్లతో మంచిగా మాట్లాడు అని చెప్తాడు. జ్యోత్స్న కోపంతో దీప ఉన్నంత వరకు నువ్వు గెలవలేవని వెళ్లిపోతుంది. శివనారాయణ జ్యోత్స్నని పిలిచి వర్క్‌ర్స్ ఎందుకు మానేస్తాం అంటున్నారు. ఎందుకు రెస్టారెంట్ లాస్‌లోకి వెళ్తుందని అడుగుతాడు.  దీపే ఇదంతా చేస్తుందని జ్యోత్స్న అంటే నువ్వు ఇలా ఉంటే ఎవరైనా పడగొడతారని అంటాడు. నువ్వు వాళ్ల రెస్టారెంట్‌ చుట్టూ తిరగడం మానేయమని కార్తీక్ ఎదుగుదల  మొదలైంది మనం పడిపోతున్నాం అది పూర్తిగా పడిపోకుండా పేరు నిలబెట్టండి అని అంటాడు. ఇక ఆస్తి పంపకాలు చేశానని చెప్తాడు. ఎల్లుండి లాయర్ వస్తారని అంటాడు. పంపకాల్లో ఏం రాశాడో తెలుసుకోవాలని పారు అనుకుంటుంది. 

శ్రీధర్‌కి కావేరి కాఫీ ఇస్తుంది. శ్రీధర్ భార్యని తిడతాడు. ఇదో భార్య ఆడో కొడుకు అని అని సెటైర్లు వేస్తాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు మాటలు విసురుకుంటారు. ఇంతలో పారిజాతం వస్తుంది. ఏమైంది అది అడిగితే కొంపలు మునిగిపోతున్నాయిని అంటుంది. ఇక కాఫీ పారు తీసుకుంటే ఏమైనా కలిపావే అని శ్రీధర్ అంటాడు. అదేంటి అలా అంటే ఇది పార్టీ మార్చేసిందని అంటాడు. ఇక పారు లాయర్ వినాయకురావు నీ ఫ్రెండ్‌ కదా మీ మామయ్య ఆస్తి పంపకాలు చేశారు ఒకసారి అడుగు అంటుంది. నేను అడిగితే ఆ విషయం మామయ్యగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు నేనేం సాయం చేయలేను అని అంటాడు. పారిజాతాన్ని పంపేసిన తర్వాత దొరికావు మామ అని భార్యని తీసుకొని శ్రీధర్ బయల్దేరుతాడు. ఎక్కడికి అని కావేరి అడిగితే మంట పెట్టడానికి అని అంటాడు. వీలునామాలో ఏముందో తెలుసుకోవాలని పారు భర్తని బిస్కట్ వేయడానికి వెళ్తుంది. పతి దేవుడు అని అంటుంది.

పారు మాట్లాడే ప్రతీ మాటకు శివన్నారాయణ సెటైర్లు వేస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసని వీలునామా వివరాలు తెలుసుకోవడానికే వచ్చావ్ కదా నీ వేషాలు నా దగ్గర చెల్లవు బయల్దేరు అని పంపేస్తాడు. ఇక అనసూయ బూజు దులుపుతుంటే దీప, కార్తీక్‌లు వాళ్లని రెస్టారెంట్‌కి పిలుస్తాడు. ఇంతలో కావేరి, శ్రీధర్‌లు అక్కడికి వస్తారు. అందరూ శ్రీధర్‌ని వదిలేసి కావేరికి మర్యాదలు చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!